Security Increase to YS Sharmila: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు (Ap Congress Chief) వైఎస్ షర్మిల (YS Sharmila)కు కి 2+2 గన్ మెన్లను కేటాయించినట్లు కడప (Kadapa) జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ (SP Sidhartha Kaushal) తెలిపారు. సెక్యూరిటీ పెంచాలంటూ వైఎస్ షర్మిల కొద్ది రోజుల క్రితం డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని కోరారు. స్పందించిన డీజీపీ కడప జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో వన్ ప్లస్ వన్ గన్ మెన్లు ఉంటే దాన్ని టు ప్లస్ టుగా పెంచారు. భద్రతా ప్రమాణాల నిబంధనల మేరకు వైఎస్ షర్మిలకు భద్రతా కల్పించానని అన్నారు.. కడప జిల్లా ఎస్పీ కౌశల్. ఎవరైనా వ్యక్తులకు ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, వారికి గన్ మెన్లను కేటాయించమని ఇంటెలిజెన్స్ విభాగం ఇచ్చే సిఫారసు మేరకు గన్ మెన్లను కేటాయించడం జరుగుతుందని అన్నారు.


స్థానికంగా ప్రోటోకాల్ అంశాలను పరిగణలోకి తీసుకొని భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని సిద్ధార్థ కౌశల్ వెల్లడించారు. గతంలో షర్మిలకు తెలంగాణ పోలీసులు... 4+4 భద్రత కల్పించారని... ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టడంతో ఏపీ సర్కార్ 1+1 సెక్యూరిటీ ఏర్పాటు చేసింది. 4+4 భద్రత, ఎస్కార్ట్‌ వాహనం ఏర్పాటు చేయాలని కోరుతూ జనవరి 22న డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డికి షర్మిల లేఖ రాశారు.


వైఎస్‌ షర్మిల 4+4 సెక్యూరిటీ కలిగి ఉండేవారని.. ప్రజాక్షేత్రంలో చురుగ్గా ఉన్న ఈ తరుణంలో 1+1కు తగ్గించారని కాంగ్రెస్ నేతలు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి తెలిపారు. కార్యకర్తల సమావేశాల కోసం ఆమె రాష్ట్రమంతా పర్యటిస్తున్నారని... ఈ క్రమంలో అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయని గుర్తు చేశారు. అత్యవసరంగా ఆమెకు.. 4+4 సెక్యూరిటీ, ఎస్కార్ట్‌ వాహనం ఏర్పాటు చేయాలని సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ డీజీపీని కోరారు. ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న తనకు రక్షణ కల్పించడం లేదంటూ ఏపీ ప్రభుత్వాన్ని వైఎస్ షర్మిల నిలదీశారు. తనకు చెడు జరగాలనే ఇదంతా చేస్తున్నారా ? అంటూ హాట్ కామెంట్స్ చేశారు. మీకు సెక్యూరిటీ ఉంటే సరిపోతుందా? ప్రతిపక్ష నేతలకు భద్రత అవసరం లేదా ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అధ్యక్షురాలిగా రాష్ట్రమంతటా తాను విస్తృతంగా పర్యటించాల్సి ఉంటుందని.. తనకు భద్రత కావాలని అడిగినా ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. తమ చెడు కోరుకుంటున్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతోందని ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. 


కొన్ని రోజుల క్రితం మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్...ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి అంతమొందించినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదన్నారు. షర్మిలకు ప్రత్యేక భద్రత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. రాజశేఖర్‌రెడ్డి ఆస్తిలో షర్మిలకు వాటా రాశారని..వాటిని జగన్మోహన్ ఇవ్వడం లేదని ఆరోపించారు.  జగన్‌కు తల్లి, చెల్లి, బాబాయ్‌ అనే తేడా ఉండదన్నారు. ఈడీ అటాచ్‌మెంట్‌లో ఉన్న ఆస్తులు చేజారిపోతాయనే భయం జగన్‌కి ఉందన్న అయ్యన్నపాత్రుడు.. రాజశేఖర్‌రెడ్డి ఇచ్చిన ఆస్తులను పంచడం లేదన్నారు. సీఎం జగన్ సిద్దం సభలో క్యాట్ వాక్ చేయడానికి శిలువను ఉపయోగించుకోవడం అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రా పగటి వేషగాడా అంటూ జగన్ పై విరుచుకుపడ్డారు.