మూడు రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు తాపత్రయాన్ని కుప్పం ప్రజలు గమనిస్తూనే ఉన్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు తాపత్రయం చూస్తుంటే జాలి వేస్తుందన్నారు. జాతీయ కబడ్డీ పోటీలు ముగింపు సందర్భంగా తిరుపతికి వచ్చిన మంత్రి ఓ ప్రైవేటు హోటల్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం అక్కడి ప్రజలకు జరిగిన నష్టంగా చంద్రబాబు మాట్లాడుతున్నారని, అసలు ఎందుకు ఓడిపోయారో చంద్రబాబు రియలైజ్ అవ్వాలని ఆయన అన్నారు. కుప్పంలో ప్రభుత్వ పథకాల అమలుపై అక్కడి ప్రజలతో వాకాబు చేసి మాట్లాడి ఉంటే బాగుండేదని ఆయన చెప్పారు. చంద్రబాబు ఏం ఉద్ధరించారని ఆయనకు ప్రజలు ఓటేయాలని, ప్రజలతో మమేకమైన మంత్రి పెద్దిరెడ్డి గురించి చంద్రబాబు మాట్లాడం సరైనది కాదన్నారు.
శ్రీబాగ్ ఒడింబడిక ప్రకారం కర్నూలులో హైకోర్టు
చంద్రబాబు చరిత్ర ముగిసిందని, ఆయన చెప్పే మాటలు ప్రజలు వినే రోజులు పోయాయని మంత్రి బొత్స అన్నారు. చంద్రబాబు ఆవేశపడి జిమ్ముక్కులు చేయడం మానుకోవాలన్నారు. అధికారంలోకి వస్తే ఓటీఎస్ ను రద్దు చేస్తామని చెబితే ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. ఓటీఎస్ స్వచ్ఛంద పథకం, ఎవరినీ బలవంత పెట్టడం లేదని, శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం కర్నూలులో హైకోర్టును తప్పకుండా తరలించి తీరుతామన్నారు. ఓటీఎస్ ను ఉచితంగా అమలు చేయాలని చెబుతున్న చంద్రబాబు తను అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఓటీఎస్ ను ప్రజలు వ్యతిరేకించలేదని, టీడీపీ నాయకులే వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. కుప్పంలో లైసెన్సులు లేకుండా మైనింగ్ జరుగుతుంటే చంద్రబాబును గ్రీన్ ట్రిబ్యూనల్ కు వెళ్లమనండని ఆయన అన్నారు.
Also Read: చంద్రబాబు ఇది రాసి పెట్టుకో... ఏపీకి జగన్ శాశ్వత ముఖ్యమంత్రి... మంత్రి సీదిరి అప్పలరాజు
చంద్రబాబు, పవన్ లవ్ స్టోరీ ఎవ్వరికీ అర్థం కాదు
పవన్ కళ్యాణ్ పేరు చెబితే నవ్వు వస్తోందన్న బొత్స... చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఎప్పుడు లవ్ చేసుకుంటారో, ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో, విడాకులు తీసుకుంటారో ఎవ్వరికీ తెలియదన్నారు. మూడు రాజధానులకు వైసీపీ కట్టుబడి ఉందని, త్వరలోనే కొత్త బిల్లుతో ప్రజల ముందుకు వస్తామన్నారు. రఘురామకృష్ణరాజు రాజీనామా అతని సొంత విషయమని, రఘురామ గురించి మాట్లాడటం టైంవేస్ట్ అన్నారు. క్యాబినేట్ గురించి చెప్పడానికి జ్యోతిష్యున్ని కాదన్న బొత్స.. క్యాబినెట్ అనేది పూర్తిగా సీఎం పరిధిలోని అంశమన్నారు. వైఎస్ షర్మిల ఏపీలో పార్టీ పెడితే తమకెలాంటి ఇబ్బంది లేదని, ఏపీలో ఉన్న పది పార్టీల్లో ఆమె పార్టీ కూడా ఒకటిగా మిగిలిపోతుందని విమర్శించారు.
Also Read: లైంగిక వేధింపులు వర్సెస్ చికెన్ పకోడా ... ఎస్వీ ఓరియంటల్ కళాశాలలో రచ్చ రచ్చ
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి