TDP government deliver Pensions : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికల్లో గెలిస్తే వృద్ధుల సామాజిక పెన్షన్లను నాలుగువేలకు పెంచుతానని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో గెలవగానే మొదటే నిర్ణయం తీసుకున్నారు. సంతకం చేసి.. కేబినెట్‌లో తీర్మానం చేశారు. మూడు నెలల కిందట  హామీ ఇచ్చినందున ఆ మూడు నెలల పాటు వెయ్యి బకాయిలు కూడా చెల్లించాలని నిర్ణయించారు. అంటే మొదటి నెల వృద్ధులకు తలా ఏడు వేల రూపాయలు అందుతాయి. ఇందు కోసం వృద్ధులు ఎదురు చూస్తున్నారు. 


 వృద్ధులు, వితంతువులు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు, మత్స్యకారులకు సామాజిక భద్రత పెన్షన్ల మొత్తాన్ని పెంచుతూ 13వ తేదీన జీవో జారీ చేశారు.  ART (PLHIV) వ్యక్తులు , సాంప్రదాయ చెప్పులు కుట్టేవారు, లింగమార్పిడి , డప్పు కళాకారులు నెలకు రూ. 4000, వికలాంగులు మ, బహుళ వైకల్య కుష్టువ్యాధి వ్యక్తులు నెలకు రూ. 6000 , పూర్తిగా వికలాంగులైన వారికి నెలకు రూ. 10,000  ,దీర్ఘకాలిక వ్యాధులు  ,  క్రానిక్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులకు నెలకు రూ.10,000 పంపిణీ చేస్తారు. 


సామాజిక భద్రతా పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు రూ.819 కోట్ల అదనపు భారం పడనుంది. పెన్షన్‌ పెంపు నిర్ణయంతో 28 కేటగిరీలకు చెందిన దాదాపు 65.3 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం ఏడాదికి రూ.33 వేల కోట్లకు పైగా ఖర్చు చేయనుంది. గ్రామ, వార్డు సచివాలయ పూర్తి స్థాయి ఉద్యోగులతోనే పెన్షన్ల పంపిణీ చేయనుంది. ప్రస్తుతం సచివాలయాల ద్వారా దాదాపు లక్షా 24 వేల మంది పూర్తి స్థాయి ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థతోనే స్థానిక ప్రజలకు దాదాపు అన్ని రకాల సంక్షేమం, ధ్రువీకరణ పత్రాల పంపిణీకి సులువైన మార్గం ఏర్పడిరది.


ఒకటో తేదీన సోమవారం వస్తుంది. సచివాలయ ఉద్యోగులు శనివారం రోజునే బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసుకోవాలని ఆదేశించారు. అందుకే సమస్యలు లేకుండా సోమవారం ఉదయమే పంపిణీ జరగనుంది. ప్రభుత్వం ఇచ్చే మొత్తంభారీగా ఉంండటంతో వృద్ధుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. 


వాలంటీర్లు లేకపోియినా ఇంటింటికి పంపిణీ జరుగుతుందని ప్రభుత్వం నిరూపించనుంది.  అదేవిదంగా స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, పార్టీ ఇన్‌చార్జ్‌, టీడీపీ పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్యక్షుడు నియోజకవర్గంలోని అన్ని ఏరియాలలో కవర్ అయ్యే విధంగా కనీసం 10 మంది లబ్ధిదారులకు పైగా పెన్షన్లను పంపిణీ చేయాల‌ని చంద్ర‌బాబు ఆదేశించారు.    పింఛ‌న్ల పంపిణీ కార్య‌క్ర‌మాన్ని హైలెట్ చేస్తూ.. సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టాల‌న్నారు. ఆ రోజు మొత్తం నాయకులందరూ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంపైనే ఉండాలని ఆదేశించారు. అలానే త‌న మంత్రివ‌ర్గంలోని ముఖ్య నాయ‌కుల‌ను కూడా.. చంద్ర‌బాబు ఆదేశించారు. మంత్రులు సైతం జిల్లాల స్థాయిలో జ‌రిగే పింఛ‌న్ల పంపిణీ కార్య‌క్ర‌మంలో పాల్గొనాల‌ని అన్నారు. మండల, టౌన్ పార్టీ అధ్యక్షులు, డివిజన్, వార్డు అధ్యక్షులు, క్లస్టర్, యూనిట్, బూత్, సెక్షన్ ఇన్‌చార్జ్‌లు, ఇతర పదవుల్లో ఉన్న టీడీపీ నాయకులు ఆయా సచివాలయం పరిధిలో ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయాలని సూచించారు.