Attack On  Chandrababu  :  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నందిగామ పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నందిగామలో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్‌షోలో రాళ్ల దాడి చేశారు.  ఈ దాడిలో చంద్రబాబు, చీఫ్ సెక్యూరిటీ అధికారి   మధు గాయపడ్డారు. రాయి విసిరిన సమయంలో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది.  పోలీసుల భద్రతా వైఫల్యంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ రౌడీలకు భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. రాళ్ల దాడి జరిగిన తర్వాత ఆయన చుట్టూ.. సెక్యూరిటీ సిబ్బంది మోహించారు. అంతకుముందు చంద్రబాబు రోడ్‌షోలో పోలీసులు, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రోడ్‌షో తొందరగా ముగించాలంటూ టీడీపీ నేతలపై పోలీసుల ఒత్తిడి తెచ్చారు.  రోడ్‌షోకు భారీగా జనం తరలిరావడంతో అదనపు పోలీస్‌ బలగాలు రంగంలోకి దిగాయి. చంద్రబాబు వాహనానికి ముందు, వెనుకా పెద్దఎత్తున రోప్ పార్టీలు ఏర్పాటు చేశారు. చంద్రబాబు వాహనం చుట్టూ అదనపు భద్రతా బలగాలు ఏర్పాటు చేశారు.  


చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా రాళ్లతో దాడి చేస్తున్న దుండగులు


ఇటీవలి కాలంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎక్కడికి వెళ్లినా ఉద్రిక్తతలు చోటుచేసుకుటున్నాయి. కొద్ది రోజుల కిందట సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనకు వెళ్లినప్పుడు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. చంద్రబాబు నాయుడు  రామకుప్పం మండలం కొల్లుపల్లిలో పర్యటిస్తున్న సమయంలో  తెలుగుదేశం పార్టీ శ్రేణులు జెండాలు, పార్టీ గుర్తుకు సంబంధించిన తోరణాలు ఏర్పాటు చేశాయి. వైసీపీ నాయకులు ఈ తోరణాలకు ఆనుకొని వారి పార్టీవి కూడా ఏర్పాటు చేశారు. వీటిని తొలగించడానికి టీడీపీ నాయకులు ప్రయత్నించగా వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఇరువర్గాల మధ్య తోపులాట, ఘర్షణ జరిగింది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. కర్రలతో దాడి చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. ఆ ఘటన తర్వాత చంద్రబాబుకు కేంద్ర ప్రభుత్వం భద్రత పెంచింది. 


చంద్రబాబుకు భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం 


గతంలో 8 మంది నేషనల్ సెక్యూరిటీ గార్డులు ఉండగా..  అదనంగా మరో 20 మందిని నియమించారు. గతంలో డీఎస్పీ ర్యాంకు అధికారి పర్యవేక్షణలో భద్రత సిబ్బంది విధులు నిర్వహించేవారు. కానీ ఇకపై డీఐజీ ర్యాంకు అధికారి పర్యవేక్షణలో పనిచేస్తున్నారు.  జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న చంద్రబాబుకు 12+12 కమాండోలతో భధ్రత పెంచింది కేంద్రం ప్రభుత్వం..  కుప్పం పర్యటనలో ఉద్రిక్తతలు ఏర్పడుతున్న సమయంలోనే   చంద్రబాబుకు తక్షణం భధ్రత పెంచుతూ NSG DG ఉత్తర్వులు జారీ చేసింది.  అమరావతిలోని చంద్రబాబు ఇంటిని, టిడిపి కేంద్ర కార్యాలయాన్ని ఎన్.ఎస్.జీ డిజీ స్వయంగా పరిశీలించారు.. అంతే కాకుండా టీడీపీ కార్యాలయంలోని నాయకులతో మాట్లాడి స్ధానిక పోలీసు అధికారుల భద్రత ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు. అయితే కేంద్రం భద్రత పెంచినా... ఆయన పర్యటనలో తరచూ వివాదాలు ఏర్పడుతూనే ఉన్నాయి. వైఎస్ఆర్‌సీపీ నేతలు ఘర్షణకు దిగుతూనే ఉన్నారు. 


తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం, ఆ నలుగురు ఎమ్మెల్యేలకు మంత్రిస్థాయి భద్రత!