Breaking News Live: హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం 

A P Telangana Breaking News Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

ABP Desam Last Updated: 19 Mar 2022 06:00 PM
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం 

గ్రేటర్ హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఆఫీస్ ల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో భారీ వర్షం కురవడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. సైదాబాద్, సంతోష్ నగర్ చంపా పేట, సరూర్ నగర్, ఎల్బీ నగర్, నాగోల్, మలక్ పేటలలో వర్షం పడింది. 

వరి కొనుగోళ్లపై టీఆర్ఎస్ ధర్నాలు, సోమవారం దిల్లీకి సీఎం కేసీఆర్

సోమవారం తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ఎల్పీ సమావేశం కానుంది. ఉదయం 11.30 లకు టీఆర్ఎస్ శాసనసభాపక్షం సమావేశం అవ్వనుంది. యాసంగిలో ధాన్యం కొనుగోళ్లపై నిరసనలు చేయాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. ధాన్యం కొనుగోళ్ల విషయంపై ప్రధాని మోదీని కలవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వరి కొనుగోళ్లపై సీఎం కేసీఆర్ మరోసారి ఆందోళనలకు పిలుపునిచ్చారు. సోమవారం మంత్రుల బృందంతో సీఎం కేసీఆర్ దిల్లీకి వెళ్లనున్నారు. 

తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో కారు కాలి బూడిదైంది

తిరుపతి: తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో కారు కాలి బూడిదైంది. కర్నూల్ కు చెందిన మహేశ్వర రెడ్డి, సుజాత ఘాట్ రోడ్డులో తిరుమలకు వెళ్తుండగా ఒక్కసారిగా కారులో‌ చెలరేగిన మంటలు చెలరేగాయి. కారు ముందు భాగం నుండి మంటలు రావడంతో వెంటనే వాహనం నుంచి దిగేశారు. సమాచారం అందడంతో  ఘటన స్ధలానికి చేరుకుని మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది

విషమంగా తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం ఆరోగ్యం

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం ఆరోగ్యం పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్రికి సీపీఎం నేతలు బి.వి.రాఘవులు, మాజీ ఎమ్మెల్యేలు నంద్యాల నర్సింహారెడ్డి, జూలకంటి రంగారెడ్డి చేరుకున్నారు. ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు, కుటుంబ సభ్యులతో సిపిఎం నేతల ఆరా తీశారు. మరికాసేపట్లో మల్లు స్వరాజ్యం ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ప్రకటన విడుదల చేయనున్నారు.

తెలంగాణ మంత్రులతో సీఎం కేసీఆర్ అత్యవసర భేటీ

తెలంగాణ మంత్రులతో సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు. ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో మంత్రులతో సమావేశం జరుగుతోంది. ఈ భేటీలో మంత్రులతోపాటు సీఎస్‌, ఉన్నతాధికారులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ భేటీ ఎందుకు జరుగుతోంద అన్నది మాత్రం తెలియడం లేదు. రెగ్యులర్‌ పాలనాపరమైన అంశాలు మాత్రమే చర్చిస్తున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 

Punjab Cabinet swearing-in-ceremony: పంజాబ్‌లో కొలువుదీరిన ఆప్ కొత్త​ కేబినెట్ - మహిళకు మంత్రివర్గంలో చోటు

పంజాబ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. నేడు 10 మంది ఆప్ ఎమ్మెల్యేలు రాష్ట్ర కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. శంకర్ జింపా, హర్‌జోత్ సింగ్ సహా మొత్తం పది మంది కేబినెట్ మంత్రుల్లో ఓ మహిళకు చోటు దక్కింది. ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. పంజాబ్ అసెంబ్లీ స్పీకర్‌గా కుల్తార్‌సింగ్ సంధ్‌వాన్‌ కు బాధ్యతలు అప్పగించాలని పంజాబ్ ఆప్ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Karnataka Bus Accident: కర్ణాటకలో బస్సు బోల్తా, 8 మంది దుర్మరణం !

