Sajjala Instructions to Guntur YSRCP leaders:


గుంటూరు నేతలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ ఇచ్చారు. కలసి పని చేసుకోకుంటే మీకే నష్టమని ఆయన తెగేసి చెప్పారు.


గుంటూరు నేతలతో సమావేశం...
గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకత్వంతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశం అయ్యారు. తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశానికి గుంటూరు నగరంలోని 2 నియోజకవర్గాలకు చెందిన శాసన సభ్యులు హజరయ్యారు. వీరితో పాటుగా గుంటూరు నగర పాలక సంస్థ మేయర్ కావటి శివకోటి మనోహర్ నాయుడు హజరయ్యారు. పార్టీ నాయకత్వంలో ఉన్న విభేదాలు పైనే ఈ సమావేశంలో కీలకంగా చర్చించారు. శాసనసభ్యుడు ముస్తఫాకు గుంటూరు నగర మేయర్ శివకోటి నాగ మనోహర్ నాయుడు కు మధ్య ఇటీవల వివాదం చోటు చేసుకోవటం, అధికారిక సమావేశంలో పరస్పరం విమర్శలు చేసుకోవటంపై కూడా సమావేశంలో చర్చించినట్లుగా చెబుతున్నారు.


గుంటూరు నేతలకు క్లారిటీ ఇచ్చిన సజ్జల...
గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో మేయర్ మనోహర్ నాయుడు, ముస్తాఫా మధ్య ఇటీవల కలంలో వరుసగా విభేదాలు బహిర్గతం అవుతున్నాయి. ఈ వ్యవహరంతో పార్టీలోని ఇతర నేతలకు ఇబ్బందిగా మారింది. దీంతో ఈ వ్యవహరంపై గుంటూరుకు చెందిన శాసనమండలి సభ్యుడు, పార్టీ కేంద్ర కార్యాలయం బాధ్యతలు చూస్తున్న అప్పిరెడ్డి ఇటీవల గుంటూరులోనే ఇరువురు నాయకులతో సమావేశం అయ్యారు. అయితే ఇద్దరు నేతల మధ్య పంచాయితీ మాత్రం కొలక్కి రాలేదు. దీంతో పార్టీలో కీలక నేత, ప్రధాన కార్యదర్శి సజ్జలతో మరోసారి సమావేశం అయ్యారు. గుంటూరుకు చెందిన ప్రధాన నాయకులు ఈ సమావేశానికి హజరయ్యారు. అభిప్రాయ భేదాలను పక్కన పెట్టిన వచ్చే ఎన్నికలకు కేంద్రంగా చేసుకొని కలసి పని చేయాలని లేదంటే, జరిగే భవిష్యత్ లో జరిగే నష్టానిక అందరూ భాద్యత వహించాల్సి ఉంటుందని సజ్జల నేతలకు స్టైట్ వార్నింగ్ ఇచ్చారని చెబుతున్నారు.


పదేళ్ళ తరవాత ఎన్నికలను నిర్వహించింది వైసీపీనే...
గుంటూరు నగర పాలక సంస్థకు  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గర సంబంధాలు ఉన్నాయని ఈ విషయంలో పార్టీ నాయకత్వం ఆచి తూచి వ్యవహరించకుంటే పరిణామాలు వ్యతిరేకంగా మారే అవకాశం లేకపోలేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. గుంటూరు నగర పాలక సంస్థకు 10 సంవత్సరాలకు పైగా ఎన్నికలను నిర్వహించలేదు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత నిర్వహించిన కార్పోరేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కార్పోరేషన్ పై ఎగిరింది. దీంతో గుంటూరు ను పార్టీ నాయకత్వం కంచుకోటగా భావిస్తోంది. అయితే ఇదే సమయంలో నాయకుల మధ్య విభేదాలు బాహాటంగా బయటకు వస్తే పార్టీకి నష్టం జరుగుతుందన్నన విషయం పై అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే గుంటూరుకు చెందిన నాయకులను ఎక తాటి పైకి నడిపించేందుకు పార్టీ అగ్రనాయకత్వం ఫోకస్ పెట్టిందని చెబుతున్నారు. 
Also Read: Kodali Nani : ఐటీ నుంచి తప్పించుకున్నా ప్రజల నుంచి తప్పించుకోలేరు - చంద్రబాబుపై కొడాలి నాని ఆగ్రహం!