SCR Trains Cancelled in September:
హైదరాబాద్: సౌత్ సెంట్రల్ రైల్వే (South central Railway) పరిధిలోని పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు కొన్ని సర్వీసులను పాక్షికంగా నిలిపివేశారు. అనకాపల్లి- తాడి స్టేషన్ల మధ్య డీప్ స్క్రీనింగ్ ప్రక్రియ వల్ల సెప్టెంబర్ 3 నుంచి 10 తేదీల మధ్య పలు రైళ్లను రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది.
విశాఖ- లింగంపల్లి మధ్య నడిచే జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు నెంబర్ (12805) ఈ నెల 3 నుంచి 9 వరకు రద్దు చేశారు. లింగంపల్లి - విశాఖ మధ్య నడిచే జన్మభూమి ఎక్స్‌ప్రెస్ (12806) ఈ 4 నుంచి ఈనెల 10 వరకు రద్దు అయింది. విజయవాడ- విశాఖల మధ్య వెళ్లే రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైలు నెంబర్ (12718) ఈ 3 నుంచి 10 తేదీ వరకు పాక్షికంగా రద్దు (అనకాపల్లి నుంచి విశాఖ) చేశారు. విశాఖపట్నం - విజయవాడ మద్య నడిచే ఎక్స్ ప్రైస్ రైలు నెంబర్ (12717) ఈ 3 నుంచి 10 తేదీ వరకు పాక్షికంగా రద్దు (అనకాపల్లి నుంచి విశాఖ) చేశారు.
గుంటూరు- రాయగడ మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైలు (17243) ఈ 3 నుంచి 9 వరకు, రాయగడ- గుంటూరు మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైలు (17244) 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. మచిలీపట్నం- విశాఖపట్నం మధ్య నడిచే రైలు ( 17219) ఈ 4 నుంచి 9 వరకు రద్దు కాగా, విశాఖపట్నం- మచిలీపట్నం మధ్య నడిచే రైలు ( 17220) ఈ 5 నుంచి 10 వరకు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది.
విశాఖ- లింగంపల్లి మధ్య నడిచే జన్మభూమి ఎక్స్‌ప్రెస్ (12805)
లింగంపల్లి - విశాఖ మధ్య నడిచే జన్మభూమి ఎక్స్‌ప్రెస్ (12806)
విజయవాడ- విశాఖ మధ్య నడిచే రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ (12718)
విశాఖ - విజయవాడ మధ్య నడిచే ఎక్స్ ప్రైస్ రైలు నెంబర్ (12717)
గుంటూరు- రాయగడ మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైలు (17243)
రాయగడ- గుంటూరు మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైలు (17244)
పాక్షికంగా రద్దయిన సర్వీసులు..
తిరుపతి- విశాఖపట్నం మధ్య నడిచే డబుల్ డెక్కర్ రైలు (22708)ను సైతం ఈ నెల 6 నుంచి 8 తేదీ వరకు విశాఖ- సామర్లకోట మధ్య పాక్షికంగా రద్దు చేశారు. విశాఖపట్నం- తిరుపతి మధ్య నడిచే రైలు (22707)ను విశాఖ - సామర్ల కోట మధ్య ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే శనివారం తెలిపింది. రైళ్లు రద్దయ్యే తేదీలలో జర్నీ కోసం టికెట్ బుక్ చేసుకున్న వారి టికెట్లు రద్దవుతాయని అధికారులు తెలిపారు. ఎస్.సి.ఆర్ నిబంధనల మేరకు నగదు రిఫండ్ అవుతుందని ప్రయాణికులకు సూచించారు.
8 రైళ్లకు అదనపు స్టాపులు
ప్రయాణికుల సౌకర్యార్థం ఎనిమిది ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనపు స్టాప్ లను ఏర్పాటు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ప్రయోగాత్మకంగా ఆరు నెలల పాటు 8 ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇకపై అదనంగా కేటాయించిన స్టేషన్లలోనూ ఆగుతాయని ఇటీవల పేర్కొంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కొన్ని ప్రత్యేక రైళ్ల సర్వీసులను ఏర్పాటు చేసింది.