Senior Citizen Savings Scheme: చాలా మందికి రిటైర్మెంట్ తర్వాత తగిన ఆదాయం ఉండదు. ఇన్నాళ్లు ఉద్యోగం చేసిన సంపాదించిన మొత్తాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే.. లైఫ్ సాఫీగా సాగిపోతుంది. ఇలాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వం సూపర్ స్కీమ్ అమలు చేస్తుంది. అదే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS). 60 సంవత్సరాలు పైబడిన వ్యక్తుల ఈ స్కీమ్ కు అర్హులు. కనీసం రూ. 1000 నుండి రూ. 30 లక్షల వరకు 5 సంవత్సరాల కాలానికి పెట్టుబడి పెట్టవచ్చు. దీనిపై ప్రస్తుతం ఏడాది 8.2% వడ్డీ లభిస్తుంది.
ఈ స్కీమ్ లో ఒకేసారి డబ్బు డిపాజిట్ చేయవచ్చు. దానిపై వచ్చే వడ్డీతో ప్రతీ మూడు నెలలకోసారి ఆదాయం పొందవచ్చు. సరిగ్గా ప్లాన్ చేసుకుంటే నెలకు రూ.20,000 పైగా వస్తుంది. కేంద్ర ప్రభుత్వ స్కీమ్ కాబట్టి మీ డబ్బుకు ఢోకా లేదు. పైగా రిస్క్ లేని స్కీమ్. చాలా బ్యాంకుల ఫిక్స్ డ్ డిపాజిట్ల కన్నా ఈ స్కీమ్ వడ్డీ రేటు ఎక్కువ.
Also Read: ఆడపిల్లల కోసం కేంద్ర ప్రభుత్వ టాప్ 4 స్కీమ్స్ ఇవే! వీటిలో చేరితే భవిష్యత్ బంగారమే!
ముఖ్య వివరాలు
- 5 సంవత్సరాలకు పెట్టుబడి (మరో 3 సంవత్సరాలు పొడిగించవచ్చు)
- 60 ఏళ్లు పైబడిన వారు అర్హులు
- కనీస పెట్టుబడి - రూ. 1,000
- గరిష్ట పెట్టుబడి - రూ. 30 లక్షలు
- వడ్డీ రేటు - 8.2%
- సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనం
Also Read: డ్వాక్రా మహిళల కుమార్తెల పెళ్లికి రూ.1 లక్ష లోన్! కల్యాణ లక్ష్మి స్కీమ్ దరఖాస్తు విధానం ఇదే!
SCSS పన్ను ప్రయోజనాలు
- SCSS పథకంలో పెట్టుబడి మొత్తానికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద మినహాయింపుగా క్లెయిమ్ చేసుకోవచ్చు. కొత్త పన్ను విధానం కింద సెక్షన్ 80C ప్రయోజనాలు పొందలేరు.
- SCSS ఖాతాలలో మొత్తం వడ్డీ ఏడాదికి రూ. 1 లక్ష దాటితే టీడీఎస్ చెల్లించాలి.
- 60 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న వారు ఈ అకౌంట్ ఓపెన్ చేస్తే, మొత్తం వడ్డీ ఏడాదికి రూ. 50,000 దాటితే టీడీఎస్ కట్ అవుతుంది.
అర్హతలు
- 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు ఈ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు.
- 55-60 ఏళ్ల వయస్సు ఉండి, రిటైర్ అయిన ఉద్యోగులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందిన మొదటి నెలలోపు SCSS ఖాతాను తెరవవచ్చు.
- 50- 60 ఏళ్లు వయస్సు ఉన్న రక్షణ శాఖ ఉద్యోగులు, పదవీ విరమణ ప్రయోజనాలు పొందిన మొదటి నెలలోపు SCSS ఖాతాను తెరవవచ్చు. అయితే ఈ అకౌంట్ ను జీవిత
- భాగస్వామితో కలిసి మాత్రమే తెరవవచ్చు.
- ఎన్ఆర్ఐలు, హిందూ అన్ డివైడెట్ ఫ్యామిలీలు అర్హులు కారు.
- ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి పాన్, ఆధార్ తప్పనిసరి.
Read Also: వంద రోజుల్లో రిటైర్మెంట్ బకాయిలకు 6000 కోట్లు, జూన్ 1 లోగా హెల్త్ కార్డులు: రేవంత్ రెడ్డి
అకౌంట్ క్లోజ్ చేస్తే జరిమానా
- ఏడాదిలోపు ఖాతాను మూసివేస్తే.. చెల్లించిన వడ్డీని అసలు నుంచి వసూలు చేస్తారు.
- 1-2 ఏళ్ల మధ్య ఖాతాను క్లోజ్ చేస్తే అసలుపై 1.5% ఫైన్ విధిస్తారు.
- 2 సంవత్సరాల తర్వాత క్లోజ్ చేస్తే మొత్తంపై 1% జరిమానా సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ సింగిల్ అకౌంట్‌లో గరిష్ఠంగా రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. జాయింట్ అకౌంట్ అయితే రూ.30 లక్షల వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఉదాహరణకు మీరు రూ.30 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఏడాదికి రూ.2.46 లక్షలు వడ్డీ రూపంలో వస్తుంది. అంటే ప్రతీ మూడు నెలలకు రూ.61,500, నెలకు సుమారు రూ.20,500 ఆదాయం వస్తుంది. రిటైర్మెంట్ తర్వాత స్థిరమైన ఆదాయం కోసం ఇది మంచి ఎంపిక.
SCSS ఖాతా ఎలా ఓపెన్ చేయాలి?
పోస్టల్ వెబ్‌సైట్ నుంచి SCSS అకౌంట్ ఓపెన్ చేయడానికి అప్లికేషన్ ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ ను నింపి.. తగిన డాక్యుమెంట్స్ తో పోస్ట్ ఆఫీస్ సబ్మిట్ చేసి ఈ అకౌంట్ ను ఓపెన్ చేయవచ్చు.
కావాల్సినవి
- రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు
- పాన్ కార్డు, ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు లేదా పాస్‌పోర్ట్ వంటి గుర్తింపు కార్డులు
- ఆధారు కార్డు లేదా టెలిఫోన్ బిల్లు వంటి అడ్రస్ ఫ్రూఫ్
- పాన్ కార్డు లేదా డేట్ ఆఫ్ బర్త్ లేదా సీనియర్ సిటిజన్ కార్డు వయస్సు రుజువు
- ఈ డాక్యుమెంట్స్ ను స్వయంగా ధ్రువీకరించి సబ్మిట్ చేయాలి.
