Elections 2024 :   నిబంధనలు పాటించే వాళ్లు కౌటింగ్ ఏజెంట్లుగా తమకు అవసరం లేదని సజ్జల రామకృష్ణారెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై టీడీపీ మండిపడింది. సజ్జల రామకృష్ణారెడ్డిపై  ఎన్నికల సంఘం తక్షణమే క్రిమినల్ కేసు పెట్టి అరెస్ట్ చేయాలని  టీడీపీ నేత దేవినేని ఉమ డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.  జగన్మోహన్ రెడ్డి , సీఎస్ జవహర్ రెడ్డి డైరెక్షన్ లోనే సజ్జల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడని ..జవహర్ రెడ్డి సహకారంతో వీరి ఆటలు సాగుతున్నాయన్నారు.  ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.  సీఎస్ పదవికి మచ్చ తెచ్చిన జవహన్ రెడ్డిని తక్షణమే పదవి నుంచి తప్పించాలని టీడీపీ డిమాండ్ చేస్తోందన్నారు.  


సలహాదారుగా ప్రజల సొమ్ము తింటున్న సజ్జలకు బుద్ది ఉందా అని దేవినేని ఉమ ప్రశ్నించారు.  ఐదేళ్లుగా రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారు. ఇప్పుడు ఓటమి భయంతో కౌంటింగ్ రోజున విధ్వంసం సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించరాు.  రూల్స్ ఫాలో అయ్యేవాళ్లు తమకు అవసరం లేదని, టీడీపీ-జనసేన ఏజెంట్లకు అడుగడుగునా అడ్డం పడాలని సజ్జల హితబోధ చేయడం సిగ్గుచేటన్నారు.  ఈవీఎం ధ్వంసం చేసిన పిన్నెల్లిపై చర్యలు తీసుకోమనకుండా ఆ వీడియో ఎలా బయటకు వచ్చిందని సజ్జల ఏడుస్తున్నాడని రాష్ట్రానికి మీరు చేసిన నష్టం చాలదా? తప్పులు చేసినా కాపాడతామని భరోసా ఇస్తారా అని  ప్ర్నించారు. 


సజ్జల మాటలను బట్టి చూస్తే  వైసీపీకి చట్టం, ఎన్నికల సంఘం పట్ల ఉన్న గౌరవం ఏ పాటిదో అర్ధమవుతుందని దేవినేని ఉమ వ్యాఖ్యానించారు.  ఇలా చట్టాలను అతిక్రమించే వారిని ఉపేక్షించకూడదన్నారు.  సజ్జల నోరు అదుపులో పెట్టుకోవాలి. ఓటమి భయంతో కుట్రలు, కుతంత్రాలకు తెరలేపారన్నారు.  పైగా వైసీపీ చీఫ్ ఏజెంట్లకు సజ్జల చేసిన హితభోధలను బ్లూ మీడియా పదేపదే ప్రసారం చేసిందని.. ఆయా యాజమాన్యలపైనా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలన్నారు.  ఏజెంట్లను రెచ్చగొట్టేలా మాట్లాడటం ద్వారా 1951, ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని సజ్జల ఉల్లంఘించాడని దేవిని ఉమ  స్పష్టం చేశారు.                       


తాడేపల్లి వేదికగా వైసీపీ నేతలు పలువురు రిటర్నింగ్ అధికారులను బెదిరిస్తున్నారని ఆరోపించారు.  యర్రగొండపాలెం రిటర్నింగ్ అధికారిణి శ్రీలేఖను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేయి చూపిస్తూ బెదిరించాడు. మాకు రూల్స్ చెప్పకూడదు, అడ్డుపడకూడదని హెచ్చరించాడు. అయినా ఆర్వోను విధుల నుంచి తప్పించారన్నారు.  నిజాయితీగా పని చేస్తున్న  అధికారులను కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు. లండన్‌లో ఉన్న జగన్ కౌంటింగ్  రోజున అల్లర్లు చేయమని కేడర్ ను రెచ్చగొడుతున్నాడని మండిపడ్డారు.  నిబంధనలు పాటంచని వైసీపీ నేతలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, కౌంటింగ్ కేంద్రాల దగ్గర పగడ్భందీ చర్యలు చేపట్టాలని ఎన్నికల సంఘాన్ని  కోరారు.