TDP MLA Daggupati Venkateswara Rao Reaction On Audio Call: అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌ను దుర్భాషలాడినట్లుగా ఓ ఆడియో కాల్ నెట్టింట వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా ఎమ్మెల్యే స్పందించారు. అది ఫేక్ ఆడియో కాల్ అని... తాను ఎన్టీఆర్‌ను బూతులు తిట్టలేదని స్పష్టం చేశారు. తనపై కుట్రలు జరుగుతున్నట్లు చెప్పారు.
నందమూరి కుటుంబానికి బిగ్ ఫ్యాన్
తాను కూడా నందమూరి కుటుంబానికి బిగ్ ఫ్యాన్ అని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. 'ఆ ఆడియో కాల్స్ నావి కాదు. రాజకీయ కుట్రలో భాగంగానే ఇదంతా చేస్తున్నారు. గత 16 నెలలుగా అర్బన్ నియోజకవర్గంలో నాపై కుట్రలు జరుగుతున్నాయి. నేను మొదటి నుంచి నందమూరి కుటుంబానికి అభిమానిని. బాలకృష్ణ, ఎన్టీఆర్ సినిమాలంటే ఇష్టంగా చూసే వాడిని. కానీ నేను జూనియర్ ఎన్టీఆర్‌ను దూషిస్తున్నట్టుగా ఆడియో కాల్స్ సృష్టించారు. ఆ కాల్ ఓ ఫేక్. అందులో ఎలాంటి నిజం లేదు.
దీనిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాను. కచ్చితంగా పోలీసులు విచారణ చేసి చర్యలు తీసుకుంటారు. ఈ ఆడియో కాల్ వల్ల జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మనసు నొచ్చుకొని ఉంటే నా వైపు నుంచి క్షమాపణ చెబుతున్నా. నా ప్రమేయం లేకున్నప్పటికీ ఇందులో నా పేరు ప్రస్తావించారు కాబట్టి ఈ క్షమాపణలు చెబుతున్నాను. నారా, నందమూరి కుటుంబాలకు నేను ఎప్పటికీ విధేయుడునే.' అని స్పష్టం చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు.
Also Read: ఎవర్రా మీరు... ఇంత టాలెంటెడ్‌గా ఉన్నారు - జడ్జ్ బిందు మాధవికే ఫ్రస్టేషన్ తెప్పించారుగా?
ఆ కాల్‌లో ఏముంది?
జూనియర్ ఎన్టీఆర్‌ను లం.... కొడుకు అంటూ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ బూతులు తిట్టినట్లుగా ఆ ఆడియో కాల్‌లో ఉంది. 'మంత్రి లోకేశ్ గురించే తప్పుగా మాట్లాడతాడా? 'వార్ 2' ఎలా ఆడుతుందో చూస్తా. అనంతపురంలో సినిమా ప్రదర్శనను నిలిపేయాలి.' అంటూ వార్నింగ్ ఇచ్చినట్లుగా ఆ ఆడియోలో ఉంది. దీనిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లు కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మూవీ ప్రదర్శనను ఎలా ఆపేస్తారో చూస్తామంటూ కామెంట్స్ చేశారు. ఓ ఎమ్మెల్యే అయ్యుండి అలా మాట్లాడడం కరెక్ట్ కాదంటూ పేర్కొన్నారు. తాజాగా ఆ ఆడియో కాల్ తనది కాదంటూ ఎమ్మెల్యే క్లారిటీ ఇచ్చారు.