Tadepalligudem Public Meeting :  తాడేపల్లిగూడెం సభ నిర్వహణకు జనసేన – తెలుగుదేశం సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు.  ఈ నెల 28వ తేదీన తాడేపల్లిగూడెంలో ని జనసేన – తెలుగుదేశం తొలి ఉమ్మడి బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించాయి.  10మంది సభ్యులతో ఈ కమిటీ ఉంటుంది. ఈ కమిటీలో తెలుగుదేశం నుంచి  ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర,   నిమ్మల రామానాయుడు,  ఎం.వి.సత్యనారాయణ రాజు, జనసేన నుంచి  కొటికలపూడి గోవిందరావు, కందుల దుర్గేష్,  బొలిశెట్టి శ్రీనివాస్, పత్సమట్ల ధర్మరాజు,   చాగంటి మురళీకృష్ణ,  రత్నం అయ్యప్ప ఉన్నారు.


పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం, జనసేన పార్టీల ఉమ్మడి బహిరంగ సభను ఈనెల 28న నిర్వహించనున్నారు. భారీ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.   ఈనెల 28న ప్రత్తిపాడులో 21 ఎకరాల్లో ఉమ్మడి బహిరంగ సభ ఉంటుందని, రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ, జనసైనికులతో పాటు ప్రజలందరిని ఈ సభకు ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఈ వేదికపై 175 నియోజకవర్గాల నుండి 500 మంది టీడీపీ – జనసేన నేతలు పాల్గొంటారు.  ఆరు లక్షల మంది ఈ సభలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు.  రాజకీయ ప్రస్థానంలో ఈ సభ అద్భుతంగా ఉంటుందని  టీడీపీ, జనసేన వర్గాలు చెబుతున్నాయి. 


త్వరలోనే రాష్ట్రంలో ఎన్నికల సంగ్రామం మొదలవు తోంది. ఈ నేపథ్యంలో ఇరుపార్టీల అధినేతలు రాష్ట్ర ప్రజలకు ఒక ఉమ్మడి సందేశం ఇవ్వాలని నిర్ణయించు కున్నారు. దానిలో భాగంగా రాష్ట్రచరిత్రలో గతంలో ఎన్నడూ జరగని విధంగా నభూతో అన్న రీతిలో ఈనెల 28వ తేదీన తాడేపల్లి గూడెం పక్కన పత్తిపాడు గ్రామంలో టీడీపీ`జనసేన పార్టీల ఉమ్మడి సభను నిర్వహిం చాలని నిర్ణయించామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇరుపార్టీల వైపు నుంచి మొత్తం 12 మంది సభ్యులు సభా నిర్వహణ ఏర్పాట్లు చేస్తారు. ఈ సమావేశానికి తరలి రావాలని టీడీపీ-జనసేన కుటుంబ సభ్యులకు, జగన్‌రెడ్డి బాధితులైన రాష్ట్ర ప్రజ లకు ఆహ్వానం పలుకుతున్నాం. భారీసంఖ్యలో తరలి వచ్చి, సభను విజయవంతం చేయాలని, మన రెండు పార్టీల సభతో జగన్‌రెడ్డి వెన్నులో వణుకు పుట్టేలా చేయాలని అచ్చెన్నాయుడు పిలుపు ఇచ్చారు.


టీడీపీ – జనసేన ఉమ్మడి మేనిఫెస్టోపై ఇరుపార్టీల అధ్యక్షులు సభా వేదికైప ప్రకటించే అవకాశం ఉంది.  మా కూటమి ఏర్పాటును జీర్ణించుకోలే కనే సీట్ల కేటాయింపులో అభిప్రాయభేదాలు ఉన్నట్టు చూసిస్తూ, టీడీపీ-జనసేన పార్టీల మధ్య చిచ్చు పెట్ట డానికి జగన్‌రెడ్డి  ప్రయత్నిస్తున్నారని రెండు పార్టీల నేతలు విమర్శిస్తున్నారు.  చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు 5 కోట్లమంది ప్రజల భవిష్యత్‌ ను దృష్టిలో పెట్టుకొని పనిచేస్తున్నారనే వాస్తవాన్ని అందరూ గ్రహించాలని అంటున్నారు.  మరలా రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడే వరకు, రామరాజ్యం వచ్చేవరకు ప్రజలందరూ టీడీపీ-జనసేన పక్షానే నిలవాలని  పిలుపునిచ్చేందుకు తాడేపల్లి గూడెం సభ నిర్వహిస్తున్నట్లుగా ప్రకటించారు.