Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ రేపు(మంగళవారం) భక్తులకు అందుబాటులోకి తీసుకురానుంది. ఆగస్టు నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్ల కోటాను మే 24న మంగళవారం ఉదయం 9 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అదే విధంగా ఆగస్టు నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, జులై నెలకు సంబంధించిన అష్టదళ పాద పద్మారాధన సేవ టికెట్లను మే 24 మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. మే 26వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు భక్తులు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 26వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఆన్‌లైన్ డిప్ తీసి సేవా టికెట్లు పొందిన వారికి సమాచారం అందిస్తారు. భక్తులు ఆన్‌లైన్‌లో సొమ్ము చెల్లించి సేవా టికెట్లు పొందాల్సి ఉంటుంది. అయితే జులై, ఆగస్టు నెలలకు సంబంధించిన వర్చువల్ కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవా టికెట్ల బుకింగ్ మే 25వ తేదీ ఉదయం 9 గంటల నుంచి మొదలవుతుంది.
Tirumala Darshan Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, రేపు ఆర్జితసేవా టికెట్ల ఆగస్టు నెల కోటా విడుదల
ABP Desam | Satyaprasad Bandaru | 23 May 2022 07:11 PM (IST)
Tirumala Darshan Tickets : తిరమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ మంగళవారం విడుదల చేయనుంది. ఆగస్టు నెలకు సంబంధించి శ్రీవారి సేవలకు సంబంధించిన కోటాను భక్తులకు అందుబాటులో ఉంచనుంది.
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు