Fishermen Rescued Rajamundry Woman: కొందరు చిన్న చిన్న కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ వివాహిత కుటుంబ కలహాలతో గోదావరిలో దూకి ఆత్మహత్యకు యత్నించగా అక్కడి జాలర్లు ఆమెను రక్షించారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తూ.గో జిల్లా రాజమండ్రికి (Rajamundry) చెందిన ఓ వివాహిత కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి వద్ద గోదావరిలో దూకింది. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పందించి అక్కడి జాలర్లను అప్రమత్తం చేశారు. వారు పడవపై వేగంగా వెళ్లి సదరు మహిళను రక్షించారు. జాలర్ల సాయంతో మహిళను రక్షించిన పోలీసులు ఆమెను స్టేషన్‌కు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా, జాలర్లు సినిమా స్టైల్లో మహిళను రక్షించిన తీరుపై అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. సకాలంలో స్పందించిన పోలీసులపై సైతం ప్రశంసలు కురుస్తున్నాయి. రాజమండ్రి టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ రత్తయ్య, కానిస్టేబుల్ లీలకుమార్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. మహిళను జాలర్లు రక్షించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Also Read: Viral Video: వరదలో కొట్టుకుపోయిన పశువులు - చేపల కోసం ఎగబడ్డ జనం, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో దృశ్యాలు