సామాన్య భక్తుల కోరిక మేరకు నేటి నుండి తిరుపతిలోని శ్రీనివాసం కాంప్లెక్స్ లో ఉదయం ఆరు గంటల నుంచి సర్వదర్శనం టోకెన్లను జారీని టీటీడీ ప్రారంభించింది.. అయితే కోవిడ్ ఆకాంక్షల నేపథ్యంలో మొదటి దశలో చిత్తూరు జిల్లాకు చెందిన వారికి మాత్రమే 2000 దర్శన టోకెన్లు జారీ చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. దీంతో సర్వదర్శనం టికెట్లు పొందేందుకు జిల్లా నలుమూల నుంచి భారీగా భక్తులు శ్రీనివాసం కాంప్లెక్స్ వద్దకు చేరుకుని బారులు తీరారు. ఆరు గంటలకు టోకెన్లు జారీ కావాల్సి ఉండగా టెక్నికల్ ఇష్యూ కారణంగా కొంత ఆలస్యం కావడంతో గంట పాటు భక్తులు క్యూలైన్ లో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివిధ రాష్ట్రాల ‌నుంచి వచ్చి భక్తులు క్యూలైన్స్ లోకి ప్రవేశించడంతో వారికి దర్శన టోకెన్లు జారీ చేసింది టీటీడీ సిబ్బంది.


తిరుమల తిరుపతి దేవస్థానం ప్రారంభించిన నవనీత సేవలో భ‌క్తుల‌కు అవ‌కాశం కల్పిస్తున్నట్లు ఇటీవలే తితిదే ఈవో  జ‌వ‌హ‌ర్‌రెడ్డి తెలిపారు.  ఈ నెల 13 నుంచి ఏడు బ్రాండ్లతో ప‌రిమ‌ళ‌భ‌రిత అగ‌ర‌బ‌త్తులు భ‌క్తుల‌కు విక్రయించనున్నట్లు వెల్లడించారు. తిరుమలలో వాహనాల కాలుష్యాన్ని తగ్గించడం ద్వారా పవిత్రతను, పర్యావరణాన్ని కాపాడి హోలీ గ్రీన్‌ హిల్స్‌గా మార్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించామన్నారు.


Also Read: Ganesh Chaturthi 2021:- చిత్తూరు పోలీసు వర్గాల్లో చవితి పంచాయితీ... ఓ ట్రైనీ ఎస్సైపై వేటు.. బీజేపీ చీఫ్‌కు ట్యాగ్‌ చేస్తూ ట్వీట్‌


Also Read: Pawan Kalyan: వినాయక చవితికి మాత్రమే కోవిడ్ నిబంధనలు వర్తిస్తాయా? వైసీపీ లీడర్ల సభలకు వర్తించవా? ప్రభుత్వంపై పవన్‌ విమర్శలు


డీజిల్‌, పెట్రోల్‌ వాహనాల స్థానంలో విద్యుత్‌ వాహనాలను వినియోగిస్తామని జ‌వ‌హ‌ర్‌రెడ్డి అన్నారు. మొదటి దశలో 35 విద్యుత్‌ కార్లను తిరుమ‌లలోని సీనియ‌ర్ అధికారుల‌కు అందించినట్లు తెలిపారు. రెండో ద‌శ‌లో యాత్రికులకు ఉచిత బ‌స్సులు ప్రారంభిస్తామన్నారు. తిరుమల-తిరుపతి మధ్య ఆర్‌టీసీ విద్యుత్ బస్సులను న‌డిపే ప్రక్రియ తుది ద‌శ‌లో ఉందన్నారు.మూడో ద‌శ‌లో ట్యాక్సీలను విద్యుత్‌ వాహనాలుగా మార్పించే ప్రయత్నం చేస్తామన్నారు.



 లడ్డూ ప్రసాదాల పంపిణీ కోసం బట్ట, జ్యూట్‌ సంచులు, గ్రీన్‌ మంత్ర సంస్థ పర్యావరణహిత కవర్లు విక్రయిస్తున్నామని తెలిపారు.ఇటీవల డీఆర్‌డీఓ సంస్థ సాంకేతిక ప‌రిజ్ఞానంతో, మొక్కజొన్న వ్యర్థాలతో తయారు చేసిన పర్యావరణ హిత సంచుల విక్రయాలు ప్రారంభించినట్లు టీటీడీ ఇటీవల తెలిపారు. ఎస్వీబీసీ హిందీ, కన్నడ భాషలలో తితిదే ఛానళ్ళు అక్టోబరు నెలలో ప్రారంభించేందుకు సన్నాహలు చేస్తున్నట్లు ఈవో వెల్లడించారు.


Also Read: Gold-Silver Price Today: మగువలకు గుడ్ న్యూస్…స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇలా...


Also Read: Weather Alert: ఏపీలో మూడు రోజులు.. తెలంగాణలో ఇంకో రెండు రోజులు వానలే వానలు..