TDP Janasena   :     జనసేన, టీడీపీ పొత్తులో భాగంగా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో అభ్యర్తులను ప్రకటejg. అభ్యర్థుల లిస్టులో పేర్లు లేని నాయకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల ఆ పార్టీకి రాజీనామా ప్రకటించారు.  గజపతినగరం టీడీపీ ఇన్ ఛార్జ్ కొండపల్లి అప్పలనాయుడు మొదట తన రాజీనామాను ప్రకటించారు. అతను పోటీ చేయాలనుకున్న స్థానం నుంచి కొండపల్లి శ్రీనివాసరావుకు టికెట్ కేటాయించడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. అలాగే విశాఖ పశ్చిమ సీటు ఆశించిన పాశర్ల ప్రసాద్ కు కూడా బంగపాటు కలగడంతో టీడీపీ పార్టీకి రాజీనామా చేశారు. వీరితో పాటుగా రాయచోటి నుంచి పోటీలో నిలవాలని చూసిన రమేష్ రెడ్డి తొలి జాబితాలో చోటు దక్కకపోవడంతో ఆయన అనుచరులతో పాటు రాజీనామా చేయడానికి సిద్ధం అయినట్లు తెలుస్తుంది.                      


కృష్ణా జిల్లా పెడన నియోజవర్గం టీడీపీలో అసంతృప్తి నెలకొంది. పెడన టిక్కెట్ ను కాగిత కృష్ణప్రసాద్ కు ప్రకటించారు పార్టీ అధినేత చంద్రబాబు. దీంతో, తనకు సీటు దక్కకపోవడంపై బూరగడ్డ వేదవ్యాస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న వేద వ్యాస్..ఉమ్మడి అభ్యర్థిగా పెడన టికెట్ తనకే వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. టిక్కెట్ దక్కకపోవడంతో తీవ్ర మనోవేదన చెందారు.  కృత్తి వెన్ను మండలం చిన్నపాండ్రాక గ్రామంలో కార్యకర్తల సమావేశంలో ఉన్నట్టుండి అస్వస్థతకు గురై పడిపోయారు వేదవ్యాస్. వెంటనే అలర్ట్ అయిన కార్యకర్తలు అతడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బూరగడ్డ వేదవ్యాస్ మాట్లాడుతూ.. చంద్రబాబు నమ్మించి మోసం చేస్తాడు అనుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు


కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం నుంచి జనసేన టికెట్ ఆశించిన నియోజకవర్గ ఇన్ చార్జి పాటంశెట్టి సూర్యచంద్రకు టికెట్ దక్కలేదు. పొత్తులో భాగంగా జగ్గంపేట టీడీపీకి కేటాయించారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యేగా ఉన్న జ్యోతుల నెహ్రూ టీడీపీ నుంచి టికెట్ దక్కించుకున్నారు. అయితే మొదటి నుండి జనసేనలో కష్టపడుతూ.. టికెట్ ఆశించిన సూర్యచంద్ర సీటు దక్కకపోవడంతో ఒక్కసారిగా కంటతడి పెట్టుకున్నారు. ఇప్పటివరకు ధర్మంగానే ఉన్నామని, ఇప్పుడు పొత్తులో భాగంగా అధినేతలు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి జ్యోతుల నెహ్రూ గారిని ఎమ్మెల్యే చేసేవరకు కష్టపడతానని అన్నారు.                                                      


అనంతపురం జిల్లా పెనుకొండలో టీడీపీ అభ్యర్థిగా  సవితను ఖరారు చేశారు. దీంతో  పెనుకొండ పట్టణంలోని టిడిపి కార్యాలయం వద్ద శనివారం పార్టీ శ్రేణులు పెద్దఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. శ్రీసత్య సాయి జిల్లా అధ్యక్షులు, పెనుకొండ నియోజకవర్గం ఇంచార్జ్‌, మాజీ ఎమ్మెల్యే బి.కె.పార్థసారథికి ఎమ్మెల్యే టికెట్‌ దక్కకపోవడంతో ఆగ్రహ జ్వాలలు వెళ్లువెత్తాయి. ఈ సందర్భంగా టిడిపి కార్యకర్తలు ఫ్లెక్సీలను దగ్ధం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బి.కె. పార్థసారథి వెంట మేము నడుస్తాం అంటూ తెగేసి చెప్పారు. అదేవిధంగా నియోజకవర్గంలోని పార్టీ నాయకులు తమ పదవులకు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు.


తెనాలి సీటును జనసేనకు కేటాయించారు.  ఈ విషయంపై టీడీపీలో వివాదం చెలరేగుతోంది.   టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజా విషయానికి వస్తే ఆయన చాలా కాలంగా పార్టీని నమ్ముకున్నారు. ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని నిలిచారు. ఆయనకు టీడీపీ అధిష్టానం టికెట్ ఇవ్వకుంటే మూకుమ్మడి రాజీనామాలకు పాల్పడతామని  ఆయన అనుచరులు ప్రకటించారు.