Rayalaseema Migration :  ఉపాధి కోసం రాయలసీమ నుంచి పెద్ద ఎత్తున జనం వలస పోతున్నారు. ఈ కారణంగా సీమ జిల్లాల్లోని గ్రామాలకు గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. వేల మంది  పేదలు, కౌలు రైతులు నగరాలకు, పట్టణాలకు, వ్యవసాయ పనులు ఉన్నచోట్లకు వలస పోతున్నారు.   కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో కొన్ని వందల కుటు-ంబాలది ఇదే దీనస్థితి. ముఖ్యంగా జిల్లాలోని ఆదోని, కోసిగి, హోళగుంద, ఎమ్మిగనూరు మం డలాల నుంచి వలసలు ప్రారంభమయ్యాయి. గత 20 రోజు ల్లో దాదాపు 30వేల మంది వలసపోయారు. కోసిగి మండ లం దుద్ది నుంచి వందమంది హైదరాబాద్‌ పరిసర ప్రాంతా లకు, కోసిగి నుంచి సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలకు పత్తి విడిపించే పనుల కోసం వెళ్లినట్లుగా చెబుతున్నారు.  


పంటలు పండక అప్పుల పాలై వలస బాట పడుతున్న పేదలు, రైతులు 
  
సాగు భూములు లేని వందలాది రైతు కూలీలు కర్నూలు జిల్లా నుంచి తెలంగాణలోని పాలమూరు, హైదరబాద్‌కు చేరుకుంటున్న వారిలో అధికంగా ఉన్నారు. ఇక్కడ సాగు చేసిన పత్తి పంటలల్లో కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కర్నూలు జిల్లా కొస్గి మండలం నేల కోస్గిలో వాల్మీకి బోయలు అధికంగా ఉన్నారు. వీరికి ఎలాంటి కుల వృత్తి లేదు. దీంతో అధిక భాగం పంట పోలాల్లో కూలీలుగా పనిచేసి పొట్టపోసుకుంటారు. వీరికి ఎలాంటి స్థిర, చర ఆస్తులు లేవు. ఏటా ఖరీఫ్‌, రబీ సమయంలో వివిధ ప్రాంతాలకు వలసలు పోతుంటారు. వ్యవసాయ పనులు లేకుంటే బెంగళూరు వెళ్లి సిమెంటు- ఫ్యాక్టరీలో పనిచేస్తారు. వీరు వలసల జీవులుగా జీవిస్తుండడం వల్ల వీరి పిల్లలు చదువుకు దూరం అవుతున్నారు. తమ పిల్లలను వెంట తీసుకొని ఎక్కడ ఉపాధి లభిస్తే అక్కడ వెళ్తూంటారు. 


ఎనిమిది నెలలు వలస వెళ్లి పనులు చేసుకునే వేల మంది పేద గ్రామీణులు


వర్షాకాలంలో నాలుగు నెలలు తప్ప మిగతా ఎనిమిది నెలలు సొంత ఊరికి దూరంగానే వీరు కాలం వెల్లదీస్తారు. ఇలా వలసలు వెళ్లేందుకు ప్రధాన కారణం తమ జీవనోపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎటు-వంటి చర్యలు తీసుకోక పోవడం వల్లే వలస వెళ్తున్నట్లు వెల్లడిస్తున్నారు. దేశమంతా ఉపాధి హామీ పనులు జరుగుతుంటే కర్నూలు జిల్లాలో మాత్రం పనులు చేయకుండా నిధులు దారి మళ్ళిస్తున్నట్లుగా రాజకీయ పార్టీల ఆరోఫణలున్నాయి .ఈ అంశంపై ఏపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.  రైతులు, రైతు కూలీలు, ఊళ్ళకు ఊళ్ళు రాయలసీమలోనే ఎందుకు వలస వెళ్తున్నారు ? ఇదే విధంగా వేలమంది కోస్తా ప్రాంతంలో ఎందుకు వలస వెళ్లడం లేదు? ముఖ్యమంత్రి జగన్ గారూ ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. 


ప్రభుత్వం సమాధానం  చెప్పాలంటున్న ఏపీ బీజేపీ 


ప్రభుత్వం చేపట్టిన అనేక  పథకాల వల్ల ప్రజలకు పెద్ద ఎత్తున డబ్బులు అందుతున్నాయని వలసలు వెళ్లే అవకాశం లేదని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ వాదన కరెక్ట్ కాదని..  సీమ నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్న పరిస్థితులు తెలియచెబుతున్నాయంటున్నారు. ప్రభుత్వం ఈ అంశంపై సమాధానం చెప్పాలని అంటున్నారు.