Somu On Jagan :  ఏపీ సర్కార్ పై బీజేపి రాష్ట్ర అద్యక్షుడు సోము వీర్రాజు మరోసారి ఫైర్ అయ్యారు. నిధులు కేంద్రానివి.. స్టిక్కర్లు రాష్ట్ర ప్రభుత్వానివని ఆయన ఎద్దేవా చేశారు.  ఎన్ఎస్ఎఫ్డిసీ ద్వారా ఏపీకి కేంద్రం వేల‌ కోట్లు నిధులు మంజూరు చేస్తోందని  అందులో దళిత లబ్దిదారులకు లక్ష రూపాయలు ఇచ్చేలా కేంద్రం నిర్ణయించిందన్నారు.  సబ్సిడి గా 50% అందిస్తుందన్నారు.ఇదే పథకం ద్వారా గత టిడిపి సమయంలో థ్యాంక్యూ సీఎం అని ప్రచారం చేసుకున్నారన్నారు. గుంటూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట బిజెపి యస్.సి. మోర్చా ఆంద్రప్రదేశ్ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన దీక్షకు ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీరాజు, ప్రధాన కార్యదర్శి శివనారాయణ పాల్గోన్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి పథకాలు, రుణాలు ప్రజలకు అందటం లేనందువలనే  48 గంటల నిరసన దీక్షను చేపట్టాల్సి వచ్చిందని చెప్పారు.


స్వయం ఉపాధికి కేంద్రం ఇస్తున్న నిధులూ దారి మళ్లింపు


రూ.12 లక్షల విలువైన ఇన్నోవా కార్స్ కూడా పేద ప్రజలకు సబ్సిడీ ద్వారా అందించామని, టిడిపి సమయంలో ఇచ్చాం, ఈ ప్రభుత్వాకి ఇస్తున్నామని అయితే నిధులను వైసీపీ ప్రభుత్వం డైవర్ట్ చేస్తోందని మండిపడ్డారు. ఎస్సీ కార్పొరేషన్లో 26 పధకాలను అమలు చేయాల్సినవి నిలిపివేశారని వాటిని  తిరిగి అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమ ప్రాంతంలో వెనకబడిన వారికి స్థలం కేటాయించి వారికి జీవనోపాధి కల్పించాల్సి ఉందని అయితే ప్రభుత్వం, అది ‌కూడా చేయడం లేదన్నారు.పాస్టర్లకు జీతాలు ఇస్తున్నారని, క్రిస్టియనిటీని ఓటు బ్యాంక్ గా మార్చుకున్నారని ఫైర్ అయ్యారు.  వేల గ్రామ సభల ద్వారా ఈ రౌడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లోకి వెళ్లామన్నారు.  


అవినీతి మాత్రమే జగన్ కోరుకుంటారన్న వీర్రాజు 


అవినీతిని మాత్రమే జగన్ కోరుకుంటారని, అభివృద్ధి అనేది అవసరం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో విశాఖ, రాయలసీమ ప్రాంతాల్లో‌ బిసి సభలు పెడతామని వెల్లడించారు. రాబోయే రోజుల్లో మహిళల‌ సమస్యలపై పోరాడతామని ప్రకటించరు. ప్రతి నగరాన్ని కలుపుతూ నిర్మించే రోడ్ల కోసం రూ. 900 కోట్లు కేంద్రం ప్రకటించిందని ఏపీలో ముఖ్యమంత్రి రూ. 100 కోట్లతో కనీసం రోడ్లు అభివృద్ధి చేయరేమని ప్రశ్నించారు. సీఎం జగన్ కడపలో ఈ కార్యక్రమం నిర్వహించినప్పుడు ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని ఎస్సీ ప్రజలే తరలి వచ్చారని, అంత మంది వచ్చారు అంటే జగన్ దళితులకు ఎంత అన్యాయం చేస్తున్నారో స్పష్టం అవుతుందని చెప్పారు. 


దళితుల డబ్బులు లాక్కుంటూ బీజేపీ చూస్తూ ఊరుకోదు : వీర్రాజు 


12 మంది ఎస్సీ మంత్రలను నియమించిన పార్టీ బీజేపీ అన్నారు. ఎన్ ఎఫ్ టీసీ అనే పథకం ద్వారా ఎటువంటి బ్యాంక్ ప్రమేయం లేకుండా కేవలం ష్యూరిటీ సంతకంతో లోన్లు ఇచ్చే అవకాశం బీజేపీ ద్వారానే సాధ్యం అయిందన్నారు.  తెలుగు రాష్ట్రాల ప్రజలను  జగన్ మోసగిస్తున్నారని, అరాచక ప్రభుత్వంతో ప్రజల డబ్బును, స్థలాలను లాక్కుంటున్నారి విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం చూస్తూ ఊరుకోడు అని తెలిపారు. దళితులకు మేలు చెసేందుకే నిరసన దీక్ష చేస్తున్నామన్నారు.