Kethireddy Peddareddy Vs JC Prabhakar Reddy: అధికారం ఉన్నప్పుడు ఆ నియోజకవర్గంలో ఆయన రారాజుగా వెలుగొందారు. తాను చెప్పిందే శాసనంగా నియోజకవర్గంలో చక్రం తిప్పారు. కట్ చేస్తే ఎన్నికల్లో అధికార పార్టీతో పాటు ఆయన కూడా ఓటమి చవి చూశారు. దీంతో ఒక్కసారిగా నియోజకవర్గంలో రారాజుగా వెలుగొందిన నేత ఒంటరి అయిపోయాడు. నియోజకవర్గంలోకి వెళ్లాలన్నా కూడా అనుమతి దొరకడం లేదు ఇంతకు ఆ నియోజకవర్గంలో ఏది ఆ నేత ఎవరు అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం.. 


రెండు కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు
తాడిపత్రి నియోజకవర్గం పేరు వింటేనే చాలు రాష్ట్రవ్యాప్తంగా అందరికీ గుర్తొచ్చేది ఫ్యాక్షన్. నాటి నుంచి నేటి వరకు ఫ్యాక్షన్ మూలాలు ఉన్న నియోజకవర్గాల్లో తాడిపత్రి కూడా ఒకటి. ఆ ఫ్యాక్షన్ మూలాలు కాస్త రాజకీయంగా మారాయి. రెండు కుటుంబాల మధ్య ఆధిపత్య పోరుకు దారితీశాయి. సై అంటే సై అంటూ ఒకపక్క జేసీ కుటుంబం మరోవైపు కేతిరెడ్డి కుటుంబం కాలు దువ్వుతున్నాయి. ఎవరిది అధికారం ఉంటే అక్కడ వారిదే పైచేయి. ఒకప్పుడు రెండు కుటుంబాలు ఒకే పార్టీలో (కాంగ్రెస్) లో ఉండేవి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండు కుటుంబాల మధ్య ఒక ఒప్పందం కుదిర్చి గొడవలను సర్ధుమణిగేలా చేశారు. 


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంతో మళ్లీ గొడవలు
తాడిపత్రి నియోజకవర్గంలో గత నాలుగు దశాబ్దాలుగా జెసీ కుటుంబానిదే హవా కొనసాగుతూ వస్తుంది. ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా జెసి దివాకర్ రెడ్డి జెసి ప్రభాకర్ రెడ్డి కొనసాగుతూ వచ్చారు. వారి అధికారానికి అడ్డుకట్ట వేయాలంటే తాడిపత్రిలో మరో బలమైన నేతను దించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి భావించారు. అందుకు అనుగుణంగానే జెసి కుటుంబానికి ప్రత్యర్ధి అయిన కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి నియోజకవర్గ ఇన్చార్జిగా ప్రకటించారు. దీంతో తాడిపత్రి రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. 2019 వరకు జెసి కుటుంబం హవా కొనసాగినప్పటికీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టింది. తాడిపత్రి నియోజకవర్గంలో కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి గెలుపొందారు. 


జేసీ కుటుంబంపై కేసులు - అరెస్టులు
ఇక్కడి నుంచి జెసి కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ అలాగే ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి జెసి ఆర్థిక మూలాలను దెబ్బ తీసే విధంగా వ్యూహాలు రచించారు. జెసి ట్రావెల్స్ లో అక్రమాలు జరిగాయని జెసి ప్రభాకర్ రెడ్డిని జెసి అస్మిత్ రెడ్డి పై కేసులు బనాయించి జైలుకు కూడా పంపించారు. ఇక అప్పటినుంచి ఈ ఆధిపత్య పోరు మరింత ఎక్కువయింది. ఇద్దరి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో తాడిపత్రి హోరెత్తింది. పెద్దారెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పోలీసుల సహాయంతో  జెసిని ఇంటి బయట కూడా రానివ్వకుండా అనేకమార్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఏక్కడ ఏ ధర్నా కానీ, ఆందోళన చేసే ప్రయత్నం చేసినా అడ్డుకున్న ప్రయత్నం చేసేవారు.ఇక పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఒక అడుగు ముందుకేసి ఏకంగా జెసి ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకి వెళ్లి ఆయన సోఫాలో కూర్చున్నాడు. ఆ సమయంలో జెసి ప్రభాకర్ రెడ్డి ఇంట్లో లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు.


