పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే.. 8 ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. జనవరి 14న నర్సాపూర్-విజయవాడ డెమూ, 13న విజయవాడ- నర్సాపూర్ డెమూ, మచిలీపట్నం- గుడివాడ మెమూ, గుడివాడ- మచిలీపట్నం మెమూ, 14న మచిలీపట్నం- గుడివాడ మెమూ, గుడివాడ- మచిలీపట్నం మెమూ, 13న విజయవాడ- మచిలీపట్నం మెమూ, 14న మచిలీపట్నం-విజయవాడ మెమూ ప్రత్యేక రైళ్లను నడపనుంది.
- 14న నర్సాపూర్-విజయవాడ డెమూ
- 13న విజయవాడ నర్సాపూర్ డెమూ
- 13న మచిలీపట్నం-గుడివాడ మెమూ రైలు
- 13న గుడివాడ మచిలీపట్నం మెమూ
- 14న మచిలీపట్నం-గుడివాడ మెమూ రైలు
- 14న గుడివాడ-మచిలీపట్నం మెమూ రైలు
- 13న విజయవాడ-మచిలీపట్నం మెమూ రైలు
- 14న మచిలీపట్నం-విజయవాడ మెమూ రైలు
ప్రత్యేక బస్సులు
జనవరి 7వ తేదీ నుంచి 14 వరకు ప్రత్యేక సర్వీసులు నడవనున్నాయి. ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ ఏంటంటే.. ఈ ప్రత్యేక బస్సులు ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని తెలిపింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు 4,318 ప్రత్యేక బస్సులను నడపనున్నారు. పండగ సందర్భంగా నడిపే ప్రత్యేక బస్సులకు ఎలాంటి అదనపు ఛార్జీలు.. వసూలు చేయడంలేదని ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ చెప్పారు.
హైదరాబాద్ ఎంజీబీస్, జేబీఎస్, సీబీఎస్, ఉప్పల్ క్రాస్‌రోడ్, ఎల్బీనగర్, ఆరాంఘర్, లింగంపల్లి, చందానగర్, ఈసీఐఎల్, కేపీహెచ్‌బీ, ఎస్ఆర్నగర్, అమీర్‌పేట, టెలిఫోన్‌భవన్, దిల్సుఖ్నగర్ నుంచి బస్సులు నడపనున్నారు. అంతేగాకుండా.. జంట నగరాల్లోని వివిధ శివారు కాలనీల్లో ముఖ్యమైన స్టాపుల నుంచి బస్సులు ఉండనున్నాయి. ముందస్తు రిజర్వేషన్ కోసం.. www.tsrtconline.in వెబ్సైట్లోకి వెళ్లాలి. ప్రత్యేక బస్సులను సమన్వయం చేసేందుకు సిబ్బందిని కూడా నియమించినట్టు ఆర్టీసీ తెలిపింది. నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, సిద్దిపేటతోపాటు ముఖ్యమైన పట్టణాలకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనున్నారు.
సొంతూళ్లకు వెళ్లే ప్రజల కోసం 4,360 బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు టీఎస్ఆర్టీసీ చెప్పింది. అయితే ప్రత్యేక బస్సుల్లో 590 బస్సులకు రిజర్వేషన్ చేసుకునే సౌకర్యం ఉంటుంది. ఆదిలాబాద్, ఖమ్మం, భద్రాచలం, విజయవాడ, నెల్లూరు, గంటూరు, ఒంగోలు పట్టణాలతో పాటు.. కర్ణాటక, మహారాష్ట్రలకు బస్సులకు రిజర్వేషన్ సౌకర్యం ఉంటుంది. ఏ విధమైన అదనపు అదనపు ఛార్జీలను వసూలు చేయడం లేదని టీఎస్ఆర్టీసీ పేర్కొంది.
Also Read: Tollywood Jagan : " టాలీవుడ్ రియాక్షన్ " ఆపడమే అసలు వ్యూహం ! జగన్ ప్లాన్ వర్కవుట్ అయినట్లేనా ?