Gold Theft at Tirumala Temple | తిరుమల: వైకుంఠ ద్వార దర్శనాలకు కలియుగ దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో అపచారం జరగకుండా అడ్డుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి పరకామణి బంగారం చోరీకి యత్నించిన అగ్రిగోస్ ఔట్సోర్సింగ్ ఉద్యోగి ఉద్యోగి అడ్డంగా బుక్కయ్యాడు. బ్యాంకు ఉద్యోగి పెంచలయ్య దాదాపు వంద గ్రాముల పరకామణి బంగారం బిస్కెట్ ఎత్తుకెళ్తున్నాడు. విజిలెన్స్ సిబ్బంది తనిఖీలు నిర్వహించగా అతడి వద్ద గోల్డ్ బిస్కెట్ దొరకడం కలకలం రేపుతోంది. బ్యాంకు ఉద్యోగి తెలివిగా వ్యర్థాలను బయటకు తరలించే ట్రాలీలో బంగారం బిస్కెట్‌ను ఉంచాడు. విజిలెన్స్ తనిఖీలలో బంగారం గుర్తించిన సిబ్బంది, పెంచలయ్యను అదుపులోకి తీసుకున్నారు. శ్రీవారి బంగారం చోరీకి యత్నించిన నిందితుడ్ని తిరుమల వన్ టౌన్ పోలీసులకు విజిలెన్స్ సిబ్బంది అప్పగించారు.
Tirumala News: శ్రీవారి హుండీలో బంగారం చోరీకి యత్నం, విజిలెన్స్‌కు అడ్డంగా దొరికిన ఉద్యోగి
Shankar Dukanam | 12 Jan 2025 09:44 AM (IST)
Tirumala_(1)