Supreme Court dismisses Pinnelli Brothers anticipatory bail plea: పోలీసుల వద్ద సీక్రెట్ గా ఉండాల్సిన కేసు డైరీ, సాక్షుల వాంగ్మూలాలను ఎవరైనా నిందితులు కోర్టులో తమ వాదనకు మద్దతుగా ప్రవేశ పెడతారా? అది కూడా సుప్రీంకోర్టులో. కానీ వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి , ఆయన సోదరుడు తరపు లాయర్లు అదే చేశారు. ఇద్దరు టీడీపీ కార్యకర్తలను హత్య చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు వెళ్లిన వారు.. తమ వాదనకు మద్దతుగా సాక్షులు ఇచ్చిన స్టేట్ మెంట్లను సుప్రీంకోర్టులో ప్రవేశపెట్టారు. వాటిని చూసి ధర్మాసనం ఆశ్చర్యపోయింది.
కేస్ డైరీ , సెక్షన్ 161 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) కింద రికార్డు చేసిన విట్నెస్ స్టేట్‌మెంట్‌లను ఈ సోదరులు ఎలా పొందారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. చార్జ్‌షీట్ దాఖలు కాకముందే ఈ డాక్యుమెంట్లు వారి చేతికి ఎలా చేరాయని... ఈ అంశాన్ని సహించలేమని స్పష్టం చేసింది. పిన్నెల్లి సోదరుల యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్‌లను సుప్రీం కోర్టు తిరస్కరించింది.
TDP కార్యకర్తలు వెంకటేశ్వర్లు , తని సోదరుడు కోటేశ్వరరావు బైక్ పై స్వగ్రామావెనికి వెళ్తున్నప్పుడు వెల్దుర్తి వద్ద కారుతో ఢీకొట్టి హతమార్చారు. పిన్నెల్లి సోదరులు ఈ హత్యలకు కారకులుగా మారారని పోలీసులు కేసు నమోదు చేశారు. మొదట హైకోర్టును సంప్రదించిన సోదరులు అక్కడ బెయిల్ రాకపోవడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ హత్యలు TDPలోని అంతర్గత పోరాటం వల్ల రీ వల్ల జరిగాయని తమపై TDP ప్రభుత్వం రాజకీయ ప్రతీకారంగా తప్పుడు కేసులు దాఖలు చేసిందని పిటిషనర్లు అయిన పిన్నెల్లి బ్రదర్స్ వాదించారు. TDP అధికారంలోకి వచ్చిన తర్వాత YSRCP నాయకులపై అనేక తప్పుడు కేసులు నమోదయ్యాయని వారు ఆరోపించారు. సెప్టెంబర్ 4న సుప్రీం కోర్టు వారి పిటిషన్‌లపై నోటీసు జారీ చేసి, అరెస్ట్ నుంచి తాత్కాలిక రక్షణ ఇచ్చింది.
విచారణలో కంప్లైనెంట్ కౌన్సెల్ మొదట ప్రాథమిక అభ్యంతరం లేవనెత్తారు. పిటిషనర్లు సెక్షన్ 161 CrPC కింద రికార్డు చేసిన విట్నెస్ స్టేట్‌మెంట్‌లను కోర్టులో ఫైల్ చేశారని, ఇవి ఎలా పొందారని ప్రశ్నించారు. జకేస్ డైరీలోని అంతర్గత వివరాలు ) వారికి తెలిసి ఉండటం కుట్రను సూచిస్తుందని, కస్టడీల్ ఇన్వెస్టిగేషన్ అవసరమని కోర్టు పేర్కొంది. మేము నిందితుల పలుకుబడిని చూసి ఆశ్చర్యపోతున్నామని ఈ స్థాయిలో కేస్ డైరీ ఎలా పొందారని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇది రాజకీయ కక్ష సాధింపు అని వాదించబోయిన వారికి జస్టిస్ విక్రమ్ నాథ్ "సరే, అయితే లోపలికి వెళ్లి బయటకు వచ్చేయి" అని స్పందించారు.
సుప్రీం కోర్టు యాంటిసిపేటరీ బెయిల్‌ను తిరస్కరించి, పిన్నెల్లి సోదరులు రెండు వారాల్లో సరెండర్ అవ్వాలని ఆదేశించింది. డబుల్ మర్డర్ ఆరోపణలు, కేస్ డైరీ మరియు సెక్షన్ 161 స్టేట్‌మెంట్‌లపై అనుమానాస్పద యాక్సెస్ వల్ల ఇన్వెస్టిగేషన్‌లో జోక్యం, ప్రభావితంచేసే అవకాశాలు ఉన్నాయని కోర్టు హెచ్చరించింది.