AP CM YS Jagan inaugurates Parakamani building in Tirumala: తిరుపతి: తిరుమలలో ఏపీ సీఎం‌ జగన్ మోహన్ రెడ్డి రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. రెండో రోజు పర్యటనలో‌ భాగంగా బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని ఏపీ సీఎం జగన్ దర్శించుకున్నారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి అభిముఖంగా నిర్మించిన నూతన పరకామణి భవనాన్ని జగన్ ప్రారంభించారు. ఆధునిక వసులతో ఏర్పాటు చేసిన ఈ భవనంలో కానుకల లెక్కింపును భక్తులు చూసేందుకు వీలుగా రెండు వైపులా అద్దాలు ఏర్పాటు చేసిందిన తిరుమల తిరుపతి దేవస్థానం (TTD). 


పరకామణి భవనంలో స్ట్రాంగ్ రూమ్‌ ఏర్పాటు..
శ్రీవారి ఆలయం నుంచి స్వామి వారీ కానుకుల హుండీలను బ్యాటరీ కార్ల ద్వారా భవనానికి తరలించిన తర్వాత సిబ్బంది లెక్కింపు నిర్వహించే విధంగా ఏర్పాటు చేశారు. సిబ్బంది కింద కూర్చోవాల్సిన అవసరం లేకుండా టేబుల్స్ కుర్చీలు ఏర్పాటు చేయడంతో పాటుగా, కానుకలు భద్రపరిచేందుకు వీలుగా పరకామణి భవనంలో స్ట్రాంగ్ రూమ్‌ను సైతం టీటీడీ నిర్మించింది. నాణేలను వేరు చేసేందుకు 2.50 కోట్లతో ఆటోమేటిక్ సెగ్రిగేషన్ మిషన్ ను టీటీడీ ఏర్పాటు చేసింది. ఆ తర్వాత మరో యంత్రం సాయంతో కౌంటింగ్, ప్యాకింగ్ చేసేందుకు మిషనరీలను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా సిబ్బంది కోసం మరుగుదొడ్లు ఇతర అన్ని సౌకర్యాలు పరకాల భవనంలోనే టీటీడీ ఏర్పాటు చేసింది. దాతలు అందించిన 23 కోట్ల విరాళంతో పరకామణి భవనం టీటీడీ నిర్మించింది. నాణేలను వేరు చేసేందుకు 2.50 కోట్లతో ఆటోమేటిక్ సెగ్రిగేషన్ మిషన్ టిటిడి ఏర్పాటు చేసింది. ఆ తర్వాత మరో యంత్రం సాయంతో కౌంటింగ్, ప్యాకింగ్ చేసేందుకు మిషనరీలను ఏర్పాటు చేసింది.. అంతేకాకుండా సిబ్బంది కోసం మరుగుదొడ్లు ఇతర అన్ని సౌకర్యాలు పరకాల భవనంలోనే టీటీడీ ఏర్పాటు చేసింది.


శ్రీవారిని దర్శించుకున్న సీఎం జగన్..
సాంప్రదాయ వస్త్రాలతో తిరునామం ధరించి స్వామి వారి సేవలో పాల్గోన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ఆలయ మహా ద్వారం వద్దకు చేరుకున్న సీఎం జగన్ కు ఆలయ అర్చకులు, అధికారులు.. టిటిడి చైర్మన్ వైవి. సుబ్బారెడ్డి, టీటీడీ ఈవో ఏవి. ధర్మారెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనానంతరం శ్రీ వకుళా మాతను, ఆలయప్రదక్షిణగా వచ్చి శ్రీ విమాన వెంకటేశ్వర స్వామి వారిని, సబేరా, భాషకార్ల సన్నిధి, శ్రీ యోగి నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో సీఎం జగన్ కు వేదాశీర్వచనం అందించారు వేద పండితులు. అనంతరం వైసీపి నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నూతనంగా నిర్మించి, టిటిడికి ఇచ్చిన భవనాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. అనంతరం పద్మావతి అతిథి గృహానికి చేరుకుని అల్పాహారం స్వీకరిస్తారు. అక్కడి నుంచి రేణిగుంట విమానాశ్రయానికి ప్రయాణం అవుతారని సమాచారం.


వైభవంగా తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు..
రెండోవ రోజు ఉదయం చిన్నశేష వాహనంపై ఊరేగుతూ భజ్తులకు దర్శనం ఇవ్వనున్న మలయప్ప స్వామి..
మధ్యాహ్నం స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా తిరుమంజనం నిర్వహించనున్న అర్చకులు..
రాత్రి హంస వాహనంను అధిరోహించి తిరుమాఢ వీధుల్లో ఊరేగనున్న మలయప్ప స్వామి..