Karnataka Bus Accident: కర్ణాటకలో బస్సు బోల్తా, ఎక్కువ సంఖ్యలో మృతులు!



కర్ణాటకలో YNH కోట నుంచి పవగడకు వెళుతున్న SVT బస్సు బోల్తా పడింది. దాదాపు 8 మంది మరణించినట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం - బస్ బోల్తా పడటంతో 6 మంది దుర్మరణం

కర్ణాటక పావగడలో ఘోర రోడ్డు ప్రమాదం


కర్ణాటక: పావగడ తాలూకా పలవళ్లి  క్రాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ బస్ బోల్తా పడటంతో 6 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఇంకా చాలా మంది ప్రయాణికులు బస్ క్రింద  ఉండడంతో వారి ప్రాణాలను కాపాడడానికి స్థానికులు ప్రయత్నం చేస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది

TDP Twitter Account Hacked: టీడీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ - విచిత్రమైన పోస్టులపై స్పందించిన లోకేష్

TDP Twitter Account Hacked: దేశవ్యాప్తంగా పలువురు సెలబ్రిటీల ట్విట్టర్ అకౌంట్‌లతో పాటు పలు పార్టీల అధికారిక ఖాతాలు హ్యాక్ అయ్యాయి. తాజాగా తెలుగుదేశం పార్టీకి హ్యాకర్లు షాకిచ్చారు. టీడీపీ అధికారిక ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేశారు. అంతటితో ఆగకుండా తమకు తోచినట్లుగా ఏవో పోస్టులు చేయడంతో టీడీపీ శ్రేణులు అలర్ట్ అయ్యాయి.


టీడీపీ ట్విట్టర్ నుంచి ఏకంగా ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్‌కు ట్వీట్లు చేశారు హ్యాకర్లు. స్టార్‌షిప్ ఫుల్ స్టాక్ టెస్టింగ్ జరుగుతుందని స్పేస్ ఎక్స్ ట్వీట్ చేయగా గ్రేట్ జాబ్, సూపర్ అంటూ టీడీపీ అఫీషియల్ ట్విట్టర్ నుంచి రెస్పాన్స్ రావడంతో ఆందోళన మొదలైంది. అసలే పెగాసస్ వివాదం తలనొప్పిగా మారిందనుకుంటే అంతలోనే అధికారిక ట్విట్టర్ ఖాతా హ్యాక్ కావడం, దాన్ని నుంచి హ్యాకర్లు ఎలాంటి పోస్టులు పెడతారోనని నేతలు తలలు పట్టుకుంటున్నారు. 


స్పందించిన నారా లోకేష్..
టీడీపీ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి ఏవో పోస్టులు కావడంపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. తమ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్‌కు గురైందని తెలిపారు. ట్విట్టర్ ఇండియాకు విషయం తెలిపామని, త్వరలోనే ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరిస్తారని ట్వీట్ చేశారు. 

Background

దేశవ్యాప్తంగా పలువురు సెలబ్రిటీల ట్విట్టర్ అకౌంట్‌లతో పాటు పలు పార్టీల అధికారిక ఖాతాలు హ్యాక్ అయ్యాయి. తాజాగా తెలుగుదేశం పార్టీకి హ్యాకర్లు షాకిచ్చారు. టీడీపీ అధికారిక ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేశారు. అంతటితో ఆగకుండా తమకు తోచినట్లుగా ఏవో పోస్టులు చేయడంతో టీడీపీ శ్రేణులు అలర్ట్ అయ్యాయి.


