Vizag news :  సోషల్ మీడియాలో తనపై తప్పుడు రాతలు రాసిన, అసభ్య కరంగా ప్రవర్తించిన వారందరిపై  పలాస టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష న్యాయపోరాటం చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు  గౌతు శిరష మీద, ఆమె కుటుంబం మీద సోషల్ మీడియాలో అత్యంత దారుణమైన పోస్టులు పెట్టేవారు. వాటిపై గతంలో పోలీసులకు ఫిర్యాదులు చేసినా స్పందన లేకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. విశాఖపట్నం 2nd అడిషనల్ సివిల్ జడ్జి  న్యాయస్థానం లో దావా వేశారు. కోర్టు ఆదేశాల మేరకు స్వయంగా హాజరై వాంగ్మూలం ఇచ్చారు. 


గతంలో  గౌతు శిరీష కుటుంబంపై అసభ్య పోస్టులు                                  


పలాసలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు , ఆయన అనుచరులు గౌతు శిరషను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ కార్యకర్లలు సోషల్ మీడియా వేదికగా దారుణమైన పోస్టులు పెట్టేవారు. వీటిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా అప్పట్లో  ప్రభుత్వం నడిపిస్తున్న పెద్ద మనుషులు ఒత్తిడితో ఎటువంటి చర్యలు తీసుకోలేదని అందుకో కోర్టును ఆశ్రయించానన  కవిత ప్రకటించారు.  హద్దు మీరి అసహ్యకర రాతలు రాసేవారికి,  వారిని ప్రోత్సహించే వారిని శిక్షించాలన్నారు. 


వేధింపులకు పాల్పడేవారిపై పోరాడేవారికి మద్దతు                             


అలాంటి సోషల్ మీడియా వేధింపులకు గురి చేసే పోకిరీలను  న్యాయస్థానానికి రప్పించాలని మరోసారి ఇటువంటి సమస్యలు ఉన్న మహిళలు ఎవరూ మనస్తాపానికి గురవ్వకూడదనన్న ఉద్దేశంతోనే తాను న్యాయపోరాటం చేస్తున్నట్లుగా గౌతు శిరీష చెప్పారు. ఇలాంటి తన న్యాయ పోరాటం ద్వారా సభ్య సమాజానికి ఒక అవగాహన కల్పించే తన ప్రయత్నానికి అందరూ మద్దతు తెలపాలని గౌతు శిరీష కోరారు. సామాజిక మాధ్యమాల్లో తన లాంటి  బాధితులు ఎవరు ఉన్న  అలాంటి వారికి తన వంతు సహాయం ఎప్పుడూ ఉంటుందని  ప్రకటించారు.


ఏపీలో హద్దులు దాటిపోతున్న రాజకీయం                                           


ఏపీలో రాజకీయం సోషల్ మీడియాలో హద్దులు దాటిపోతోంది. రెండు ప్రధాన పార్టీల సోషల్ మీడియా సైన్యాలు వ్యక్తిత్వ హననానికి పాల్పడేలా పోస్టులు పెట్టుకుంటున్నాయి. అవి నేతల కుటుంబాలనూ టార్గెట్ చేసుకునేలా ఉంటున్నాయి. గత ప్రభుత్వంలో వైసీపీ  ముఖ్య నేతలు కూడా కొందరు అదే పని చేయడంతో కార్యకర్తలు చెలరేగిపోయారు. అప్పట్లో బాధితులు అయన టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు లేవు. వాటిపై ప్రైవేటు కేసులు వేసి పోరాడుతున్నారు.