TDP workers attack Hindupuram YCP party office: హిందూపురం వైసీపీ ఇంచార్జ్ దీపికా రెడ్డి భర్త వేణురెడ్డి కార్యాలయంపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఆయన బాలకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేశారనిఈ దాడి చేశారు. ఎవరో హైదరాబాద్ లో ఉండే వాడి కాళ్ల కింద బతుకుతున్నాం.. వారికి ఓట్లు వేస్తాం, వారు హైదారబాద్‌లో కూర్చుంటాడు. మనం ఇక్కడ బానిస బతుకులు బతుకుతున్నాం... అని ఆయన వ్యాఖ్యానించారు. వేణురెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేసి.. శుక్రవారం సాయంత్రం ఆయన కార్యాలయంపై దాడి చేశారు.
వేణు రెడ్డి భార్య దీపికారెడ్డి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు తమ కార్యాలయంపై దాడి చేశారని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూపురంలోని YSRCP కార్యాలయంపై TDP నాయకులు , బాలకృష్ణ అనుచరులు చేసిన హింసాత్మక దాడి ప్రజాస్వామ్యంపైనే ప్రత్యక్ష దాడి అని మండిపడ్డారు. రాజకీయ పార్టీలు కార్యాలయాలను ధ్వంసం చేయడం, ఫర్నిచర్ పగలగొట్టడం, గాజు అద్దాలను పగలగొట్టడం, కార్యకర్తలపై భౌతికంగా దాడి చేయడం ప్రజాస్వామ్య నిబంధనల ప్రమాదకరమైన పతనాన్ని సూచిస్తుందని జగన్ అన్నారు. పోలీసులు పట్టించుకోకపోవడం మరింత ఆందోళనకరంగా ఉందన్నారు.
చంద్రబాబు నాయుడు రాజకీయ ఎజెండా కోసం ఆంధ్రప్రదేశ్ శాంతిభద్రతల యంత్రాంగాన్ని బహిరంగంగా దుర్వినియోగం చేస్తున్నారనే దానికి ఇది సూచికన్నారు. హిందూపురంలో TDP అల్లరిమూకలను ఎలా ప్రోత్సహిస్తున్నారో.. అల్లర్ల ద్వారా రాజకీయ వ్యతిరేకతను అణిచివేయడానికి ప్రయత్నిస్తుందో స్పష్టంగా చూపిస్తుందన్నారు. తన ప్రత్యర్థుల ప్రాథమిక ప్రజాస్వామ్య హక్కులను రక్షించలేని ప్రభుత్వానికి పాలన గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని విమర్శించారు. ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది YSRCP పై మాత్రమే కాదు, ప్రజాస్వామ్యం, రాజకీయ స్వేచ్ఛను విశ్వసించే ప్రతి పౌరుడిపైనా ఉందన్నారు .
బాలకృష్ణ ఎక్కువగా నియోజకవర్గంలో ఉండరని ప్రచారం చేస్తూ.. ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతోనే దాడులు చేసినట్లుగా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ అంశంపై ఇంకా బాలకృష్ణ స్పందించలేదు.