YSRCP Gannavaram : అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వరుసగా నియోజకవర్గ పంచాయతీలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే రామచంద్రాపురం నియోజకవర్గంలో రాజ్యసభ సభ్యుడు, మంత్రి కి మద్య విభేదాలు రచ్చకెక్కాయి. తాజాగా గన్నవరం ఎపిసోడ్ కూడా అధికార పార్టీలో తెర మీదకు వచ్చింది గన్నవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు స్దానిక శాసన సభ్యుడు వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. ఇప్పటి కే ఈ వ్యవహరం పై స్వయంగా ముఖ్యమంత్రి జగన్ కూడ ఆరా తీశారు. వల్లభనేని వంశీకి సీటు ఇస్తామని పార్టీ నాయకత్వం స్పష్టం చేసింది. అయితే వంశీ కి సీటు ఇవ్వటం పై గన్నవరంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. స్దానిక నాయకులు దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకటరావు వంశీకి వ్యతిరేకంగా మరో సారి సమావేశం అయ్యారు. వంశీకి ఎట్టిపరిస్దితుల్లో మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదని, వైఎస్ఆర్ కాంగ్రెస్ స్థానిక నాయకత్వం కుండబద్దలు కొట్టి చెబుతోంది.
వంశీకే సీటిస్తామని గతంలో హామీ ఇచ్చిన జగన్
అయితే గన్నవరం నియోజకవర్గం సీటు తనదేనని శాసన సభ్యుడు వల్లభనేని వంశీ చెబుతున్నారు. గతంలో ముఖ్యమంత్రి జగన్ తనకు స్వయంగా హామీ ఇచ్చారని చెబుతున్నారు. అయితే స్దానిక నాయకత్వం పార్టీ కి వ్యతిరేకంగా కార్యకలాపాలను నిర్వహించటం సమంజసం కాదని వంశీ గతంలో బహిరంగంగా వ్యాఖ్యానించారు. అయితే తెలుగు దేశం పార్టి టిక్కెట్ పై గెలిచిన వంశీ, ఎన్నికల తరువాత పార్టీ మారి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టిలో చేరటం తో వివాదానికి కారణం అయ్యింది. వంశీకి సీటు ఇస్తే ఎట్టి పరిస్దితుల్లో తాము సహకరించేది లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు బహిరంగంగా హెచ్చరికలు జారీ చేశారు.
పలు నియోజకవర్గాల్లో ఇలాంటి సమస్యలతో వైసీపీ నాయకత్వం సతమతం
ఎన్నికల సమయంలో పార్టీల్లో నేతల మద్య విభేదాలు బయట పడట కామన్ గా జరుగుతుంటాయి. అయితే అధికార పార్టీలో గ్రూపుల గోల ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. అటు మంత్రి జయరాం నియోజకవర్గంలో కూడ అదే సీన్ కనిపిస్తోంది. కపట్రాళ్ల బొజ్జమ్మ మంత్రి నిర్వహించే కార్యక్రమాలకు దూరంగా ఉండటం పార్టీలో చర్చకు దారితీసింది. ఇటీవలే కపట్రాళ్ళ ఫ్యామిలీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఇలా వరుసగా వివాదాలు నెలకొంటున్న నేపద్యంలో పార్టీలో పరిస్దితులు పై అధి నాయకత్వం ప్రత్యేకంగా శ్రద్ద పెట్టింది.
ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుని పరిష్కారం చేసే ప్రయత్నం
పార్టీ నాయకత్వం కూడా ఆయా నియోజకవర్గాల పరిస్దితులు పై ఎప్పటికప్పుడు నివేదికలను తెప్పిస్తోంది. ఐ ప్యాక్ టీం లతో పాటుగా, ప్రైవేట్ సర్వేల ద్వారా కూడ నియోజకవర్గాల రిపోర్ట్ లను తెప్పిస్తున్నారు. అధికార పక్షంలో ఉన్నప్పటికి నాయకులు చివరి క్షణంలో, సీటు కోసం పార్టీని ఇరకాటంలోకి నెట్టటం సీఎం జగన్ సీరియస్ గా ఉన్నారని అంటున్నారు. కొంత మంది నేతల్ని వదులుకోవడానికైనా సిద్ధమేనని జగన్ సంకేతాలు పంపుతున్నారని చెబుతున్నారు.