టీడీపీ అధికారిక ట్విట్టర్ నుంచి విచిత్రమైన పోస్టులు ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ఓవైపు పెగాసస్ వ్యవహారంపై రాజకీయ దుమారం.. మరోవైపు టీడీపీ ట్విట్టర్ నుంచి ఏవో పోస్టులు దర్శనమివ్వడంతో పార్టీ శ్రేణులు అలర్ట్ అయ్యారు. టీడీపీ ట్విట్టర్ నుంచి ఏకంగా ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్‌కు ట్వీట్లు చేశారు హ్యాకర్లు. స్టార్‌షిప్ ఫుల్ స్టాక్ టెస్టింగ్ జరుగుతుందని స్పేస్ ఎక్స్ ట్వీట్ చేయగా గ్రేట్ జాబ్, సూపర్ అంటూ టీడీపీ అఫీషియల్ ట్విట్టర్ నుంచి రెస్పాన్స్ రావడంతో ఆందోళన మొదలైంది. అసలే పెగాసస్ వివాదం తలనొప్పిగా మారిందనుకుంటే అంతలోనే అధికారిక ట్విట్టర్ ఖాతా హ్యాక్ కావడం, దాన్ని నుంచి హ్యాకర్లు ఎలాంటి పోస్టులు పెడతారోనని నేతలు తలలు పట్టుకుంటున్నారు. 


దక్షిణ బంగాళాఖాతంలో మార్చి 16న ఏర్పడిన అల్పపీడనం నేడు తీవ్ర అల్పపీడనంగా మారనుందని భారత వాతావరణ కేంద్రం, అమరావతి కేంద్రం తెలిపింది. తూర్పు ఈశాన్య దిశగా కదులుతూ ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న తూర్పు ఈక్వటోరియల్ హిందూ మహాసముంద్రం మీదగా కేంద్రంగా ఉంది. దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా కదులుతూ 19వ తేదీన (నేడు) తూర్పు ఈశాన్య దిశగా కదులుతూ అల్పపీడనం మరింతగా బలపడనుంది. 


ఈ అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతూ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతంలో మార్చి 20న వాయుగుండంగా మారనుంది. మార్చి 21న తుఫాన్‌గా తీవ్ర రూపం దాల్చనుందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆ తరువాత ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ మార్చి 22 ఉదయం నాటికి బంగ్లాదేశ్, దానిని అనుకుని ఉన్న ఉత్తర మయన్మార్ తీరానికి మార్చి 23న చేరుకుంటుంది. ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న వేడిగాలుతో దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణం పొడిగా మారింది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణలో నైరుతి గాలులు వీస్తున్నాయి.  


హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ ధరలలో ఏ మార్పు లేదు. గత మూడు నెలలుగా ఇంధన ధరలు ఇక్కడ నిలకడగా ఉన్నాయి. నేడు హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ ధర (Petrol Price Today 19th March 2022) రూ.108.20 కాగా, డీజిల్ ధర లీటర్ రూ.94.62 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ఉక్రెయిన్, రష్యా యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు బ్యారెల్ ధర 102 డాలర్లు అయింది. ఢిల్లీలోనూ గత డిసెంబర్ తొలి వారం నుంచి పెట్రోల్ లీటర్ ధర రూ.95.41, డీజిల్ ధర రూ.86.67 వద్ద స్థిరంగా ఉన్నాయి. 


తెలంగాణలో ఇంధన ధరలు..
ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర నిలకడగా ఉంది. వరంగల్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ.107.69 కాగా, డీజిల్‌‌పై 43 పైసలు దిగిరావడంతో లీటర్ ధర రూ.94.14 కు పడిపోయింది. వరంగల్ రూరల్ జిల్లాలో పెట్రోల్‌ లీటర్ ధర రూ.107.92 కాగా, డీజిల్‌‌‌పై 4 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.94.35 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. నేడు కరీంనగర్‌లో పెట్రోల్ ధర రూ.108.38 కాగా, డీజిల్ ధర రూ.94.78 గా ఉంది. నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయి. 


ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
విజయవాడలో పెట్రోల్‌ పై 62 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.110.29 కాగా, ఇక్కడ డీజిల్ పై 60 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.96.36 అయింది. 
విశాఖపట్నంలో ఇంధన ధరలు తగ్గాయి. 10 పైసలు తగ్గడంతో విశాఖలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.30 అయింది. డీజిల్‌పై 10 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.95.41గా ఉంది. చిత్తూరులో పెట్రోల్‌ పై 12 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.110.58కి పతనమైంది. డీజిల్ పై 8 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.96.60 అయింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.