Andhra Politics  :  ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో వ్యక్తం చేసిన అభిప్రాయాలపై తెలుగుశం పార్టీ మండిపడింది. ఈవీఎంలు అద్భుతంగా పని చేస్తాయని వాటిలో లోపాల్లేవని ఇదే జగన్మోహన్ రెడ్డి 2019లో మాట్లాడిన వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేసింది. ఆ పార్టీ నేతలుకూడా ఇదే అంశంపై జగన్మోహన్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు.  గతంలో ఈవీఎంలను సమర్థిస్తూ  జగన్ మాట్లాడిన వీడియోను కూడా లోకేష్ పోస్ట్ చేశారు.

  






ఏపీ  ఎలన్ మస్క్‌లా జగన్ తీరు :  సోమిరెడ్డి

 

జగన్ పై మాజీ మంత్రి సోమిరెడ్డి కూడా విమర్శలు గుప్పించారు.   ఏపీఎలన్ మస్క్ లా జగన్ మాట్లాడుతున్నాడు..గెలిస్తే తన గొప్ప..ఓడితే ఈవీఎంల తప్పా..? 2019 ఎన్నికల్లో తాను గెలిచినప్పుడు ఈవీఎంల గురించి తానేం మాట్లాడాడో జగన్ ఓసారి గుర్తు చేసుకోవాలి.. పరనింద..ఆత్మ స్తుతి మాని ఇకనైనా జగన్ ఆత్మ విమర్శ చేసుకోవాలని సలహా ఇచ్చారు. 

 

 




పులివెందులలో రాజీనామా చేస్తే బ్యాలెట్ విధానంలో ఎన్నికలు పెట్టాలని ఈసీని కోరుదామని మరో టీడీపీ నేత బుద్దా వెంకన్న పిలుపునిచ్చారు.  గెలిచినప్పుడు ఈవీఎంలపై ఎందుకు అనుమానాలు వ్యక్తం చేయలేదన్నారు. 

 




 2019 ఎన్నికలకు ముందు అప్పటి సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో కొన్ని పార్టీలు ఈవీఎంలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పోరాడాయి. అయితే అప్పుడు ఈవీఎంలను జగన్మోహన్ రెడ్డి సమర్థించారు. ఇప్పుడు ఓడిపోవడంతో ఆయన ఈవీఎంలను తప్పు పడుతూండటంతో రాజకీయంగా విమర్శలు వస్తున్నాయి.