Polavaram : పోలవరం జాప్యానికి ఏపీ ప్రభుత్వం వద్ద సరైన ప్రణాళిక లేకపోవడం.. కరోనా  కారణమని కేంద్రం చెప్పేపింది.  రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల అడిగిన ప్రశ్నకు జలశక్తి సహాయశాఖ మంత్రి బిశ్వేశ్వర్ లిఖిత పూర్వక సమాధానం చెప్పారు. పోలవరం గడువును మరోసారి కేంద్రం పొడిగించింది. 2024 జులై నాటికే పోలవరం పూర్తి సాధ్యమవుతుందని కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ తెలిపారు. వ్యూహాత్మక ప్రణాళికా లేకపోవడం వల్ల కూడా పోలవరం జాప్యం అవుతోందన్నారు. ఏపీకి పోలవరం ప్రాజెక్టు అమలు చేస్తున్న ఏజెన్సీతో సమన్వయ లోపం కూడా పోలవరం జాప్యానికి ప్రధాన కారణమేనని చెప్పారు. కరోనా కూడా పోలవరం జాప్యానికి మరో కారణంగా చెప్పారు. 


దశలవారీగానే పోలవరం పూర్తి చేయగలమన్న అంబటి రాంబాబు


మరో వైపు పోలవరం ప్రాజెక్ట్ ఇప్పుడల్లా పూర్తి కాదంటూ ఏపీ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. దశలవారీగా మాత్రమే పోలవరం పూర్తి చేయడం కుదురుతుందని తెలిపారు.  సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తామన్నారు. త్వరలో పోలవరం ప్రాజెక్ట్‌పై శ్వేతపత్రం విడుదల చేస్తామని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. 2021 కల్లా పూర్తి చేస్తామని అధికారంలోకి వచ్చిన కొత్తలో జలవనరుల మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ పలుమార్లు ప్రకటించారు. శాసనసభలో సవాల్ కూడా చేశారు. అయితే మంత్రి మారిన తర్వాత  మాట కూడా మారిపోయింది. 


రివర్స్ టెండర్ల వల్ల ప్రాజెక్టుకు నష్టం జరిగిందన్న టీడీపీ
 
తమ  ప్రభుత హయాంలో   పోలవరం పనులు 75 శాతం అయిపోయాయని అప్పుడు టీడీపీ నేతలు చెబుతూ ఉంటారు.  కేవలం 25 శాతం పనులు కూడా వైసీపీ (Ycp) ప్రభుత్వం చేయలేకపోతోందని కొంతకాలంగా టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. కొద్ది రోజులుగా పోలవరం ప్రాజెక్ట్‌పై ఏపీలో విస్తృతమైన చర్చ జరుగుతోంది. రివర్స్ టెండర్లు..ఇతర అంశాల కారణంగానే పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యమయిందని ఈ కారణంగానే పెద్ద ఎత్తున ప్రాజెక్టుకు నష్టం వాటిల్లిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 


పోలవరం సవరించిన అంచనాలపై రాని స్పష్టత 


అయితే పోలవరం ప్రాజెక్ట్ ప్రధాన డ్యాం పూర్తి చేసినా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కోసం నిర్వాసితులకు రూ. 30వేల కోట్లకుపైగా చెల్లించాల్సి ఉంటుంది. ఆ నిధులు ఎవరు ఇవ్వాలన్నదానిపై ఇప్పటి వరకూ క్లారిటీ రాలేదు. అదే సమయంలో పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి వివిధ అంశాలపై కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి.  సవరించిన అంచనాలను కూడా ఆమోదించలేదు. దీంతో  పోలవరం పనులు ఆలస్యం అవుతున్నాయి.