Home Guards Suspension In AP: - నకిలీ డి.ఓలతో చేరిన 87 మంది హోంగార్డులపై డిఐజీ సిరియస్..
- హోంగార్డు ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ..
చిత్తూరు జిల్లాలో నకిలీ డి.ఓ లతో 87 మంది హోంగార్డులుగా చేరడంపై అనంతపురం రేంజ్ డి.ఐ.జి ఎం.రవిప్రకాష్ సీరియస్ అయ్యారు.. 2014-2019 సంవత్సరాల మధ్య కాలంలో చిత్తూరు జిల్లాలో నకిలీ డి.ఓ లు సృష్టించి 87 మంది హోంగార్డులుగా చేరి విధులు నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు చిత్తూరు జిల్లా ఎస్పీ వై.రిషాంత్ రెడ్డి ఆధ్వర్యంలో పూర్తీ స్థాయి విచారణ జరుగుతుంది.. ఈ కేసులో కొంతమంది వ్యక్తులు నకిలీ డి.ఓ లు సృష్టించి ఈ 87 మందిని హోంగార్డులుగా చేర్చినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడింది.. ఈ తతంగంలో కొందరు డబ్బులు తీసుకుని కీలక పాత్ర పోషించినట్లు ప్రాథమిక సమాచారం.. దీనిపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.
ఇందులో కీలక పాత్ర పోషించిన వ్యక్తుల వివరాలు, ఈ తతంగం ఎలా కొనసాగిందనే కోణంలో కూలంకుషంగా దర్యాప్తు చేయాలని డి.ఐ.జి చిత్తూరు ఎస్పీని ఆదేశించినట్లు తెలుస్తొంది.. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై Cr.No.185/2022, u/s 420,419, 409, 468, 471 r/w 120(B) IPC సెక్షన్ల క్రింద క్రిమినల్ కేసు నమోదు చేసిన పోలీసులు, తదుపరి చర్యలకు సిద్ధమయ్యారు.. అక్రమంగా హోంగార్డులుగా చేరిన ఈ 87 మందిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ చిత్తూరు ఎస్పి రిశాంత్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేపట్టి అసలు విషయాలు బయటికి తీయాలని చిత్తూరు జిల్లా ఎస్పీ వైరిషాంత్ రెడ్డిని డి.ఐ.జీ ఆదేశించారు.
క్లూ వదలకుండా దొంగతనం చేయడం వారి స్టైల్ - కానీ వారినీ పట్టేయడం చిత్తూరు పోలీసుల స్పెషాలిటీ !
బ్యాంకులు, బంగారు నగల దుకాణాలు, పాన్ బ్రోకర్ దుకాణాలు,ఒంటరి ఇండ్లను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడే అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు చేందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ను చిత్తూరు పొలీసులు అరెస్టు చేశారు. ఎటువంటి క్లూస్ దొరకకుండా 15 ఏళ్ళుగా దొంగతనాలకు పాల్పడుతూ 10 ఏళ్ళుగా పోలీసులకు చిక్కకుండా చత్తీస్‌గఢ్ లో స్ధావరం ఏర్పరుచుకుని నాలుగు రాష్ట్రాల పోలీసులను ముప్పు తిప్పలు పెడుతోంది ఈ గ్యాంగ్. ఒక్కటిన్నర నెలగా వివిధ రాష్ట్రాలను దర్యాప్తు సాగించి ఎట్టకేలకు ముఠా సంబంధి వివరాలను సేకరించి ముఠాలోఏ-1,ఏ-2 ప్రధాన నిందితులును పోలీసులు చాకచక్యంగా పట్టుకుని వారి వద్ద నుండి 55 లక్షల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు, 3 కార్ల స్వాధీనం చేసుకున్నా చిత్తూరు పోలీసులు.
ఏళ్లుగా ఎవరికీ చిక్కకుండా.. దొరకకుండా దొంగతనాలు !
చిత్తూరు జిల్లాలో ఇటీవల గంగాధర నెల్లూరు పొలీసు స్టేషన్ ఫరిధిలో పాన్ బ్రోకర్ షాపులో భారీ దొంగతనం జరిగింది. ఈ కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా గత ఒకటిన్నర నెల నుండి ఈ కేసు గురించి దక్షిణ భారత దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలలో తిరిగి నేరస్తులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు. శనివారం సాయంత్రం 3.00 గంటలకు ప్రత్యేక బృందానికి అందిన ఖచ్చితమైన సమాచారం మేరకు ప్రత్యేక బృందాలు చిత్తూరు మండలం పరిధిలోని బెంగళూరు – తిరుపతి రోడ్డులోని చెర్లోపల్లి వద్ద మురుగన్ శివగురు @ కరాటే మురుగా, రాజాలను అరెస్టు చేసి వారి వద్ద నుండి 15 లక్షల నగదు, 395 గ్రాముల బంగారు ఆభరణాలు, 6 kg ల వెండి, నేరానికి ఉపయోగించిన 3 కార్లను మొత్తం 55 లక్షల విలువ చేసే క్రైం ప్రాపర్టీని స్వాధీనం చేసుకున్నారు.