Andhra YSRCP Politics : వివేకా హత్య కేసు విషయంలో  వైఎస్ షర్మిల, సునీత  తమ  విమర్శలు కొనసాగిస్తున్నారు.  జమ్మలమడుగు నియోజక వర్గంలో APCC చీఫ్& కడప పార్లమెంటు అభ్యర్థి వైఎస్ షర్మిలా రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తాను కడపలో ప్రచారం మొదలు పెట్టి కేవలం 5 రోజులే  అయిందన్నారు.  తన  ప్రచారంతో వైసీపీలో వణుకు పుడుతుందని..  
అభ్యర్థి అవినాష్ రెడ్డిని మార్చాలని చూస్తున్నారన్నారు.  అవినాష్ రెడ్డి హంతకుడు అని ప్రజలు నమ్ముతున్నారు .. సొంత బాబాయిని చంపిన హంతకుడికి మళ్ళీ ఎందుకు సీట్ ఇచ్చారని షర్మిల ప్రశఅనించారు. ప్రజలు నిజాలు తెలుసుకున్నారు అని ఎందుకు మార్చాలని చూస్తున్నారని మండిపడ్డారు.  కడప ప్రజలకు జగన్ సమాధానం చెప్పాలన్నారు. 


సొంత బాబాయిని చంపిన వ్యక్తిని ఎందుకు వెనకేసుకు వస్తున్నారని జగన్ ను ఆమె ప్రశ్నించారు. ఐదేళ్లుగా హంతకుడు తప్పించుకు తిరుగుతున్నాడని, అవినాష్ రెడ్డి హంతకుడు అని సీబీఐ అన్ని ఆధారాలు బయట పెట్టిందని షర్మిల తెలిపారు. అయినా ఎటువంటి చర్యలు లేవన్నారు.  అవినాష్ రెడ్డి దోషి అని తెలిసినా సీబీఐ ఆయన వెంట్రుక కూడా పీకలేక పోయిందని షర్మిల విమర్శించారు. ఈ అన్యాయాన్ని ఎదురించేందుకే నేను ఎంపీగా పోటీ చేస్తున్నాన్నారు. అన్యాయం ఒక వైపు, అధర్మం ఒకవైపు, ఒకవైపు వైఎస్ఆర్ బిడ్డ, ఆ తాను 5 రోజులుగా కడపలో ప్రచారం చేస్తున్నానని, తమ ప్రచారానికి వైసిపీలో వణుకు పుడుతుందన్నారు. అందుకే అవినాష్ రెడ్డిని మార్చాలని చూస్తున్నట్లు తమకు తెలిసిందన్నారు. అవినాష్ రెడ్డిని ఉంచినా,మార్చినా జగన్ మాత్రం కడప ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.


తాను ఇదే జమ్మలమడుగు క్యాంబెల్ ఆసుపత్రిలో పుట్టానని..  ఇది నా జన్మస్థలమని షర్మిల అన్నారు. వైఎస్ఆర్,వివేకా మీ నాయకులు ..ప్రజా నాయకులు..గొప్పవాళ్ళన్నారు. మాతో ఎలా ఉన్నారో...ఈ ప్రజల కోసం కూడా అలాగే ఉన్నారని గుర్తు చేసుకున్నారు.   కడప జిల్లా కు స్టీల్ ప్లాంట్ తీసుకు రావాలని వైఎస్ కలలు కన్నాడు ..స్టీల్ ప్లాంట్ వస్తె లక్ష మందికి ఉద్యోగాలు వస్తాయి అనుకున్నారు ..వైఎస్ఆర్ వెళ్ళిపోయాక ఆ ప్రాజెక్ట్ ను శంకుస్థాపన ప్రాజెక్ట్ గా మార్చారన్నారు. చంద్రబాబు ఒక సారి..జగన్ రెండు సార్లు శంకుస్థాపన చేశారని.. వైఎస్ఆర్ కలల ప్రాజెక్ట్ కే దిక్కులేదన్నారు.  అన్యాయం ఒక వైపు... అధర్మం ఒకవైపు ..ఒకవైపు వైఎస్ఆర్ బిడ్డ...ఆ వైపు వివేకా హత్య నిందితుడు మరో వైపు ఉన్నారన్నారు.  
 
మరోవైపు వివేకా రాజకీయ అజాత శత్రువని ఆయన కుమార్తె సునీత గుర్తుచేశారు. ఆయనకు ఎవరి మీద కోపం ఉండదన్నారు. పని కావాలి అంటే వెంట తీసుకొని వెళ్ళేవాడన్నారు.అటువంటి మంచి మనిషిని దారుణంగా నరికి చంపారని ఆరోపించారు.తలమీద ఏడు సార్లు గొడ్డలితో నరికారన్నారు. తమ కుటుంబ సభ్యులే చంపారు అని తెలిసి ఎంతో బాధ పడ్డామన్నారు. వివేకా హత్య తమ సొంత విషయం కాదని, ఇది కడప జిల్లా ప్రజల విషయం అన్నారు. శాంతి,భద్రతల అంశమన్నారు.హత్య ఎవరు చేశారో అందరికీ తెలుసని, హత్యచేసిన నిందితులకు శిక్ష పడాలని పోరాటం చేస్తున్నామన్నారు. న్యాయం వైపు నిలబడ్డ వైఎస్ షర్మిల రెడ్డిని గెలిపించాలని కోరారు.