మున్సిపల్ ఎన్నికల యుద్ధం 
2019 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరిగిన అన్ని మున్సిపాలిటీ ఎన్నికల్లో  వైసిపి కైవసం చేసుకోగా ఒక తాడిపత్రిలో మాత్రం జెసి ప్రభాకర్ రెడ్డి మార్కు చూపించారు. ఆ ఎన్నికల్లో తాడిపత్రిలో  ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ గెలుపొందారు. అక్కడి నుంచి మరింత రంజుగా రాజకీయం మొదలైంది. నువ్వా నేనా అన్నట్టు ఇద్దరు నేతలు కూడా సవాళ్లు ప్రతి సవాళ్లతో వాడి వేడిగా తాడిపత్రి పట్టణంలో మాటల యుద్ధం కొనసాగింది. ఇంతలోనే సార్వత్రిక ఎన్నికలు రానే వచ్చాయి 2024 సార్వత్రిక ఎన్నికల్లో తాడిపత్రి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జెసి ఆస్మిత్ రెడ్డి గెలుపొందారు ఆ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఓటమి చెవి చూశారు. పోలింగ్ రోజు పోలింగ్ అనంతరం జరిగిన అల్లర్లలో ఇద్దరు నేతలను తాడపత్రి నియోజకవర్గం నుంచి కోర్టు ఆదేశాలతో పోలీసులు బయటికి పంపించారు. 


అధికారం కోల్పోవడంతో ఒంటరైన కేతిరెడ్డి పెద్దారెడ్డి
సార్వత్రిక ఎన్నికల అనంతరం కేతిరెడ్డి పెద్దారెడ్డి ఒంటరి అయ్యాడని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అధికారం ఉన్నప్పుడు అంతా తమదే అన్నట్లు ఉన్న నేతలు కూడా అధికారం పోవడంతో కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఒంటరి ని చేశారు. ఎన్నికలు ముగిసి దాదాపు మూడు నెలలు కావస్తున్న ఇప్పటివరకు కూడా మాజీ ఎమ్మెల్యేకి తాడిపత్రిలోకి ఎంట్రీ లేదంటే అర్థం చేసుకోవచ్చు ఎలాంటి పరిణామాలు ఉన్నాయో అని.  పెద్దారెడ్డికి సొంత పార్టీ నుంచి కూడా పెద్దగా మద్దతు లభించలేదనీ గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.  2024 ఎన్నికల సమయంలో పెద్ద రెడ్డి ఇంట్లోకి పోలీసులు వచ్చి తన ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు... ఆ సమయంలో కూడా ఒక వైసీపీ అధినేత జగన్ తప్ప మిగిలిన నాయకులు ఎవరూ కూడా తనకు సంఘీభావం తెలపలేదు. తాజాగా తాడిపత్రికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్లడంతో అక్కడ భారీ ఎత్తున గొడవ జరిగింది. 


తన అనుచరుడు మురళి ఇంట్లోకి టీడీపీ కార్యకర్తలు వెళ్లి విధ్వంసం సృష్టించారు. ఎదెబ్విషయంలో  జిల్లా ఎస్పీని కలిసి ఎందుకు అనంతపురం జిల్లా నేతలు ముకుమ్మడిగా పెద్దారెడ్డి తో కలిసి వెళ్లారు... కానీ కేవలం ముగ్గురు, నలుగురు నాయకులు మాత్రమే పెద్దారెడ్డికి సంఘీభావం తెలిపేందుకు ముందుకు వచ్చారని టాక్ వినిపిస్తోంది. తన పక్కనే ఉన్న సింగనమల వైసిపి నాయకులు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదని తెలుస్తొంది...కేవలం మాజీ మంత్రి శంకర్ నారాయణ, అనంతపురం మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, అనంతపురం మాజీ ఎంపీ తలారి రంగయ్య మాత్రమే ఎస్పీని కలిసేందుకు వచ్చారు. రాప్తాడు, గుంతకల్లు , సింగనమల నాయకులు ఎవరు అటు వైపు కూడా చూడలేదు. ఎస్పీని కలిసి ఎందుకు సొంత పార్టీ నాయకులు రాకపోవడం తో పెద్దారెడ్డి ఒంటరయ్యాడని వైసిపి పార్టీలో నాయకులు చర్చించుకుంటున్నారు.