పాఠశాల విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. 2021-22 ఏడాదికి సంబంధించి సిలబస్ తగ్గిస్తున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించి పాఠశాల విద్యా శాఖ సర్క్యులర్‌ జారీ చేసింది. 3 నుంచి 10 తరగతులకు సిలబస్​ను తగ్గించినట్లు పేర్కొంది. 3 నుంచి 9 తరగతులకు 15 శాతం.. 10వ తరగతికి 20 శాతం సిలబస్ తగ్గించినట్లు తెలిపింది. దీంతో పాటుగా.. పాఠశాల పని దినాల అకడమిక్ కేలండర్‌ సైతం కుదించింది. కేలండర్‌ను 31 వారాల నుంచి 27 వారాలకు తగ్గించినట్లు పేర్కొంది. ఈసారి 2 భాగాలుగా అకడమిక్ కేలండర్​ను రూపొందించినట్లు పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ చినవీరభద్రుడు వెల్లడించారు. కోవిడ్ కారణంగా పాఠశాలలు ఆలస్యంగా తెరుచుకున్న నేపథ్యంలో సిలబస్ కుదించినట్లు తెలుస్తోంది. 


ఏపీలో కోవిడ్ తీవ్రత కారణంగా ఏడాదిన్నక క్రితం మూతపడిన పాఠశాలలు.. ఆగస్ట్ 16 నుంచి పున:ప్రారంభమైన విషయం తెలిసిందే. పాఠశాలల్లో కోవిడ్‌ 19 నిబంధనలను కచ్చితంగా పాటించడంతో పాటు విద్యార్థుల మధ్య భౌతిక దూరం ఉండేలా చర్యలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రతి ఒక్క విద్యార్థికి మాస్క్ తప్పనిసరి అనే నిబంధన కూడా విధించారు. అయితే పాఠశాలలు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు పలువురు విద్యార్థులు, టీచర్ల కోవిడ్ మహమ్మారి బారినపడ్డారు. దీనిపై ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. కేసులు నమోదైన పాఠశాలలపై ప్రత్యేక దృష్టిపెట్టామని తెలిపారు. కోవిడ్ కేసులు వచ్చిన పాఠశాలల్లో విడతల వారీగా క్లాసులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. 


పదో తరగతి విద్యార్థులకు ఇకపై మార్కులే..
ఏపీలో 10వ తరగతిలో గ్రేడ్లు, గ్రేడ్‌ పాయింట్లు ఉండవని ప్రభుత్వం వెల్లడించింది. ఇకపై టెన్త్ విద్యార్థులకు గ్రేడ్ల స్థానంలో మళ్లీ మార్కుల విధానమే ఉంటుందని ప్రభుత్వం చెప్పింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు 2010లో తీసుకొచ్చిన గ్రేడింగ్‌ విధానానికి స్వస్తి పలికినట్లు పేర్కొంది. ప్రవేశాలు, నియామకాల్లో ప్రతిభను గుర్తించేందుకు 2020 నుంచి మార్కులు ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. ఒకే గ్రేడ్ ఎక్కువ మందికి వచ్చినప్పుడు ప్రవేశాలు, నియామకాల్లో సమస్యలు వస్తున్నాయని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీంతో గ్రేడ్ల స్థానంలో మార్కులు ఇవ్వాలనే ప్రతిపాదనలను తీసుకొచ్చినట్లు తెలిపింది.  


Also Read: Weather Updates: ఏపీకి మరో 3 రోజులు వర్షాలే.. ఈ జిల్లాల వారికి అలర్ట్, తెలంగాణలో వానలు ఈ ప్రాంతాల్లో..


Also Read: Pavan Kalyan Birthday: పవన్ కళ్యాణ్ బర్త్‌ డే స్పెషల్.. జనంలో ఉంటాడు.. జనంలా ఉంటాడు, ఇదీ పవర్ స్టారంటే!