Tirumala Sajjala :  ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ది, సంక్షేమం బ్రహ్మాండంగా ఉన్నాయని వాటిని అడ్డుకునేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. తిరుమలలో శ్రీవాిని కుటుంబంతో కలిసి సజ్జల రామకృష్ణారెడ్డి దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరంరంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు...శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసాసి పట్టువస్త్రంతో సత్కరించారు. 


ఏపీ ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాలకూ ఆద్శంగా ఉందన్న సజ్జల రామకృష్ణారెడ్డి 


ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.  ఆంధ్రప్రదేశ్ లో‌ జరుగుతున్న సంక్షేమం, అభివృద్ధి సీఎం‌ జగన్మోహన్ రెడ్డి న్యాయకత్వంలో ఇలాగే కొనసాగాలని స్వామి వారి ప్రార్ధించానన్నారు. దేశంలోనే ఏపి ప్రభుత్వం అగ్రగామిగా నడుస్తుందని, అంతే కాకుండా ఆదర్శవంతంగా ఏపి రాష్ట్రం ఉందని తెలిపారు. విష శక్తులు, రాక్షస దూతలు కుట్ర పూరితంగా ఏపిలో జరుగుతున్న యజ్ఞంను కుట్ర, కుయుక్తులు అడ్డుకుంటునే ఎదుర్కొనే శక్తిని సీఎంకి ప్రసాదించాలని కోరుకున్నట్లు తెలిపారు.  ప్రజల ఆదరణ  సీఎం జగన్మోహన్ రెడ్డికి వెయ్యి పెర్టుల పెరిగిందని జోస్యం చెప్పారు.  విశాఖ రాజధానిగాగా ఎప్పుడైనా కావచ్చు, త్వరలోనైనా కావచ్చని చెప్పారు. 


కొత్త ఏడాదిలో కూడా సీఎం జగన్ కు స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లుగా చెప్పిన కొడాలి నాని 


మాజీ మంత్రి కొడాలి నాని కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరంరంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు...శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసారు. ఆలయం వెలుపలగుడివాడ ఎమ్మెల్యే కోడలి నాని మాట్లాడుతూ....ధనుర్మాసంలో శ్రీవారిని దర్శించుకునేందు రావడం జరిగిందన్నారు. జనవరి, వైకుంఠ ఏకాదశి రోజు భక్తులకు ఇబ్బంది కలుగకుండా ఉండాలనే ముందే స్వామి వారిని దర్శించుకున్నానని తెలిపారు. స్వామి వారి ఆశీస్సులు సీఎంపై 2023లో కూడా ఉండాలని ప్రార్ధించానన్నారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు. 


శ్రీవారిని దర్శించుకున్న కోన రఘుపతి, మెరుగు నాగార్జున 


 ఏపీ మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి , మంత్రి మెరుగు నాగార్జున కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరు కూడా  నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరంరంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు...శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసాసి పట్టువస్త్రంతో సత్కరించారు. 


ధనుర్మాసం సందర్భంగా శ్రీవారిని పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకుంటున్నారు .  ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.  ఇటీవల వీఐపీ విరామ సమయం దర్శనాలను టీటీడీ మార్చింది. అందుకే నైవేద్య విరామం సమయంలోనే వీఐపీలు ఎక్కువగా దర్శించుకుంటున్నారు. శ్రీవాణి స్కీమ్ కింద .. పదివేలు విరాళం ఇచ్చిన వారికి బ్రేక్ దర్శనం  టిక్కెట్లు ఇస్తున్నారు. వారికి  మార్చిన  బ్రేక్ దర్శన సమయాల్లో దర్శన సమయం కేటాయిస్తున్నారు. 


యూత్ ఓటర్లపైనే టీడీపీ గురి - పాదయాత్రతో పక్కా స్కెచ్ వేస్తున్న లోకేష్ !