Sajjala :  తిట్టిన నోటితోనే చంద్రబాబు బీజేపీని పొగుడుతున్నారని ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో చంద్రబాబు వంగి వంగి.. నంగి నంగి మాట్లాడారని మండిపడ్డారు. చంద్రబాబు బపూన్ కు ఎక్కువ జోకర్‌కు తక్కువ అని మండిపడ్డారు. పొత్తు లేకుండా ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన చంద్రబాబుకు ఎప్పుడూ రలేదని..  రాజకీయాలు ప్రజల కోసం చేయాలన్నారు.  బీజేపతో పొత్తుకు చంద్రబాబు తహతహలాడుతున్నారని  ఇప్పుడు ఢిల్లీ  వెళ్లి చంద్రబాబు హడావుడి చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ఏపీ పరువు తీస్తున్నారని  విమర్శించారు. 2019 వరకూ చంద్రబాబు ప్రజలకు ఏమి చేశారో చెప్పాలన్నారు. తెలుగుదేశం పార్టీ 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు ఎన్ని నియోజకవర్గాల్లో టీడీపీ పోటీ చేస్తుందో.. చంద్రబాబుకే క్లారిటీ లేదన్నారు. పురందేశ్వరి టీడీపీ ఏజెంట్ లా మారారని సజ్జల ఆరోపించారు.  లోకేష్ పాదయాత్రకుత టీడీపీ కార్యకర్తలే రావడం లేదన్నారు. 


ప్రజలను భ్రమల్లో పెట్టాలనుకునేవాళ్లు.. భ్రమల్లోనే వుంటారని సజ్జల వ్యాఖ్యానించారు.  అవసరం వున్నప్పుడల్లా ఇప్పటికీ ఎన్టీఆర్‌ను చంద్రబాబు వాడుకుంటున్నారని సజ్జల ఆరోపించారు. దగ్గుబాటి పురంధేశ్వరి టీడీపీ ఏజెంట్‌లా మారారని.. బీజేపీతో కలిసేందుకు పురందేశ్వరి, పవన్‌తో పైరవీలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రపతి భవన్ లో చంద్రబాబు అండ్ కో తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం కేంద్రంగా మలచుకున్నారని సజ్జల పేర్కొన్నారు. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతికి అవకాశం ఇవ్వకపోవటం సరి కాదన్నారు. 1994లో ఎన్టీఆర్ అందరి సమక్షంలోనే లక్ష్మీ పార్వతి తన సతీమణిగా పరిచయం చేసారని గుర్తు చేసారు.ఆ సమయంలో జరిగిన ఎన్నికల్లోనూ పార్టీ తరపున ఎన్టీఆర్ తో కలిసి లక్ష్మీపార్వతి ప్రచారం చేసారని సజ్జల చెప్పుకొచ్చారు. అసలు లక్ష్మీపార్వతికి ఎన్టీఆర్ తో సంబంధం లేదని చెప్పగలరా అని సజ్జల ప్రశ్నించారు. లోకేశ్ యాత్రకు కార్యకర్తలే రావటం తేదన్నారు. ప్రజలకు ఏం చేస్తామో చెప్పే ధైర్యం టీడీపీకి లేదని సజ్జల పేర్కొన్నారు. ఎవరు పొత్తులతో వచ్చినా..ప్రజలు తమతోనే ఉన్నారని సజ్జల ధీమా వ్యక్తం చేసారు.       


ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిక గురించి ప్రతిపక్షాలు మాట్లాడటంపై సజ్జల కీలక విశ్లేషణ చేసారు. ముఖ్యమంత్రి జగన్ పూర్తిగా పాజటివ్ ఓటింగ్ పైనే నమ్మకంతో ఉన్నారని సజ్జల వెల్లడించారు. ప్రస్తుతం 70 శాతం మేర పాజిటివ్ ఓటింగ్ ఉందని, కొంత తగ్గినా 60 శాతం వైసీపీకి పాజిటివ్ ఓటింగ్ ఉందని పేర్కొన్నారు.ప్రతిపక్షాలు మిగిలిన ఓటింగ్ శాతంలో చీలిక లేకుండా చేసినా.. కలిసి పోటీ చేసినా ప్రభావం ఉండదని సజ్జల తేల్చి చెప్పారు. అసలు టీడీపీ 175 స్థానాల్లో పోటీ చేసే పరిస్థితి లేదని, అటువంటి పార్టీ వైసీపీ గురించి మాట్లాడుతుందని ఎద్దేవా చేసారు. చంద్రబాబు చెబుతున్నట్లుగా ప్రజలు టీడీపీకి బ్రహ్మరధం పడితే పొత్తులు ఎందుకని సజ్జల ప్రశ్నించారు.