అల్లర్ల వెనుక తెలుగుదేశం పార్టీ, జనసేన ఉన్నాయన్న  వైఎస్ఆర్‌సీపీ నేతల విమర్శలపై ఆ పార్టీ అగ్రనేతలు స్పందించారు. ప్రభుత్వానిది బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. సున్నితమైన అంశంలో హోంమంత్రి నిరాధారణ ఆరోపణలు చేయడం మంచిది కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. నసీమలో ప్రశాంతత నెలకొనేలా ప్రజలంతా సహకరించాలని.. సంయమం పాటించాలని చంద్రాబబు పిలుపునిచ్చారు. ప్రశాంతంగా ఉండే కోనసీమలో నిరసనలు దురదృష్టకమన్నారు. 



మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?



అమలాపురంలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని ప్రజాస్వామ్యవాదులు అందరూ ముక్త కంఠంతో ఖండించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు శాంతియుత పరిస్థితులు నెలకొనేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఈ ఉద్రిక్త పరిస్థితులకు బీజం వేసింది ఎవరనేది జిల్లావాసులకే కాదు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు.  బాధ్యత కలిగిన పదవిలో ఉన్న హోమ్ శాఖ మంత్రి గారు ప్రకటన చేస్తూ జనసేన పేరు ప్రస్తావించడాన్ని ఖండిస్తున్నానని పవన్ ప్రకటించారు. వై.సి.పి.ప్రభుత్వ లోపాలను, శాంతి భద్రతల పరిరక్షణలో అసమర్ధతను, పరిపాలనలో మీ పార్టీ వైఫల్యాలను జనసేన పై రుద్దకండని పవన్ కల్యాణ్ హితవు పలికారు . 


 





పేరు మార్పుపై ఇంత రియాక్షనా ? ప్రభుత్వం ఎందుకు అంచనా వేయలేదు?



కొత్త జిల్లా ల పేర్లను గజెట్‌లో చేర్చకుండా ఇప్పుడు మార్చడం వెనుక జగన్ రెడ్డి రాజకీయ కుట్ర ఉందని ఏపీ పీసీసీ చీఫ్ శైలజానాథ్ ఆరోపించారు.   శాంతి భద్రతలను పరిరక్షించడంలో జగన్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందన్నారు. జేఏసీల ముసుగులో దాడులకు పాల్పడ్డ వారిపై తక్షణమే అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వివాదాలకు కేంద్ర బిందువుగా కొనసీమని మార్చడం దురదృష్టకరమన్నారు.