Siraj planned to carry out the first blasts in Vizianagaram :  ఉగ్రవాదుల్లా మారి సొంత గడ్డపైనే మారణహోమం చేద్దామనుకున్నాడు..విజయనగరానికి చెందిన సిరాజ్. మరో ఉగ్రవాద సమీర్ తో కలిసి పోలీసులకు పట్టుబడటంతో విజయనగరం ఊపిరి పీల్చుకుంది. తను పేలుళ్ల కోసం సౌదీలో శిక్షణ పొందానని..సమీర్ పాకిస్తాన్ లో శిక్షణ పొందినట్లుగా దర్యాప్తులో తేలింది. విజయనగరం ప్రశాంతమైన ప్రదేశం. అక్కడ పుట్టినందున సొంత గడ్డని ప్రేమగా చూసుకోవాల్సిన సిరాజ్..తన ఉగ్ర ఆలోచనల్లో భాగంగా శవాల దిబ్బగా మార్చాలనుకున్నాడు. 

సమీర్ సిరాజ్ ల ను ఎన్ఐఏ అధికారులు ప్రశ్నిస్తున్నారు. బాంబు పేలుళ్ల కోసం  హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, ముంబై నగరాలలో బాంబు పేలుళ్ల కోసం రెక్కి నిర్వహించారు.   హైదరాబాదులో పేలుళ్ల కోసం విజయనగరంలో ప్లాన్ చేసినట్టుగా  అధికారులు అనుమానిస్తూ వచ్చారు.   కానీ NIA  అధికారుల విచారణలో నాలుగైదు రాష్ట్రాల్లో బాంబు దాడులకు నిందితులు ప్లాన్ చేసినట్టు  గుర్తించారు. దిల్‌సుఖ్‌నగర్‌లో దశాబ్దం కిందట జరిగిన టిఫిన్ బాక్స్ బాంబు దాడి లాంటి వాటికి నిందితులు  రెక్కీ చేసినట్లుగా గుర్తించారు.  సోషల్ మీడియా లో గ్రూపు ఏర్పాటు చేసుకుని 12 మంది కలిసి పేలుళ్లను ప్లాన్ చేశారు.  ఈ పన్నెండు మంది ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రకు చెందినవారు. నిందితుల సోషల్‌ మీడియా అకౌంట్లు, అహీమ్‌ సంస్థ మూలాలతో పాటు వారికి ఇటీవల వచ్చిన విదేశీ కాల్స్‌పై ఎన్ఐఏ అధికారులు ఆరా తీశారు. 

వీరికి సౌదీ అరేబియా నుంచి ఆదేశాలు రావడంతో బాంబుదాడులకు టిఫిన్ బాక్స్, పేలుడు పదార్థాలు సైతం కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్లడయింది. సౌదీ నుంచి వచ్చిన నిధులు ఏ ఖాతాలో జాయిన్ అయ్యాయి, వాటిని ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు అనే దానిపై ఎన్ఐఏ అధికారులు ఊపి లాగుతున్నారు.హైదరాబాదులోని బోయ గూడలో ఉండే సయ్యద్ సమీర్, విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్ అనే యువకులు 2018లో హైదరాబాద్ సిటీలో కలిసి చదివారు. ఈ క్రమంలో వారు  తీవ్రవాద భావజాలం పట్ల ఆకర్షితులయ్యారు. వీరు "ఆల్ హింద్ ఇత్తయ్ హాదుల్ ముస్లిమీన్" అనే సంస్థను నడుపుతున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. సౌదీ అరేబియా కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థలతో లింకులు ఉన్నాయని సమాచారం రావడంతో అరెస్టు చేశారు.                                  

 ఈ ఇద్దరికీ  భయంకర ఉగ్రవాద సంస్థ ఐసిస్   తో లింకులు ఉన్నాయా అని కోణం లో ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. వీరికి సౌదీ అరేబియా నుంచి ఆదేశాలు ఇచ్చిన  హ్యాండ్లర్ ను గుర్తించే పనిలో ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. హైదరాబాదులో పేలుడు పదార్థాలు కొంటే  దొరికిపోతామని భావించి  విజయనగరం నుండి ఆపరేషన్ ను సిరాజ్,సమీర్ ప్లాన్ చేసినట్టు ప్రాథమికంగా తేలింది. వీరిద్దరి అరెస్టుతో  ఒక భారీ కుట్రకు తెరపడినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి.ఈ పేలుళ్ల నుంచి విజయనగరం బయటపడింది.