Shinganamala YCP leader Phanindra posted his private video:  సెల్ ఫోన్ సీరియస్ గానే డీల్ చేయాలి. కామెడీగా చేస్తే.. బతుకు బస్టాండ్ అయిపోతుంది. కావాలంటే అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గానికి చెందిన ఫణీంద్ర అనే వైసీపీ లీడర్ ను చూసి తెలుసుకోవచ్చు. వైసీపీలో శింగనమల బీసీసెల్ అధ్యక్షుడిగా ఉన్నారు ఫణీంద్ర

Continues below advertisement

ఫణీంద్ర ఓ మహిళతో వివాహేతర బంధం పెట్టుకున్నారు. ప్రైవేటుగానే అన్ని పనులు చేసుకునేవారు.కానీ ఓ సారి ఆయనకు ఎందుకో వీడియో తీసుకోవాలని అనిపించింది. తీసుకున్నారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకుంటున్నారేమో కానీ..  తాజాగా ఆయన తమ పార్టీకి చెందిన గ్రూపులో ఏదో వీడియో షేర్ చేయాలనుకున్నారు. కానీ ఆయన షేర్ చేసిన వీడియో మాత్రం తన ప్రైవేటు రాసలీలల వీడియో.  వెంటనే చూసుకుని నాలిక్కరుచుకుని డిలీట్ చేసుకున్నారు. కానీ అప్పటికే అది ఫార్వార్డ్ అయిపోయింది.    ఈ వివాదానికి స్పందించిన ఫనీంద్ర, తన మొబైల్ ఫోన్‌ను ఎవరో హ్యాక్ చేసి ఈ వీడియోను షేర్ చేశారని ఆరోపించాడు.  నేను ఎప్పుడూ అలాంటి వీడియోను షేర్ చేయలేదుని రాజకీయ ప్రత్యర్థులు ఇలా చేశారన్నారు. అయితే ఆ వీడియో ఏఐ అనికానీ.. ఫేక్ అని కానీ చెప్పలేదు. తన ఫోన్ ను హ్యాక్ చేసి వేరేవాళ్లు పోస్టు చేశారని అఅంటున్నారు.  అయితే, ఈ వాదనకు ఎటువంటి ఆధారాలు అందించలేదు. హ్యాకింగ్ జరిగినా, మహిళతో సన్నిహిత సమయంలో వీడియో తీసుకోవడం ఎందుకు అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో  వస్తున్నాయి. "  వైసీపీ పార్టీలో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బీసీ సెల్ అధ్యక్షుడిగా ఫణీంద్ర ఉన్నారు.  స్థానిక నాయకులు , కార్యకర్తలు ఫణీంద్రపై  అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధిష్టానం నుంచి తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై వైసీపీ హైకమాండ్ ఇంకా ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. అది పూర్తిగా అతని ప్రైవేటు వ్యవహారమని భావిస్తున్నారు.  

Continues below advertisement