Minister Perni Nani : ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణ అధ్యాయానికి సీఎం జగన్(CM Jagan) నాంది పలికారని మంత్రి పేర్ని నాని అన్నారు. సోమవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. పరిపాలనా సౌలభ్యం, ప్రజా సౌకర్యార్థం కోసం సీఎం జగన్ పాదయాత్ర(Padayatra)లో ఇచ్చిన మాట ప్రకారం 26 జిల్లాలు ఏర్పాటుచేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 13 జిల్లా కేంద్రాలు వచ్చాయన్నారు. స్వాతంత్ర్యం వచ్చే సరికి కేవలం 6 జిల్లాలు మాత్రమే ఉన్నాయన్నారు. 1979 తర్వాత అంటే 42 ఏళ్ల నుంచి కొత్త జిల్లాల(New Districts) ఏర్పాటు లేదన్నారు. జనాభా పెరిగిందని జిల్లాలు పెంచాలని చంద్రబాబు ఎందుకు ఆలోచించలేదని మంత్రి పేర్ని నాని(Minister Perni Nani) ప్రశ్నించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్(Janasena Chief Pawan Kalyan) కూడా బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. సమస్యల పట్ల అవగాహన లేకుండా పవన్ మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబుపై స్వామిభక్తి ఎక్కువై పవన్ మాట్లాడుతున్నారని ఆరోపించారు. జిల్లాల నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు పవన్ ఎక్కడున్నారని మంత్రి పేర్ని నాని విమర్శించారు. పవన్ ను నమ్మి ఆయన జెండా మోస్తున్నవారు పవన్ సీఎం అవ్వాలని అనుకుంటున్నారని, కానీ చంద్రబాబును(Chandrababu) సీఎం చెయ్యాలనే పవన్ ఆలోచిస్తున్నారన్నారు.
40 ఏళ్ల అనుభవం ఏమైంది?
రాష్ట్ర చరిత్రలో నూతన ఆధ్యాయానికి సీఎం జగన్ నాంది పలికారని మంత్రి పేర్ని నాని తెలిపారు. సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చి మాట ప్రకారం పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మార్చారని గుర్తుచేశారు. కేవలం మూడేళ్ల అనుభవంలోనే ఇలాంటి చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవడం గొప్ప విషయమన్నారు. వైఎస్ జగన్ ఇచ్చిన హామీల్లో 95 శాతం నెరవేర్చారని మంత్రి పేర్ని నాని తెలిపారు. టీడీపీ ప్రభుత్వంలో పాఠశాలలు మూడపడే స్థాయి నుంచి ఇవాళ సీట్లు ఖాళీ లేవు అనే స్థాయికి చేరుకున్నాయన్నారు. నలభై ఏళ్ల ఇండస్ట్రీ(Forty Years Industri అని చెప్పుకునే చంద్రబాబు అనుభవం ఏమైందని మంత్రి పేర్నినాని ప్రశ్నించారు. చివరికి ఓ యువకుడి వద్ద కుప్పం రెవిన్యూ డివిజన్ చేయాలని అభ్యర్థించారన్నారని ఎద్దేవా చేశారు.
జనసేన 175 స్థానాల్లో పోటీ చేయాలి
పవన్ కు ఏటపాక, కుకునూరు ఏ జిల్లాల్లో ఉన్నాయో కూడా తెలీదా అని మంత్రి ప్రశ్నించారు. జిల్లాల నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు పవన్ ఎందుకు మాట్లాడలేదని విమర్శించారు. తన అభిప్రాయం ప్రభుత్వానికి ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. షూటింగ్ లో ఉండి పట్టించుకునే సమయం లేదేమో అని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో(175 Constituencies) జనసేన పోటీ చెయ్యాలని ఆ పార్టీ కార్యకర్తలు కోరుకుంటుంటే టీడీపీ(TDP)తో పొత్తుపెట్టుకోడానికి పవన్ తాపత్రయపడుతున్నారని మంత్రి విమర్శించారు. సొంత పార్టీ కార్యకర్తల డిమాండ్లు నెరవేర్చాలని పవన్ కు హితవు పలికారు. కార్యకర్తల కోరిక మేరకు 175 సీట్లలో పోటీ చేయాలని పవన్ కు సూచించారు.