SIT issues notice to Vijayasai Reddy again in AP liquor Scam:ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్‌లో సీఐడీ సిట్ దూకుడు చూపిస్తోంది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి మరోసారి నోటీసులు జారీ చేసింది. 12వ తేదీ ఉదయం  విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసుల్లో ఆదేశించింది. విజయసాయిరెడ్డిని లిక్కర్ కేసులో గతంలోనూ ఓ సారి సిట్ ప్రశ్నించింది. అప్పట్లో అన్నీ రాజ్ కెసిరెడ్డి చేశారని ఆయన చెప్పారు. ఆ తర్వాత సీఐడీ అనేక మందిని అరెస్టు చేసింది. ప్రశ్నించింది. ఈ క్రమంలో విజయసాయిరెడ్డి పాత్ర చాలా కీలంగా ఉన్నట్లుగా గుర్తించారు.  అందుకే మరోసారి విచారణకు రావాలని పిలిచినట్లుగా తెలుస్తోంది. 

విజయసాయి రెడ్డి ఈ కేసులో ఏ  5గా ఉన్నారు. అయితే తాను కేవలం సాక్షిగానే ఉన్నానని తనను తాను "విజిల్‌బ్లోయర్" గా చెప్పుకుంటున్నాడు. ఇప్పటికే ఏప్రిల్ 18, విజయసాయి రెడ్డి SIT ముందు హాజరయ్యారు.  సుమారు మూడు గంటల పాటు  ప్రశ్నించారు.   ఈ విచారణలో ఆయనకు మద్యం విధానం, కిక్‌బ్యాక్‌లు, నాన్-డ్యూటీ పెయిడ్ లిక్కర్ (NDPL) అమ్మకాలు, కొత్త డిస్టిలరీ కంపెనీలు.. లిక్కర్ పాలసీ  సమావేశాల గురించి 25 ప్రశ్నలకు సమాధానాలు తీసుకున్నారు.  విజయసాయి రెడ్డి హైదరాబాద్ , జయవాడలో జరిగిన రెండు సమావేశాలలో పాల్గొన్నట్లు చెప్పారు. ఈ సమావేశాల్లో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి,   ఇతరులు ఉన్నారని తెలిపాడు. ఆర్థిక లావాదేవీల గురించి తనకు సమాచారం లేదని విజయసాయిరెడ్డి చెబుతున్నారు.  కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి (A-1) 2019-2024 మధ్య మద్యం తయారీ కంపెనీల నుండి 50-60 కోట్ల లంచం సేకరించినట్లు అంగీకరించినట్లుగా సిట్ రిమాండ్ రిపోర్టులో తెలిపింది.   ఈ నిధులను విజయసాయి రెడ్డి (A-5), రాజంపేట ఎంపీ పి.వి. మిథున్ రెడ్డి, జగన్ యొక్క OSD కృష్ణ మోహన్ రెడ్డి,  భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ వంటి వ్యక్తులకు బదిలీ చేసినట్లు చెప్పాడు.   విజయసాయి రెడ్డి SITకి తెలిపిన ప్రకారం  కసిరెడ్డి ,  అతని సోదరుడు అవినాష్ రెడ్డి, చానిక్య రాజ్, కిరణ్, సుమిత్,  సైఫ్ వంటి వ్యక్తులు హవాలా నెట్‌వర్క్ ద్వారా ఆర్థిక లావాదేవీలను నిర్వహించారు. 

డికార్ట్ ,  ఆదాన్ అనే రెండు కంపెనీలకు మద్యం సరఫరా కోసం సిఫారసు చేసినట్లు,  వాటికి ఔరోబిందో నుండి  100 కోట్ల రుణం  సమకూర్చడంలో సహాయం చేసినట్లు ఒప్పుకున్నారు.   విజయసాయి రెడ్డి తాను ఈ కుంభకోణంలో ఎలాంటి పాత్ర పోషించలేదని, ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని తాను కేవలం విజిల్‌బ్లోయర్‌గా ఉన్నానని చెబుతున్నారు.   జనవరిలో, విజయసాయి రెడ్డి YSRCP నుండి మరియు రాజ్యసభ సభ్యత్వం నుండి రాజీనామా చేశాడు.

ED కూడా కుంభకోణంలో మనీ లాండరింగ్ దర్యాప్తును ప్రారంభించింది.  ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కింద కేసు నమోదు చేసింది.  2019-2024 మధ్య  99,413 కోట్ల రూపాయల  మద్యం అమ్మకాలలో కేవలం 0.62 శాతం అంటే  615 కోట్లు  మాత్రమే డిజిటల్‌గా జరిగాయి, ఇది మనీ లాండరింగ్ కు ప్రదాన అవకాశంగా మారిందని  ఈడీ  అనుమానిస్తోంది.