TDP has revealed that Jagan have spent 12 crores on the iron mesh around His house : తాడేపల్లిలో వైఎస్ జగన్ ఇంటి చుట్టూ 30 అడుగుల ఎత్తులో ఓ ఇనుపకట్టడం ఉంటుంది. సీఎంగా జగన్ ఉన్నప్పుడు సెక్యూరిటీ అధికారుల సూచనల మేరకు దాన్ని నిర్మించారని వైసీపీ గతంలో ప్రకటించింది. ఆ మెష్ నిర్మాణానికి మొత్తం ప్రజాధనమే వాడారని రూ. 12 కోట్ల 85 లక్షల రూపాయలు వెచ్చించారని జీవోను టీడీపీ తాజాగా విడుదల చేసింది. టీడీపీ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు ఈ జీవోను అందులో ఉన్న వివరాలను మీడియాకు వెల్లడించారు.
తాడేపల్లిలోని జగన్ ఇల్లు దాదాపుగా రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉంటుది.. రెండు ఎకరాల చుట్టూ 30 అడుగుల ఎత్తున ఇనుప మెషన్ తరహా నిర్మాణం చేపట్టారు. ఈ నిర్మాణాన్ని ఇంటలిజెన్స్ అధికారుల సూచనలతోనే నిర్మించారని వైసీపీ వర్గాలు గతంలో తెలిపాయి. తాడేపల్లిలో జగన్ నివాసం దిగువ దిగువ భాగంలో ఉందని.. దీనికి సమీపంలోనే ఎత్తైన భవనాలతో పాటుగా పక్కనే బకింగ్‌హామ్ కెనాల్ కాల్వ గట్టు ఎత్తులో ఉండడాన్ని అధికారులు గమనించారని.. అందుకే జగన్ ఇంటి చుట్టూ ఐరన్ గ్రిల్స్ ఏర్పాటు చేయాలని సూచించారని చెప్పారు. దూరం నుంచి కూడా గన్‌తో కల్చగలిగే స్నేపర్ షాట్స్ ను కూడా నిలువరించే విధంగా ఇంటి చుట్టూ ఈ గ్రిల్స్ ఏర్పాటు చేశారని అప్పట్లో సీఎంగా జగన్ భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.
ప్యాలెస్ కట్టడానికే రెండు కోట్లు అయితే ఇనుస మెష్ కోసమే పదమూడు కోట్లు ప్రజాధనం ఎలా ఖర్చు పెట్టారని టీడీపీ సోషల్ మీడియా ప్రశ్నిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ ఖర్చుతో కొనుగోలు చేసిన ఫర్నీచర్ ను పార్టీ ఆఫీసుగా మార్చిన క్యాంపు కార్యాలయంలో ఇంకా వాడుకుంటున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ కార్యాలయంగా జగన్ ఇంటినే ఉపయోగిస్తున్నారు. గతంలో అది సీఎం క్యాంపు కార్యాలయంగా ఉంది. ఆ క్యాంప్ కార్యాలయానికి మొత్తం ప్రజాధనంతోనే ఏర్పాటు చేశారు. ఫర్నీచర్, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఏసీలు, చివరికి ఇంటి కిటికీలు కూడా ప్రజాధనంతో కొనుగోలు చేశారని గతంలో టీడీపీ జీవోలు బయట పెట్టింది.
ప్రైవేటు ఇంటికి జగన్ ఇలా పెద్ద మొత్తంలో ప్రజాధనం ఖర్చు పెట్టించుకోడం ద్వారా ప్రజల్ని మోసం చేశారని ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు.. ప్రతిపక్ష నేత కూడా కాదు కాబట్టి సొంత ఇంటికి పెట్టుకున్న ఖర్చును ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయినా ఒక్క ఇంటికి నిర్మాణ ఖర్చు కన్నా .. పదింతలు ఎక్కువగా ఇతర అవసరాల కోసం ఖర్చు పెట్టుకోవడం అంటే చిన్న విషయం కాదని అంటున్నారు. ఈ వ్యవహారం రాజకీయ దుమారం రేపే అవకాశం ఉంది.