TTD Vs TDP : ధర్మారెడ్డితో చర్చకు ఆనం రెడీ - ప్లేస్, టైం డిసైడ్ చేయాలని సవాల్ !

TTD Vs TDP : ధర్మారెడ్డితో తాను చర్చకు రెడీగా ఉన్నానని టీడీపీ ఆనం వెంకటరమణారెడ్డి ప్రకటించారు. టీటీడీ ఈవో ఓ ఫేక్ ఆఫీసర్ అని మరోసారి ఆరోపణలు గుప్పించారు.

Continues below advertisement

 

Continues below advertisement

TTD Vs TDP :  తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఈవో ధర్మారెడ్డి (EO Dharma Reddy)పై టీడీపీ నేత (TDP Leader) ఆనం వెంకటరమణారెడ్డి (Anam Venkataramana Reddy) మండిపడ్డారు. ధర్మారెడ్డి ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నానని, సమయం, వేదిక ఎప్పుడు చెప్పినా తాను సిద్ధమని సవాల్ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఒక దొంగని.. ఆయనకు అర్హత లేదని తెలిసినా.. ఈవోగా నియమించారని విమర్శించారు. ఢిల్లీ కేంద్రంగా రక్షణశాఖలో ఎస్టేట్‌ ఆఫీసర్‌గా పనిచేశారని, ధర్మారెడ్డిది మున్సిపాలిటీలో సర్వేయర్‌ స్థాయి మాత్రమేనని అన్నారు.టీటీడీ ఇంఛార్జ్‌ ఈవో ధర్మా రెడ్ది ఒక దొంగ.. ఒక బ్రోకర్ అని విమర్శించారు.  

టీటీడీ ఈవో నియామకానికి సంబంధించి చల్లా కొండయ్య కమిషన్ నిర్ణయాలను ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ ఆమెదించిందని గు్తుచేశారు.  రాజశేఖర్ రెడ్ది ముఖ్యమంత్రి అయినా తర్వాత టైటిఫిలో ధర్మారెడ్డి వోఎస్‌డీగా నియమితులయ్యాడు.. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత కొత్త పోస్ట్ సృష్టించి అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమించారు. వైఎస్ కుటుంబం కోసం ఢిల్లీలో చక్రం తిప్పే ధర్మారెడ్డికి తిరుమలలో ఉద్యోగం ఇచ్చారు అని విమర్శించారు. 1987 చట్టం ప్రకారం ఈవో, జేఈవో ఉండగా అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ను ఎలా నియమిస్తారని ప్రశ్నించారు.  దీనికి అసెంబ్లీ ఆమోదం ఉందా..? అసెంబ్లీ ఆమోదం లేదు కాబట్టే ధర్మారెడ్డి ఒక డమ్మీ అని స్పష్టం చేశారు.ు 

రక్షణ శాఖ ఎస్టేట్ ఆఫీసర్ అయిన ధర్మారెడ్డి తన స్థాయి ప్రిన్సిపల్ సెక్రటరీ అని చెప్పుకోవడం సిగ్గుచేటు.. తహసీల్దార్, ఆర్డీవోగా కూడా పని చేయని ధర్మారెడ్డికి అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా అర్హత లేదని స్పష్టం చేశారు.  ధర్మారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక ఫేక్ ఆఫీసర్ అన్నారు.  రూ. 4వేల కోట్లున్న తిరుమల బడ్జెట్ కు ఇండియన్ ఆడిట్ అకౌంట్స్ ఆఫీసర్ ను అధికారిగా చంద్రబాబు వేశారు  ఐ.ఆర్.ఎస్ అధికారి ఉంటే దేవస్థానం డబ్బులు దొంగిలించడానికి వీలు ఉండదు కాబట్టి  ఒక ఛార్టర్డ్ అకౌంట్ గా ఉన్న ఆఫీసర్ ను చీఫ్ అకౌంట్ ఆఫీసర్ గా నియమించారు అని గుర్తుచేశారు.  

టీటీడీకి తన వల్లే డొనేషన్లు వస్తున్నట్లుగా  ఈవో ధర్మారెడ్డి చెప్పడం సిగ్గుచేటని ఆనం వెంకటరమణారెడ్డి మండిపడ్డారు.  శ్రీ వేంకటేశ్వర స్వామిని చూసి ప్రేమతో డోనేషన్లు ఇస్తుంటే.. తన వల్లే వస్తున్నాయని చెప్పుకోవడం ఏమిటన్నారు.  నాలుగేళ్లలో 16 వేల కోట్ల రూపాయల నిధులను ఇష్టనుసారం ఖర్చు పెట్టారు.. ప్రతీ లెక్కా తేల్చుతాం.. అని వార్నింగ్‌ ఇచ్చారు. తిరుమల అభివృద్ధి కోసం చంద్రబాబు నిబద్దతతో పనిచేశారని తెలిపారు. అయితే, ఇప్పుడు తిరుమలలో జరుగుతున్న ఆర్ధిక లావాదేవిలపై విచారణ జరపాలన్నారు. 

వైఎస్‌ వివేకానంద రెడ్ది హత్యలో ధర్మారెడ్డికి కూడా సంబందం ఉందని ఆనం ఆరోపంచారు.  వివేకానంద రెడ్ది కూతురు సునీతానే ఈ విషయం చెప్పిందన్న ఆయన.. సెంట్రల్ సర్వీసెస్ లో ఉన్న ధర్మారెడ్డికి ఢిల్లీలో వైఎస్‌ అవినాష్ రెడ్ది ఇంట్లో ఏం పని అని  ప్రశ్నించారు.  త్వరలో వీఆర్ఎస్ తీసుకొని ధర్మారెడ్డి.. నంద్యాల లోక్ సభ స్థానం నుండి వైసీపీ తరపున బరిలోకి దిగాలని చూస్తున్నారని ఆరోపించారు.  ఢిల్లీలో సీఎం వైఎస్‌ జగన్ కు బ్రోకరేజ్ చేస్తున్న ధర్మారెడ్డిని వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. 

Continues below advertisement
Sponsored Links by Taboola