Alekhya Reddy Tweet: తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి ఎవరివైపు? వైరల్ అవుతున్న పోస్ట్

Nandamuri Alekhya Reddy: అలేఖ్య రెడ్డికి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి చాలా దగ్గరి బంధుత్వం ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఉగాది వేడుకులను అలేఖ్య రెడ్డి ఇంట్లోనే విజయసాయి రెడ్డి జరుపుకున్నారు.

Continues below advertisement

Nandamuri Taraka Ratna Wife: ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ దివంగత నందమూరి తారకరత్న సతీమణి అలేఖ్య రెడ్డి చేసిన ట్వీట్ ఒకటి చర్చనీయాంశం అవుతోంది. ఆమె తాను ఎవరికి సపోర్ట్ చేస్తున్నాననే విషయాన్నే ఆ ట్వీట్ చేశారు. నిజానికి అలేఖ్య రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ వైపు నిలుస్తారనే విషయం అందరిలోనూ ఆసక్తిగా ఉంది. ఇందుకు కారణాలు కూడా ఉన్నాయి. అలేఖ్య రెడ్డి భర్త తారకత్నది నందమూరి వంశం పైగా టీడీపీ కుటుంబం. అలాగే అలేఖ్య రెడ్డికి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి చాలా దగ్గరి బంధుత్వం ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఉగాది వేడుకులను అలేఖ్య రెడ్డి ఇంట్లోనే విజయసాయి రెడ్డి జరుపుకున్నారు.

Continues below advertisement

తారకరత్న చనిపోయిన సందర్భంలో కూడా విజయసాయి రెడ్డి నందమూరి కుటుంబ సభ్యులతో చేతులు కలిపి ఆ క్రతువులు అన్నింటిని పూర్తి చేశారు. రాజకీయ, వ్యక్తిగత వైరుద్ధ్యాలు ఎక్కడా చూపకుండా విజయసాయి రెడ్డి నందమూరి కుటుంబంతో ఆ సమయంలో కలిసిపోయారు. తర్వాత రాజకీయాల పరంగా వేర్వేరుగానే ఉంటున్నారు. పరస్ఫర విమర్శలు కూడా ఉంటున్నాయి. అయినా, వ్యక్తిగత జీవితంలో అలేఖ్య రెడ్డి విజయసాయి రెడ్డిని తన తండ్రి లాగే చూస్తుంటారు. మా జీవితంలో నాన్నలాంటి గొప్పవ్యక్తి విజయసాయిరెడ్డి అంకుల్ అని.. ఆయన ఆశీర్వాదాలు మాకు ఎప్పుడూ ఉంటాయని అలేఖ్య రెడ్డి ఓ సందర్భంలో అన్నారు. తమ కష్టసుఖాల్లో వెంటనే ఉండి ధైర్యం చెప్పారని అన్నారు. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండి కూడా ఉగాది తమతో జరుపుకోవడం చాలా సంతోషకరం అని అన్నారు. 

తాజాగా అలేఖ్య రెడ్డి చేసిన ఓ ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంది. రాబోయే ఎన్నికల్లో తాను తన బాలయ్య మామయ్య వైపే నిలుస్తానంటూ ట్వీట్ చేశారు.  తన ఇన్‌స్టా, ఫేస్ బుక్, ట్విటర్ లలో బాలక్రిష్ణ, మోక్షజ్ఞతో తాను తన పిల్లలు ఉన్న ఫొటోను అలేఖ్య రెడ్డి షేర్ చేశారు. నేను ఏ వైపు ఉన్నానని తనను కొంత మంది అడుగుతున్నారని.. తన సమాధానం ఇదే అని అన్నారు. తాను, తన పిల్లల పట్ల అంగీకారం, ప్రేమ ఉన్న వైపే తాము ఉంటామంటూ పోస్ట్ చేశారు. దీంతో ఆమె నందమూరి వంశానికే, అంటే టీడీపీకే మద్దతిస్తున్నట్టు ప్రకటించారు.

Continues below advertisement
Sponsored Links by Taboola