Delhi traders try to cremate mannequin to claim insurance: ఢిల్లీలో ఇద్దరు జాతిరత్నాలు పోలీసులకు పట్టుబడ్డారు. వ్యాపారంలో నష్టాలు వచ్చాయని ఓ వ్యక్తికి ఇన్సూరెన్స్ చేయించి.. అతనికి డమ్మీ తయారు చేయించి అంత్యక్రియలు నిర్వహించారు. తర్వాత డెత్ సర్టిఫికెట్ తీసుకెళ్లి ఇన్సూరెన్స్ కొట్టేద్దామనుకున్నారు. కానీ వీరి తెలివి తేటలు పారలేదు. చివరికి పోలీసులకు చిక్కారు.
ఢిల్లీలో గార్మెంట్ దుస్తుల వ్యాపారం చేసే ఇద్దరు వ్యక్తులు చాలా అప్పుల్లో కూరుకుపోయారు. అప్పులు తీర్చుకోవడానికి ఒక దారి వెతికారు. వాళ్లు తమ దగ్గర పనిచేసే ఉద్యోగి నీరజ్ సోదరుడు అంశుల్ పేరిట రూ.50 లక్షల బీమా పాలసీ తీసుకున్నారు. ఆ తర్వాత ఒక మనిషి డమ్మీ తీసుకు వచ్చారు. బట్టల దుకాణాల్లో షోకు పెట్టే డమ్మీని తీసుకు వచ్చి దానికి దాన్ని బట్టలు కప్పి శ్మశానవాటికకు తీసుకెళ్లారు. అసలు అంశుల్‌ను ప్రయాగ్రాజ్‌కు పంపేశారు.
తర్వతా డమ్మీని కారులో పెట్టి, ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లా బ్రిజ్‌ఘాట్ శ్మశానవాటికకు తీసుకెళ్లారు. అక్కడ అక్కడ చెక్కలు, నెయ్యి కొని, డమ్మీని పైర్ మీద పెట్టి దహనం చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. దహనం పూర్తి అయితే రసీదు తీసుకుని, మరణ ధ్రువీకరణ పత్రం తెచ్చి, బీమా కంపెనీ నుంచి 50 లక్షలు తీసుకోవాలని అనుకున్నారు.
కానీ.. శ్మశానవాటికలో పనిచేసే నితిన్ కి డౌట్ వచ్చింది. వీళ్లు అసలు శవాన్నితీసుకొచ్చారా ఇంకేమైనా చేస్తున్నారని డౌట్ పడ్డాడు ఎందుకంటే వారు తేడాగా వ్యవహరిస్తున్నారు. దీంతో గుడ్డ తీసి చూసేసరికి.. అది మనిషి శవం కాదు ప్లాస్టిక్ డమ్మీ అని తేలింది. నితిన్ వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీసులు వచ్చేటప్పటికే ఇద్దరూ పారిపోవాలనుకున్నారు. కానీ పోలీసులు వచ్చి కారు ఆపి, ఇద్దరిని పట్టుకున్నారు. ఆ ఇద్దరు జాతిరత్నాలను కమల్ సోమాని, అశిష్ ఖురానాగా గుర్తించారు. వారితోపాటు వచ్చిన మరో ఇద్దరు పారిపోయారు. కారులో మరో రెండు డమ్మీలు కూడా దొరికాయి.
ఈ ఇద్దరు జాతి రత్నాలు తాము చేయాలనుకున్న మోసాన్ని ఒప్పుకున్నారు. అప్పులయ్యాయని మరో దారి లేకుండా పోయిందని అనుకున్నారు. అయితే తనను నిజంగా చంపకుండా.. కేవలం చంపినట్లు సృష్టిద్దామనుకున్న అంశుల్ కు ఈ విషయాలు ఏమీై తెలియదు. ఎందుకో ప్రయాగరాజ్ పంపిస్తే వెళ్లాడు. బతికిపోయాడు.