YS Viveka murder case Surpreme Court: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుల బెయిల్ రద్దు అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. నిందితుల బెయిల్ రద్దు అంశంలో ఇప్పుడు జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిందితుల బెయిల్ రద్దుతో పాటు దర్యాప్తును కొనసాగించడానికి ట్రయల్ కోర్టునే ఆశ్రయించాలని పిటిషనర్ అయిన వైఎస్ సునీతకు సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. మరింత సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలని వైఎస్ సునీతతరపు లాయర్ కోరారు. అయితే సీబీఐ ఇప్పటికే చార్జ్‌షీట్ దాఖలు చేసిందని  సుప్రీంకోర్టు గుర్తు చేసింది.  అంతకు ముందు సీబీఐ తరపు లాయర్.. కోర్టు ఆదేశిస్తే.. దర్యాప్తు కొనసాగిస్తామని తెలిపింది. 

Continues below advertisement

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మొత్తం 8 మంది నిందితుల్ని అరెస్టు చేశారు. వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఎర్ర గంగి రెడ్డి ,  సునీల్ యాదవ్  , ఉమాశంకర్ రెడ్డి , దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి , గజ్జల ఉదయ్ కుమార్ రెడ్జి, వి. రాజశేఖర్ రెడ్డిలను అరెస్టు చేశారు. వీరంతా బెయిల్ పై బయటకు వచ్చారు. అవినాష్ రెడ్డి మినహా అందరూ జైల్లో కొంత కాలం గడిపిన తర్వాత బెయిల్ వచ్చింది. అయితే అవినాష్ రెడ్డికి మాత్రం అరెస్టు చేసిన విషయం కూడాతెలియకుండానే బెయిల్ వచ్చేసింది. హైకోర్టు అరెస్టు చేసినా వెంటనే బెయిల్ ఇవ్వాలని ఆదేశించడంతో.. ఓ రోజు సీబీఐ అధికారులు అరెస్టు చేసినట్లుగా చూపించి..అదే రోజు బెయిల్ ఇచ్చారు. 

బెయిల్ రద్దు చేయాలని అప్పటి నుంచి వైఎస్ నునీత రెడ్డి న్యాయపోరాటం చేస్తున్నారు. సుదీర్గ కాలం పెండింగ్ లో ఉన్న ఆ పిటిషన్ పై విచారణ ఇటీవల జరిగింది. గత విచారణలో.. అధికార దుర్వినియోగం జరిగిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించారు. తప్పుడు కేసులు పెట్టారని వివేకా కుమార్తె, అల్లుడితో పాటు సీబీఐ ఎస్పీ రాంసింగ్ పై పెట్టిన కేసులను క్వాష్ చేసింది. ఈ క్రమంలో నిందితులకు బెయిల్ రద్దు అవుతుందని అనుకున్నారు ఈ దశలో నిర్ణయం తీసుకోలేమని.. ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు చెప్పడంతో నిందితులకు ఊరట లభించినట్లయింది. 

Continues below advertisement

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు అయిన వివేకానందరెడ్డి 2019 ఎన్నికలకు ముందు పులివెందులలోని ఆయన నివాసంలో అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. ఆయన మొదట రక్తపు వాంతాలతో, గుండెపోటుతో చనిపోయారని బంధువులు ప్రచారం చేశారు. అయితే హైదరాబాద్ లోని ఆయన కుమార్తె..  పులివెందులకు వెళ్లి.. పోస్టుమార్టం చేయించే సరికి.. ఆయనను అత్యంత ఘోరంగా నరికి చంపారని వెల్లడి అయింది. ఇంట్లో సాక్ష్యాలను తుడిపించే ప్రయత్నం చేయడంతో పాటు.  పోస్టు మార్టం వద్దని చెప్పడం, పెద్ద పెద్ద గొడ్డలి పోట్లకు కట్లు కట్టేసి ఉండటం వంటివి చేయడంతో హంతకులే సాక్ష్యాలను మాయం చేసేందుకు ప్రయత్నించారన్న అనుమానాలు వ్యక్తం కావడంతో.. సీబీఐ విచారణకు వివేకా కుమార్తె డిమాండ్ చేసి కోర్టుకెళ్లారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఆమెతో పాటు ఆమె భర్తపై కేసులు నమోదు అయ్యాయి. దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఎస్పీపైనా కేసు పెట్టారు. సుప్రీంకోర్టు ఆ కేసుల్ని క్వాష్ చేసింది.