Talliki Vandanam Eligibility Status: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు తల్లికి వందనం పథకం అమలు చేస్తుంది. ఈ పథకం ప్రతి ఏటా రూ.15 వేలు నేరుగా ఖాతాల్లో జమ చేస్తున్నారు. వీటిలో రూ.13 వేలు విద్యార్థి తల్లి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. మిగిలిన రూ.2 వేలు మాత్రం సూళ్ల నిర్వహణ కోసం వినియోగిస్తారు. 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభం జూన్ లో తల్లికి వందనం డబ్బులు లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే తల్లికి వందనం స్కీమ్ కు మీరు అర్హులా, కాదా అనే తెలుసుకోవచ్చు. అదేలానో చూద్దాం. 

Continues below advertisement

తల్లికి వందనం పథకం స్టేటస్ తనిఖీ విధానం

2026-27 కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించిన “తల్లికి వందనం” పథకం అర్హతను ఆన్‌లైన్‌లో ఈ కింద విధంగా చెక్ చేసుకోవచ్చు.  

1. అధికారిక వెబ్‌సైట్ https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout లింక్ ను ఓపెన్ చేయండి2. కుటుంబ పెద్ద లేదా తల్లి ఆధార్ నెంబర్ నమోదు చేయండి3. స్కీమ్ టైప్ లో “తల్లికి వందనం” సెలెక్ట్ చేయండి4. సంవత్సరం 2026-27 సెలెక్ట్ చేయండి5. "Get Details" పై క్లిక్ చేయండి6. ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది7. OTP నమోదు చేయండి8. 'Verify'పై క్లిక్ చేయండి

Continues below advertisement

Also Read:  రోజుకు రూపాయితో రూ.6,00,00 బీమా.. ఈ ప్రభుత్వ పథకాల గురించి తెలుసా?

వెరిఫై చేసిన తర్వాత మూడు విభాగాలు కనిపిస్తాయి. అవి 

  1. సిటిజన్ డీటైల్స్  
  2. ఫ్యామిలీ డీటైల్స్  
  3. స్కీమ్ ఎలిజిబిలిటీ కాలిక్యులేటర్

 ఎలిజిబిలిటీ కాలిక్యులేటర్ లో వాలిడేషన్ స్టేటస్ 'Satisfied' అని ఉంటే మీరు తల్లికి వందనం పథకానికి అర్హులు అవుతారు. వివరాల్లో తప్పులు ఉంటే వెంటనే సంబంధిత సచివాలయం  లేదా పాఠశాలలో సంప్రదించి సరిచేసుకోవాలి. 

Also Read: రూ.50 లక్షల లోన్, రూ.17 లక్షల సబ్సిడీ.. PMEGP Scheme అర్హతలు, అప్లై ప్రాసెస్ ఇలా

తల్లికి వందనం అర్హతలు 

  • కుటుంబంలో ఎవరు ఆదాయపు పన్ను చెల్లించి ఉండకూడదు
  • 10 ఎకరాలలోపు డ్రై ల్యాండ్ 
  • 5 ఎకరాలలోపు వెట్ ల్యాండ్ 
  • 12 నెలల విద్యుత్ వినియోగం 300 యూనిట్ల లోపు ఉండాలి. 
  • కుటుంబంలో ఫోర్ వీలర్ కలిగి ఉండకూడదు.
  • పట్టణాల్లో 1000 చదరపు అడుగుల లోపు స్థలం ఉన్నవారు అర్హులు 
  • కుటుంబంలో ఎవరూ ప్రభుత్వ/అవుట్‌సోర్స్/పెన్షన్/కాంట్రాక్ట్ ఉద్యోగిగా ఉండకూడదు.

Also Read: విద్యుత్ బిల్లు ఆదాతో పాటు ఆదాయం.. రూ.78 వేల వరకు సబ్సిడీ.. పీఎం సూర్య ఘర్ స్కీమ్ పూర్తి వివరాలు ఇవే!

బ్యాంక్ అకౌంట్ తో ఆధార్ లింక్ 

తల్లి వందనం డబ్బులు బ్యాంకులో పడాలంటే ముందుగా బ్యాంక్ అకౌంట్ ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి. గతేడాది చాలామంది విద్యార్థులు అర్హత ఉండి కూడా తల్లికి వందనం పథకానికి పొందలేకపోయారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని విద్యాశాఖ విద్యార్థుల తల్లులను ఇప్పటికే అలర్ట్ చేసింది. ప్రతి ఒక్కరూ తమ బ్యాంక్ అకౌంట్ ను ఆధార్ అనుసంధానం చేసుకోవాలని సూచించింది.