Truth Bombs: టీడీపీ, వైసీపీ మధ్య ట్రూత్ బాంబుల హడావుడి సాగుతోంది. తెలుగుదేశం పార్టీ రియల్ ట్రూత్ బాంబ్ పేరుతో వైసీపీకి కౌంటర్ ఇచ్చింది. దళిత యువకుడు సత్యవర్ధన్ ను విజయవాడలో కిడ్నాప్ చేసారు. కిడ్నాప్ చేసిన కారులోనే కోర్టుకు తీసుకెళ్లి బలవంతంగా వాంగ్మూలం ఇప్పించారు. తర్వాత హైదరాబాద్ లో ఉన్న వల్లభనేని ఇంటికి తీసుకెళ్లారు. ఇదిగో ఈ సీసీ ఫుటేజీ సాక్ష్యం. ఇప్పుడు చెప్పు జగన్ నీ అబద్దాలు అని టీడీపీ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్ లో పోస్టు చేశారు.
అంతకు ముందు వైసీపీ ట్రూత్ బాంబు పేరుతో సత్యవర్థన్ కోర్టులో ఇచ్చిన వాంగ్మూలాన్ని పోస్టు చేసింది. వంశీపై తప్పుడు కేసులు పెట్టడానికే కుట్ర పన్నారని ఆరోపించింది.
వల్లబనేని వంశీ అరెస్టుపై ఏపీ రాజకీయాలు రగిలిపోతున్నాయి. వంశ ని టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో కాకుండా.. ఫిర్యాదు దారుడ్ని బెదిరించిన కేసులో అరెస్టు చేశారు. అయితే సత్యవర్ధన్ ను వంశీ బెదిరిచలేదని వైసీపీ అంటోంది. ఆయనంతకు ఆయన కేసు విత్ డ్రా చేసుకున్నారని....తాను కేసు పెడుతున్నట్లుగా తనకు తెలియదని సాక్షిగా సంతకం చేయించుకున్నారని ఆయన కోర్టులో చెప్పారు. అయితే ఇలా చెప్పించిది వంశీనేనని .. ఆయన కుటుంబాన్ని బెదిరించి, డబ్బులు ఇస్తామని ఆశ చూపి.. కిడ్నాప్ చేసి ఇలా చేయించారని పోలీసులు కేసులు పెట్టారు. అరెస్టు చేశారు.
సత్యవర్దన్ ను వంశీ తన ఇంట్లోకి తీసుకెళ్తున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి . విజయవాడ కోర్టు ఆవరణకు కూడా ఆయన తీసుకు వచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో రెండు పార్టీలూ ట్రూత్ బాంబుల పేరుతో వీడియోలు.. డాక్యుమెంట్లు రిలీజ్ చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో రాజకీయ దుమారం అతంకతూ పెరుగుతోంది.