14 సంవత్సరాలు ముఖమంత్రిగా పని చేసినప్పుడు బీసీలను అడుగడునా మోసం చేసిన చంద్రబాబుకు బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని వైయస్సార్ సిపి రాష్ర్ట ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. సమస్యలు పరిష్కరించమని వెళ్తే తోకలు కత్తిరిస్తానని అవమానాల పాలు చేసిన చంద్రబాబు నేడు బీసీల ఓట్ల కోసం దొంగనాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. బీసీలు అన్ని రంగాలలో అభివృధ్ది చెందాలంటూ వారికోసం నిరంతరం తపిస్తూ వారిలో నాయకత్వలక్షణాలను ప్రోత్సహిస్తున్న శ్రీ వైయస్ జగన్ అండగా రాష్ర్టంలోని బీసీలంతా ఉన్నారని సజ్జల స్పష్టం చేశారు. చంద్రబాబు మాయమాటలను నమ్మేస్దితిలో బీసీలు లేరని అన్నారు. తాడేపల్లిలోని వైయస్సార్ సిపి కేంద్ర కార్యాలయంలో జరిగిన వడ్డెర్ల ఆత్మీయసమావేశానికి ముఖ్యఅతిధిగా హాజరై ప్రసంగించారు.
ఈ సందర్బంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘‘తెలుగుదేశం పార్టీ దుస్సాహసానికి ఒడిగడుతోంది. ఇది కొత్తగా పార్టీ పెట్టిన వాళ్లో,కమ్యూనిస్టు పార్టీ లాంటివాళ్లో బీసీ డిక్లరేషన్ పెట్టారంటే అర్ధముంటుంది. మూడు సార్లు అదికారంలోకి వచ్చినా 14 ఏళ్ళు ప్రజలు అవకాశం ఇచ్చినా ప్రతిసారి చంద్రబాబు బీసీలను మోసం చేస్తూనే ఉన్నారు. నరేంద్రమోది,పవన్ కల్యాణ్ సహకారంతో 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు అదీకూడా కేవలం 1 శాతం ఓటుతేడాతో అధికారంలోకి వచ్చారు. జన్మభూమి కమిటీలను మాఫియా గ్యాంగ్ ల్లాగా తయారుచేశారు. జన్మభూమి కమిటీలనే వ్యవస్ధను టిడిపి ప్రయోజనాలకోసం రూపొందించారు. పెన్సన్లు,మరే లబ్ది కావాలన్నా కూడా ఆ కమిటీల ద్వారా నడిచేవి.లేని మరుగుదొడ్లు,నీరు చెట్టు పధకం ద్వారా ఆ దోపిడీ విపరీతంగా సాగిందన్నారు.
ఆ అక్రమాలు, దోపిడీల నేపధ్యంలో ప్రజలు చంద్రబాబును 2019లో చెత్తబుట్టలో పడేశారు. జగన్ అనేక ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొని ముఖ్యంగా 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు లాక్కున్నా కూడా ఆ విషయాన్ని ప్రజలలోకి తీసుకువెళ్లారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ప్రజా సంకల్పయాత్ర చేశారు. ప్రజలతో మమేకమైన జగన్ గారిని ప్రజలు అక్కున చేర్చుకుని 151 స్ధానాలతో తిరుగులేని విధంగా ఘనవిజయాన్ని అందించారు.అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మేలు చేసే విధంగా గ్రామసచివాలయాలను వాలంటీర్ల వ్యవస్ధను తీసుకువచ్చారు.
ఇక్కడ అందరూ గుర్తించాల్సింది ఏమంటే రానున్నఎన్నికలలో మారీచులకంటే మాయోపాయాలు పన్నే,కుట్రలు చేసేవారితో యుధ్దం చేస్తున్నాం. ఎలాగైనా సరే అధికారం చేపట్టాలనే భావనతో చంద్రబాబు లాంటి వారు ఉన్నారు. బీసీలకు ఎంతగా ప్రయారిటీ ఇస్తారంటే వడ్డెర్లకు సంబందించి చూస్తే గుంటూరులో చంద్రగిరి ఏసురత్నం లాంటి వాళ్ళు ఎంఎల్ ఏగా విజయం సాధించలేని పరిస్దితి ఉంటే ఆయనకు శాసనమండలి సభ్యులుగా అవకాశం కల్పించారు. బీసీ డిక్లరేషన్ అని మాట్లాడే అర్హత చంద్రబాబుకు ఏమాత్రం లేదన్నారు.ఓటుబ్యాంకుగా వాడుకుని అధికారం వచ్చాక వారిని మోసం చేశారన్నారు.పచ్చమీడియాతో కలసి మాఫియాలాగా తయారు చేసి బీసీ డిక్లరేషన్ అంటూ బీసీ లను ఉద్దరిస్తానంటూ బయల్దేరారన్నారు.అయితే బీసీలు ఎంతో చైతన్యవంతులైయ్యారని వారికి జగన్ గారు చేసిన మేలు వారికోసం అమలు చేస్తున్న సంక్షేమపధకాలు వారి మనస్సుల్లో చెరగని ముద్ర వేశాయన్నారు.
పురందేశ్వరి, షర్మిల, సీపీఐ, సీపీఎం, దత్తపుత్రుడితో పాటు ఇప్పుడు మేధావులు అంటూ మరికొందరు జగన్ పై దుష్ప్రచారానికి ఒడిగట్టారు. వాటిని నమ్మే పరిస్దితిలో ప్రజలు లేరు. చంద్రబాబుకు నిజంగా బలం ఉంటే పొత్తులకోసం ఎందుకు వెంపర్లాడుతున్నారు. 2014-19 మధ్య ప్రజలకు ఏమీ చేశారో చెప్పి ప్రజలను ఓట్లడిగే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. వాలంటీర్ల వల్ల ప్రజలకు మంచి సేవలందుతున్నాయని గర్వంగా చెప్పగలం. మీ హయాంలో దోపీడీలు చేసిన జన్మభూమి కమిటీ లు మళ్ళీ తెస్తామని చంద్రబాబు చెప్పగలరా అని ప్రశ్నించారు. జగన్ పై రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగత విమర్శలు చేస్తూ... గొడ్డలి పోటు అంటూ విషప్రచారం చేస్తున్నారని విమర్శించారు.