Breaking News 26 September: రేపు పాఠశాలలకు సెలవు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా సెప్టెంబరు 26న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

ABP Desam Last Updated: 26 Sep 2021 09:23 PM

Background

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో కొత్త వారికి చోటు ఉంటుందని విద్యుత్తు శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. శనివారం ఒంగోలులో జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి...More

భారత్ బంద్‌కు మద్దతు తెలపడం లేదు.. తెలంగాణ జనసేన క్లారిటీ

భారత్ బంద్‌కు మద్దతివ్వడం లేదని జనసేన తెలంగాణ నాయకులు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జ్ శంకర్ గౌడ్, రాష్ట్ర నేత రామ్ తళ్లూరి సూచనల మేరకు జనసేన పార్టీ రేపు జరగనున్న భారత్ బంద్‌కు మద్దతు తెలపడం లేదు. పోడు రైతుల భూముల గురించి జనసేన పార్టీ పోరాటం చేస్తుందని గమనించాలని జనసేన నేతలు కోరారు. ఈ మేరకు ట్వీట్ ద్వారా భారత్ బంద్‌కు మద్దతు లేదని పేర్కొన్నారు.