అలిపిరి నడక మార్గంలో విషాదం నెలకొంది. అలిపిరి నడక మార్గంలో చిన్నారిపై చిరుత దాడి చేసింది. ఆరేళ్ల లక్షితను అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లింది.
చిరుత దాడిలో తీవ్రంగా గాయపడిన లక్షిత మృతి చెందింది. తమ బిడ్డను చిరుతు లాక్కెళ్లిందని పోలీసులకు పాప తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. లక్షిత మృతి దేహం కోసం టిటిడి అటవీ శాఖ, విజిలెన్స్, పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
అలిపిరి నడక మార్గంలో నరసింహ స్వామి ఆలయం వద్ద ఈ దాడి జరిగింది. నెల క్రితం మూడేళ్ళ బాలికపై చిరుత దాడి చేసింది.
రాత్రి తిరుమలకు వెళ్తున్న టైంలో పాపను చిరుతు లాక్కెళ్లిపోయింది. అయితే పాపా తప్పిపోయిందని అంతా అనుకున్నారు. తమతో వచ్చిన పాప కనిపించడం లేదని పోలీసులుకు లక్షిత ఫ్యామిలీ ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సీక్రెట్‌గా విచారణ చేపట్టారు. రాత్రాంతా గాలింపు చర్యలు చేపట్టారు.
పాప మృతదేహాన్ని గుర్తించిన భక్తులు
రాత్రంగా గాలింపు చర్యలు చేపట్టినా పోలీసులు, టీటీడీ సిబ్బంది పాప కనిపించలేదు. ఉదయం సెర్చ్ ఆపరేషన్ చేపట్టాలని నిర్ణయానికి వచ్చారు. అయితే కాలినడకన వెళ్తున్న భక్తులకు లక్షిత డెడ్‌బాడీ కనిపించింది. చాలా మంది ఆ దృశ్యాలను చూసి భయపడిపోయారు. వెంటనే కొందరు తిరుమల సిబ్బంది, పోలీసులకు ఫిర్యాదు చేశారు.
భక్తుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి డెడ్‌బాడీని పరిశీలించారు. ఫ్యామిలీ చెప్పిన ఆనవాళ్లు ఉండటంతో అది లక్షిత మృతదేహంగా గుర్తించారు. భక్తుల ద్వారా సమాచారం విషయం బయటకు వచ్చింది.
పాప మృతదేహాన్ని పాస్టుమార్టం కోసం రుయా ఆసుపత్రికి తరలించారు. పాప మృతితో ఆ ఫ్యామిలీ తీవ్ర విషాదంలో కూరుకుపోయింది. తిరుమలేశుడి దర్శనానికి వస్తే పాప ప్రాణం పోయిందని బోరుమంటోందా ఫ్యామిలీ.
జూన్ 22న బాలుడిని ఎత్తుకెళ్లిన చిరుత
తిరుమల అలిపిరి నడక మార్గంలో తరచూ చిరుత భయ పెడుతోంది. జూన్‌లో కూడా ఓ బాలుడిని ఎత్తుకెళ్లింది. ఏడో మైలు వద్ద చిరుత ఐదేళ్ళ బాలుడిపై దాడి చేసి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లింది. బాలుడితో పాటుగా ఉన్న బాలుడి తాత, భక్తులు కేకలు వేస్తూ అటవీ ప్రాంతంలో చిరుతను వెంబడించడంతో దాదాపు 150 మీటర్ల దూరంలో చిరుత బాలుడిని వదిలి వెళ్ళింది. ఐతే అటవీ ప్రాంతంలో ఏడుస్తున్న బాలుడిని గుర్తించిన అటవీ శాఖ ఉద్యోగి సురక్షితంగా అటవీ ప్రాంతం నుంచి బయటకు తీసుకొచ్చి టీటీడీ విజిలెన్స్, పోలీసు సిబ్బందికి సమాచారం అందించారు. చిరుత దాడిలో బాలుడి తలకు, గుండె భాగంలో తీవ్రంగా గాయాలు అయ్యాయి.
సమాచారం తెలుసుకున్న టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి సంఘటన స్ధలానికి చేరుకుని బాలుడిని హుటాహుటిన 108 వాహనంలో తిరుపతిలోని చిన్న పిల్లల ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చిరుత దాడి ఘటనలో గాయపడ్డ బాలుడిని టీటీడీ ఈఓ ధర్మారెడ్డి పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించిన అధికారులు సురక్షింతంగా బాలుడిని వాళ్ల ఫ్యామిలీకి అప్పగించారు.
2009లో కూడా నడక మార్గంలో ఓ చిన్నారిపై అటాక్ చేసింది. అయికే భక్తులు వెంటనే రియాక్ట్ కావడంతో పాపను అక్కడే వదిలేసి వెళ్లిపోయింది. పాప గాయాలతో సురక్షితంగా బయపడింది.