Trains cancelled: పలు డివిజనన్లలో రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. పలు మార్గాల్లో పనుల నిర్వహణ, సాంకేతిక కారణాల దృష్ట్యా పెద్ద ఎత్తున రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. అలాగే మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో నిర్వహణ పనుల నిమిత్తం పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు-విశాఖపట్నం (17239) సింహాద్రి ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం-మచిలీపట్నం (17220) రైలును సెప్టెంబరు 5 నుంచి 10వ తేదీ వరకు రద్దు చేశారు.
9వ తేదీ వరకు ఈ రైళ్లు రద్దు
విశాఖపట్నం-గుంటూరు (17240) రైలును 6 నుంచి 11 వరకు, విశాఖపట్నం-విజయవాడ (22701), విజయవాడ-విశాఖపట్నం (22702) ఉదయ్ ఎక్స్‌ప్రెస్‌ను 5, 6, 8, 9 తేదీల్లో రద్దు చేసినట్లు ప్రకటించారు. గుంటూరు - రాయగడ ఎక్స్‌ప్రెస్ (17243), మచిలీపట్నం-విశాఖపట్నం (17219), విశాఖపట్నం-లింగంపల్లి (12805) జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లను ఈ నెల 9 వరకు రద్దు చేశారు.
ఈ రైళ్లు 10 వరకు రద్దు
అలాగే లింగంపల్లి-విశాఖపట్నం (12806) జన్మభూమి ఎక్స్‌ప్రెస్, రాయగడ-గుంటూరు (17244), విజయవాడ-విశాఖపట్నం (12718), విశాఖపట్నం - విజయవాడ (12717) రత్నాచల్‌లను 10 వరకు రద్దుచేసినట్లు తెలిపారు. తిరుపతి-విశాఖపట్నం (22708) డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ 6, 8 తేదీల్లో సామర్లకోట వరకే నడుస్తుందని, విశాఖలో బయల్దేరాల్సిన విశాఖపట్నం-తిరుపతి (22707) రైలు 7, 9 తేదీల్లో సామర్లకోట స్టేషన్ నుంచి బయలుదేరుతుందని ప్రకటించింది.
హైదరాబాద్‌లో..
సాంకేతిక కారణాల దృష్ట్యా వివిధ మార్గాల్లో 20 దూరప్రాంతాల రైళ్లను, నగరంలోని వివిధ మార్గాల్లో నడిచే మరో 16 ఎంఎంటీఎస్ రైళ్లను ఈ నెల 4 నుంచి 10 వరకు రద్దు చేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.
రద్దైన దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లు ఇవే
కాజీపేట్ – డోర్నకల్, విజయవాడ–డోర్నకల్, భద్రచాలం రోడ్–డోర్నకల్, కాజీపేట్–సిర్పూర్ కాగజ్‌నగర్, బల్లార్ష– కాజీపేట్, సికింద్రాబాద్–వరంగల్, సి ర్పూర్ టౌన్–భద్రాచలం, వరంగల్– హైదరాబాద్, కరీంనగర్–సిర్పూర్‌టౌన్, కరీంనగర్–నిజామాబాద్, కాజీపేట్–బల్లార్ష తదితర మార్గాల్లో రైళ్లు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఎంఎంటీఎస్‌లు రద్దు
ఈ నెల 4 నుంచి 10 వరకు లింగంపల్లి–నాంపల్లి, లింగంపల్లి–ఫలక్‌నుమా, ఉందానగర్–లింగంపల్లి, నాంపల్లి–లింగంపల్లి, తదితర మార్గాల్లో 16 సర్వీసులు రద్దు కానున్నట్లు వెల్లడించారు. ప్రయాణికులు రైళ్ల రద్దు విషయాన్ని గుర్తించాలన్నారు. ప్రయాణాల్లో మార్పులు చేసుకోవాలని కోరారు.