Chandrababu Tweet on Rajadhani Files Movie: సీఎం స్థానంలో ఉన్న ఓ వ్యక్తి ఓ ప్రాంతంపై కక్షగట్టి.. రాష్ట్ర రాజధానిపై పగబట్టి సర్వనాశనం చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) మండిపడ్డారు. అధికార బలం అండతో ఉద్యమకారులను చిత్రహింసలకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కుట్రలు, దారుణాలకు 'రాజధాని ఫైల్స్' (Rajadhani Files) చిత్రం అద్దం పట్టిందని పేర్కొన్నారు. తెలుగు ప్రజలంతా థియేటర్లకు వెళ్లి ఈ సినిమా చూసి వాస్తవాలు తెలుసుకోవాలని పిలుపునిస్తూ ట్వీట్ చేశారు. జగన్ క్రూరత్వానికి, వైసీపీ విధ్వంసానికి నాశనమైన రాజధాని.. దాని కోసం ఎన్నో త్యాగాలు చేసిన ప్రజల కష్టాలను ఇందులో కళ్లకు కట్టినట్లు చూపించారని అన్నారు. అందుకే ఈ చిత్ర విడుదలను ఆపేందుకు శతవిధాలా ప్రయత్నించారని.. కానీ న్యాయస్థానంలో వారి ఆటలు సాగలేదని పేర్కొన్నారు. 'జగన్ రెడ్డి నీ సినిమా అయిపోయింది. అసలు సినిమా ఇప్పుడు మొదలవుతుంది... కాస్కో' అంటూ సీఎం జగన్ కు సవాల్ విసిరారు.






Also Read: Tdp Joinings: టీడీపీలోకి లావు, త్వరలో సైకిల్ ఎక్కనున్న నరసరావుపేట ఎంపీ!