Anantapuram News : శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సి పాలిటీ పరిధిలోని మేళాపురం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఎల్ఎఎన్ ఆదినారాయణను అధికారులు ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. దీనికి కారణం దైవ దర్శనానికి వెళ్లిన తాను మొక్కులు చెల్లించుకున్నానని .. తలనీలాలు సమర్పించుకుని విధులకు హాజరైతే ఫేషియల్ రికగ్నైషన్ యాప్‌లో గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయం మీడియాలో వైరల్ అయింది. అదే ఆయనకు ఇబ్బంది తెచ్చి పెట్టింది. ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా వ్యవహరించారని ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింద.
ముఖ హాజరు కోసం టీచర్లందరితో కొత్త యాప్ డౌన్ లోడ్ చేయించిన ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వం ఇటీవల టీచర్లకు ఫేషియల్ రికగ్నేషన్ హాజరును అమల్లోకి తెచ్చింది. ఎవరి ఫోన్‌లో వారు యాప్ ఫేస్ రిజిస్ట్రేషన్ చేసుకుని.. స్కూలుకు చేరుకున్న తర్వాత సెల్ఫీ తీసుకుని అందులో అప్ లోడ్ చేాయలి. అయితే ఈ యాప్ మనిషిని గుర్తు పట్టాలి. సెల్ఫీ తీసుకుంటున్నప్పుడు గతంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటి ఫోటోలోలానే ఉండాలి. అయితే ఎల్ఎఎన్ ఆదినారాయణఆ తరువాత మొక్కులో భాగంగా గుండు కొట్టించుకున్నారు. మీసాలు తొలగించారు. జుట్టు, మీసం లేని కారణంగా ఆ తర్వాతి రోజు ముఖహాజరు నమోదు కాలేదు. విషయాన్ని ఆయన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.
ముఖ హాజరు యాప్‌తో ఇబ్బందులు పడుతున్న టీచర్లు - టెక్నికల్ సమస్యలను మీడియాకు చెబుతున్న టీచర్లు
అయితే ఆదినారాయణ ఈ విషయాన్ని పత్రికలకు కూడా తెలిపాడు. దీంతో దీంతో ఆయన బాధ హైలెట్ అయింది. ప్రభుత్వం ఇలాంటి పిచ్చి పనులు చేస్తూ ఉద్యోగుల్ని ఇబ్బంది పెడుతోందన్న విమర్శలు వచ్చాయి. దీంతో ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై విచారణకు ఆదేశించారు. దీనిపై ఉపాధ్యాయుడికి 17న మెమో జారీచేశారు. దీనికి ఉపాధ్యాయుడు ఆదినారాయణ వివరణ ఇచ్చారు. ఆ వివరాలను పత్రికలకు తాము ఇవ్వలేదని ఆ ఉపాధ్యా యుడితో పాటు ఎంఈవో వివరణ ఇచ్చుకున్నారు. అయినా ఆదినారాయణను సస్పెండ్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.
మీడియాకు చెప్పి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చారని టీచర్ ఆదినారాయణనను సస్పెండ్ చేసిన డీఈవో
ఉత్తర్వుల్లో కూడా సస్పెన్షన్ కారణాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ముఖ హాజరు విషయంలో ఉన్న లోపాలను పత్రికలు తెలిసేలా చేసినందుకు సస్పెండ్ చేస్తున్నామని ఉత్తర్వుల్లో డీఈవో మీనాక్షి పేర్కొన్నారు. దీంతో ఉపాధ్యాయులు అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేయడం కరెక్ట్ కాదంటున్నాు. యాప్‌లోని లోపాలను సరిచేయకుండా ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవడం బాధాకరమని ఏపీటీఎఫ్ పట్టణాధ్య క్షుడు అంజనమూర్తి వ్యాఖ్యానించారు. తక్షణం ఉపాధ్యాయుడు ఆది నారాయణపై సస్పెన్షన్ ఎత్తివేయాలన్న డిమాండ్‌ను ఉపాధ్యాయ సంఘాల నేతలు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది.
14 మంది ఇప్పటం రైతులకు ఒక్కొక్కరికి రూ. లక్ష జరిమానా - కోర్టును తప్పుదోవ పట్టించారని హైకోర్టు ఆగ్రహం